భారీగా పెరగనున్న ఆ కంపెనీ కార్లు.. కొత్త కారు కొనేవారికి ఇక చుక్కలే! ఈ డెడ్‌లైన్ లోపు కొనేవాళ్లు సేఫ్
భారతదేశంలో మధ్య తరగతి జనాభా ఎక్కువగా ఉంటారు. సొంతంగా కారు కలిగి ఉండటం వారి కల. ఎక్కువ ధర పెట్టి కొనుగోలు చేయడం కంటే తక్కువ ధరలో, మంచి సేఫ్టీ ప్రమాణాలు, అధునాతన ఫీచర్స్ కలిగిన కార్లను ఎంచుకుంటారు. ఇలాంటి వారి కోసం ప్రముఖ వాహన తయారీ కంపెనీ మారుతీ సుజుకీ (Maruti Suzuki) ఎప్పుడూ కూడా అన్ని వర్గాల వారు కొనుగోలు చేసే ధరలో, మెరుగైన సదుపాయాలతో కార్లను విడుదల చేసే కంపెనీగా మంచి పేరును కలిగి ఉంది. సాధారణ, మధ్యతరగతి ప్రజలకు మారుతీ కార్లు అంటే చాలా ఇష్టం. తక్కువ ధరలో అధునాతన కార్లను విడుదల చేయడం ఈ కంపెనీ ప్రత్యేకత. అయితే కొత్త ఏడాదిలో మారుతీ కార్లను తక్కువ ధరలో కొనుగోలు చేయాలనుకునే వారికి తాజాగా చేదు వార్త చెప్పింది. తన కార్ల ధరలు 2025 ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పెంచుతున్నట్లు తెలిపింది.
తన మోడళ్ల ధరలను దాదాపు రూ.32,500 వరకు పెంచుతున్నట్లు గురువారం పేర్కొంది. ప్రస్తుతం నిర్వహణ ఖర్చులు పెరగడం, ఇన్‌పుట్ ఖర్చులు పెరగడం కారణంగా వచ్చే నెల నుంచి ధరలు పెంచాలనే నిర్ణయం తీసుకున్నారు. కార్ల ధరలు పెంచడం వలన కస్టమర్లపై భారం పెరుగుతుంది. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ధరలు పెంచాల్సి వస్తుందని అధికారులు తెలిపారు. కార్ల ధరల పెంపుపై మారుతీ సుజుకీ ఇండియా రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.

కొత్త ఏడాదిలో సంతోషంగా కారు కొనుగోలు చేయాలనే ప్రణాళికలు సిద్ధం చేసుకున్న చాలా మంది ఈ వార్తతో ఒక్క సారిగా షాక్ అయ్యారు. మొదట రూ.1500 నుంచి ధర పెరుగుదల మొదలవుతుంది. గరిష్టంగా రూ.32,500 వరకు ఉంటుంది. ఈ ధరలు మోడల్‌ను బట్టి మారుతుంటాయని మారుతీ సుజుకీ తెలిపింది. మోడళ్ల వారిగా పెరిగిన ధరలను చూసినట్లయితే మారుతీ సియాజ్ కారు ధర రూ.1500 వరకు పెరుగుతుంది.
భారత్‌లో మంచి డిమాండ్ కలిగిన స్విఫ్ట్ కారు ధరూ. 5,000 వరకు పెరిగింది. మరో ఫేవరెట్ మోడల్ డిజైర్ ధర రూ.10,000 పెరిగింది. ఎంట్రీ లెవల్ చిన్న కార్లు ఆల్టో కె10 ధర రూ.19,500 వరకు పెరుగుతుందని మారుతీ సుజుకీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. ఆల్టో కె10 ధర ప్రస్తుతం రూ. 3.99 లక్షలతో ప్రారంభమవుతుంది. వచ్చె నెల నుంచి ఈ కారును కొనేవారు మరింత ఎక్కువ ధర చెల్లించాలి.

మారుతీ ఎస్-ప్రెస్సో ధర రూ.5,000 వరకు పెరగనుంది. ప్రీమియం కాంపాక్ట్ మోడళ్లలో బాగా ప్రసిద్ధి చెందిన బాలెనో ధర రూ. 9,000 వరకు పెరుగుతుంది. మరో కారు కాంపాక్ట్ సెడాన్ డిజైర్ రూ.10,000 వరకు, ఎస్‌యూవీ ఫ్రాంక్స్ ధర రూ.5,500 వరకు పెరుగుతుందని కంపెనీ తెలిపింది. అత్యధికంగా సెలెరియో మోడల్ ధర ఏకంగా రూ.32,500 వరకు పెరుగుతుంది. మారుతీ గ్రాండ్ విటారా ధర రూ.25,000 పెరగనుంది.
ప్రీమియం మోడల్ ఎల్ఎన్విక్టో ధర రూ. 30,000 వరకు పెరుగుతుంది. ఆఫ్ రోడ్ కింగ్ జిమ్నీ కారు ధర రూ.1500 వరకు, ఎర్టిగా మోడల్ ధర రూ. 15,000 వరకు పెరగనుంది. మారుతి ఇగ్నిస్ కారు ధర రూ.6,000, XL6 ధర రూ.10,000 వరకు పెరగనుంది. కొత్తగా మారుతీ కారు కొనాలనే ఆలోచన చేస్తున్న వారు ధరల పెంపుదల అమల్లోకి రాకముందే కొనుగోలు చేయడం ఉత్తమం.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








