ఒకటి అనుకుంటే మరొకటి అయ్యింది.. రెండు కుటుంబాలకు సరిపోయే కారుకు బిగ్ షాక్ తగిలింది!

దేశీయ అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీకి చెందిన ఇన్విక్టో (invicto), భారత ఆటోమొబైల్ రంగంలో ఓ ప్రముఖ MPVగా వెలుగులోకి వచ్చింది. టయోటా, మారుతీ మధ్య ఉన్న టెక్నాలజీ షేరింగ్ భాగస్వామ్య కారణంగా, టయోటా ఇన్నోవా హైక్రాస్ ఆధారంగా రూపొందించబడిన ఈ కారును 2023 జులై నెలలో విడుదల చేశారు. అప్పట్లో, ఇది మారుతి నుంచి వచ్చిన అత్యంత ప్రీమియం MPVగా నిలిచింది. డిజైన్ పరంగా చూస్తే, ఆకర్షణీయమైన బాడీ లైన్స్, స్టైలిష్ గ్రిల్, మస్క్యులర్ ప్రొఫైల్ ఈ కారుకు ప్రత్యేకంగా నిలిచాయి. ఇన్విక్టోలో ఉన్న ఇంటీరియర్ ఇంకా ఫీచర్ల వలన కొనుగోలుదారులను ఆకట్టుకునేలా ఉన్నప్పటికీ, మార్కెట్‌లో ఇది తన స్థానాన్ని నిలబెట్టుకోవడం మాత్రం కష్టంగా మారింది.

తాజాగా విడుదలైన గణంకాల ప్రకారం, మారుతీ ఇన్విక్టో ఇన్విక్టో అమ్మకాలు ఇప్పుడు గణనీయంగా తగ్గిపోయాయి. గతంలో ఉన్న ట్రెండ్ మార్చి నెలలో కూడా మారలేదు. గత నెలలతో పోలిస్తే అమ్మకాల పరంగా ఈ MPV మరింత వెనుకబడి ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ సంవత్సరం మార్చిలో అమ్మకాలు 294 యూనిట్ల వద్దే నిలిచాయి. ఇది 2024లో అదే కాలంలో నమోదైన 348 యూనిట్లతో పోలిస్తే సుమారు 15.52 శాతం తగ్గుదల.

Maruti Suzuki Invicto Mpv

ఇది సాధారణ తగ్గుదల కాదు, కస్టమర్లు తమ ఆలోచనల్లో ఈ కారుపై నమ్మకంలో కొంతమంది వెనుకడుగు వేసినట్లు సూచిస్తోంది. గత ఏడాది అంటే 2024 అమ్మకాలను చూసినట్లయితే, అక్టోబర్‌లో 296 యూనిట్లు అమ్ముడవగా, నవంబర్‌లో సంఖ్య 434కి చేరింది. కానీ డిసెంబర్‌లో కొంత మెరుగైనట్టు అనిపించినా 825 యూనిట్ల విక్రయాలతో అది తాత్కాలిక కొంత కాలం ప్రభావమేనని అనిపించింది. 2025 ప్రారంభంలో పరిస్థితి మళ్లీ డీలా పడింది.

జనవరిలో 556 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. ఫిబ్రవరిలో అవి 380కి తగ్గిపోయాయి. మార్చికి వచ్చేసరికి, విక్రయాల సంఖ్య మరింతగా పడిపోయింది. ప్రీమియం MPV సెగ్మెంట్‌లో ఇప్పటికే బలమైన పోటీదారులు ఉండటం, ఇతర కంపెనీలు పోటా పోటీగా ఇతర మోడళ్లను విడుదల చేయడం వలన ఈ కారు అమ్మకాలు చాలా మేరకు ప్రభావం అయ్యాయి. అమ్మకాలు తగ్గడానికి కంపెనీ దీనికి స్పష్టమైన కారణాలను అధికారికంగా వెల్లడించలేదు.

Invicto Mpv 294 Sales Units Recorded In March 2025

మార్కెట్ వర్గాల అభిప్రాయం ప్రకారం, దాని అధిక ధర వలన కస్టమర్లు కొనుగోలు చేయానికి అంతగా ఆసక్తి చూపించడం లేదు. ఇదే సమయంలో టయోటా కంపెనీకి దాని ప్రసిద్ధ ఎంపీవీ మోడల్ అయినటువంటి ఇన్నోవా హైక్రాస్ కారును కొనడానికి కస్టమర్లు మరింత ఎక్కువ ఇష్టపడటం వల్ల దీని సేల్స్ తగ్గాయని భావిస్తున్నారు. ఇన్విక్టో ప్రస్తుతం మార్కెట్లో రూ. 25.51 లక్షల నుంచి రూ. 29.22 లక్షల(ఎక్స్-షోరూమ్) వరకు కొనుగోలుకు లభిస్తుంది.

ఇది 7 లేదా 8 సీట్ల వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది, పెద్ద కుటుంబాలకు సరిపోయే విధంగా ఉంటుంది. ప్రయాణ సమయంలో సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని, 239 లీటర్ల బూట్ స్పేస్‌ను అందిస్తోంది. ఇది సాధారణ ప్రయాణానికి అవసరమైన లగేజీ సామర్థ్యాన్ని ఈజీగా తీసుకెళ్తుంది. సాధారణ MPV లతో పోలిస్తే, ఇది ఒక మెరుగైన, లేటెస్ట్ డ్యూయల్ పవర్‌‌ట్రెయిన్‌లో రన్ అవుతుంది. ఇన్విక్టోలో 2.0 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్(పెట్రోల్+ఎలక్ట్రిక్) పవర్‌ట్రెయిన్‌ను ఉపయోగించారు.

Invicto Mpv 294 Sales Units

ఇది 186 PS హార్స్‌పవర్‌, 206 Nm పీక్ టార్క్‌ను విడుదల చేస్తుంది. హైబ్రిడ్ టెక్నాలజీ వలన ఇంజిన్ పనితీరు అనుకూలంగా మారి, హైవే రైడింగ్ నుండి సిటీ డ్రైవ్ వరకూ అన్ని పరిస్థితుల్లో అనుకూలంగా ఉంటుంది. ఇది e-CVT గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ముఖ్యంగా ట్రాఫిక్‌లోనూ, లాంగ్ డ్రైవ్‌లలోనూ ఈ e-CVT వ్యవస్థ బాగా ఉపయోగపడుతుంది.

More from DriveSpark

Article Published On: Saturday, April 26, 2025, 7:30 [IST]
English summary
Maruti suzuki invicto mpv 294 sales units recorded in march 2025 details
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+