ఏనుగు సైజు మారుతి కారును చూసి కస్టమర్లు ఇష్టపడుతున్నారు! అమ్మకాల్లో దుమ్ము రేపింది

మారుతి సుజుకి ఇన్విక్టో... పేరే సరిపోతుంది దాని ప్రీమియమ్‌ MPV స్థాయిని చెప్పేందుకు. టయోటా ఇన్నోవా హైక్రాస్ ఆధారంగా రూపొందించిన ఈ మోడల్, మరింత ఆకర్షణీయమైన స్టైలింగ్‌తో, మారుతి బ్రాండ్‌కు తగ్గటువంటి ప్రత్యేకమైన స్టైల్‌ను కలిగి ఉంది. ఇటీవలి జూన్ నెలలో ఈ కారుకు మార్కెట్‌లో మంచి స్పందన లభించింది. మీడియా నివేదికల ప్రకారం, ఒక్క నెల అంటే జూన్ 2025లో ఈ కారు 264 యూనిట్లు అమ్ముడవడం గమనార్హం. గత ఏడాది ఇదే కాలంలో 223 యూనిట్లు అమ్ముడవ్వగా, ఈసారి 18.19 శాతం వృద్ధి నమోదు చేయడం విశేషం. అంటే, మార్కెట్‌లో ఉన్న పోటీకి తగినట్టుగానే ఈ MPV తన స్థిరమైన కొనుగోలుదారుల్ని ఆకర్షిస్తూ ముందుకు సాగుతోంది.

అయితే, ఈ ఏడాది తొలి ఐదు నెలల్లో ఇన్విక్టో అమ్మకాలు మాత్రం కొంచెం ఎగడుదిగుడిగా కనిపించింది. జనవరి నుండి మే వరకు అనేక హెచ్చుతగ్గులతో సాగింది. కొన్ని నెలల్లో డిమాండ్ పెరిగినా, మరికొన్ని నెలల్లో మాత్రం తగ్గుదల కనిపించింది. మొత్తం మీద, ఈ ఐదు నెలల్లో 1,654 యూనిట్లు అమ్ముడుపోయినట్లు రికార్డులు చూపుతున్నాయి. ఈ గణాంకాలను ఓ సగటు పరంగా చూస్తే, నెలకు సుమారుగా 330 యూనిట్లు అమ్ముడవుతున్నట్టు అర్థమవుతుంది.

Maruti Suzuki Invicto Mpv

ఒక ప్రీమియం MPVగా మార్కెట్లో అడుగుపెట్టింది ఇన్విక్టో. ధర విషయంలో చూస్తే, ఈ కారుకు రూ.25.51 లక్షల నుంచి రూ.29.22 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ధరను నిర్ణయించారు. వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, ఈ MPV రెండు ప్రధాన వేరియంట్లలో.. జీటా(Zeta), ఆల్ఫా(Alpha) లలో లభిస్తుంది. వీటిలో జీటా వేరియంట్ కొంతమంది ప్రామాణిక అవసరాల కోసం సరిపోతే, ఆల్ఫా వేరియంట్ మాత్రం అధిక ప్రీమియమం ఫీచర్ల కోసం ఎంపిక చేయవచ్చు.

సౌకర్యం, డిజైన్ మరియు పనితీరు పరంగా మారుతి సుజుకి ఇన్విక్టో, ఫ్యామిలీ వాహనంగా తన స్థానం మరింత బలంగా నిరూపించుకుంటోంది. ఇది ప్రస్తుతం దేశంలో మారుతి సుజుకి నెక్సా డీలర్‌షిప్‌ల ద్వారా మాత్రమే అమ్మకానికి అందుబాటులో ఉంది. కొత్త ఇన్విక్టో MPV పవర్‌ట్రెయిన్ సాంకేతికత నేటి ఆధునిక అవసరాలకు అనుగుణంగా ఉంది. ఇందులో సింగిల్ 2-లీటర్, 4-సిలిండర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్ (పెట్రోల్ + ఎలక్ట్రిక్)ను అమర్చారు.

Maruti Suzuki Invicto Mpv Sales

ఈ హైబ్రిడ్ యూనిట్‌కు e-CVT (ఎలక్ట్రానిక్లీ కంట్రోల్డ్ కంటిన్యూయస్ వేరియబుల్ ట్రాన్స్మిషన్) గేర్‌బాక్స్ జత చేయబడింది. ఇది డ్రైవింగ్‌ను మరింత మృదువుగా, సమర్థవంతంగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ MPV 23.24 కిలోమీటర్ల మైలేజీని లీటర్‌కు అందించగలదు, ఇది ఒక ప్రీమియం MPV సెగ్మెంట్‌లో గణనీయమైన ఫీగర్. పనితీరు విషయానికి వస్తే, ఇన్విక్టో హైబ్రిడ్ కేవలం 9.5 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వేగాన్ని చేరగలదు.

అంతేకాదు, దీని గరిష్ట వేగం 170 కిమీ గంటకు ఉండడం ఈ కారులోని శక్తి సామర్థ్యాన్ని స్పష్టంగా చూపిస్తుంది. అలాంటి సామర్థ్యాన్ని సైలెంట్, ఎలక్ట్రిక్ అసిస్టెన్స్‌తో కలిపి అందించడం ఈ MPVని మరింత ప్రత్యేకంగా నిలబెడుతుంది. ఇన్విక్టో MPV పెద్ద కుటుంబానికి చాలా అనువుగా ఉంటుంది. 7 లేదా 8 సీట్ల కాంబినేషన్‌లో లభ్యం కావడం వల్ల, చిన్న కుటుంబాలే కాకుండా పెద్ద కుటుంబాలు కూడా సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు.

Maruti Suzuki Invicto June Sales

విశాలమైన లెగ్‌రూమ్, హెడ్రూమ్ వల్ల దూర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు ప్రయాణికులకు అలసట లేని అనుభవం లభిస్తుంది. ఇక లగేజీ విషయానికి వస్తే, ఈ MPV 289 లీటర్ల బూట్ స్పేస్‌ను అందిస్తుంది. వారాంతపు ట్రిప్‌లు లేదా సెలవు రోజుల్లో ఎక్కువ సామాన్లతో ప్రయాణించాలన్నా ఎటువంటి సమస్య ఉండదు. అవసరమైతే, చివరి వరుస సీట్లను మడిచి మరింత స్థలాన్ని కూడా పొందవచ్చు.

ఇంధన సామర్థ్యం పరంగా చూస్తే, దీని ఫ్యూయల్ ట్యాంక్ 52 లీటర్ల సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీని ద్వారా ఒకసారి ట్యాంకు నిండిస్తే, హైబ్రిడ్ సిస్టమ్ సహాయంతో దూర ప్రయాణాల్లో ఫ్యూయల్ సమస్యలను తక్కువ చేయవచ్చు. ఇదంతా కలిపి, ఇన్విక్టోను ఫ్యామిలీ టూరింగ్ కోసం సరైన ఎంపికగా నిలబెడుతుంది.

More from DriveSpark

Article Published On: Thursday, July 17, 2025, 7:20 [IST]
English summary
Maruti suzuki invicto mpv june 2025 sales 18 19 percent growth details
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+