రెండు కుటుంబాలకు సరిపోద్ది.. 23 కి.మీల మైలేజ్.. కానీ 201 మంది మాత్రమే కొన్నారు
భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీదారు అయినటువంటి మారుతీ సుజుకీ (maruti suzuki) చాలా కాలంగా తన మోడళ్ల అమ్బకాలతో దూసుకుపోతుంది. విస్తృతమైన మోడళ్లతో అన్ని విభాగాలను ఆక్రమించిన ఈ బ్రాండ్‌కి భారత వినియోగదారుల నుంచి సపోర్ట్‌ను పొందుతుంది. చిన్న హ్యాచ్‌బ్యాక్ నుంచి మిడ్‌సైజ్ SUV వరకు, ఏ సెగ్మెంట్‌లో చూసినా మారుతీ ఒక ఖచ్చితమైన గుర్తింపు కలిగిన పేరుగా నిలిచింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలుమోడళ్లను విక్రయిస్తున్న మారుతీకి చెందిన అన్ని కార్లు కూడా విక్రయాల పరంగా మెరుగైన గణంకాలను సాధించట్లేదు. కొన్ని మాత్రమే కంపెనీ పెట్టుకున్న లక్ష్యాన్ని చేరుకుంటున్నాయి. తాజాగా విడుదలైన అమ్మకాల నివేదిక ప్రకారం, మారుతీ సుజుకీ లైనప్‌లో అత్యంత ప్రీమియం మోడల్ అయిన ఇన్విక్టో గత నెలలో తక్కువ సేల్స్‌ను నమోదు చేసింది.
ఇది మాత్రమే కాకుండా మారుతీ పోర్ట్‌ఫోలియోలో కొన్ని మోడళ్లు ఆశించిన స్థాయిలో స్పందన పొందలేకపోయాయి. మార్కెట్ మార్పులతో పాటు వినియోగదారుల అభిరుచుల మార్పు కూడా ఈ నెమ్మదిగా నడుస్తున్న అమ్మకాల వెనుక ఒక పెద్ద కారణంగా నిలుస్తోంది. అయితే, ఈ తక్కువ అమ్మకాల మోడళ్లలో కొన్ని నిశ్చితంగా తిరిగి పుంజుకునే అవకాశం ఉన్నప్పటికీ, అవి భవిష్యత్తులో నిలదొక్కుకోవాలంటే మారుతీకి కొత్త వ్యూహాలు అవసరం.

గత నెలలో మారుతీ ఎస్‌ప్రెస్సో కేవలం 726 యూనిట్ల అమ్మకాలను మాత్రమే నమోదు చేసింది. ఇదే సమయంలో సియాజ్ కారు 321 యూనిట్లు, జిమ్నీ 431 యూనిట్ల విక్రయాలను నమోదు చేశాయి. అలాగే, మారుతీ ప్రసిద్ధ మోడల్ పోర్ట్‌ఫోలియోలో అత్యంత ప్రీమియంగా నిలిచిన ఇన్విక్టో(invicto) ఏప్రిల్ 2025లో కేవలం 201 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యింది. అయితే ఇది ఏప్రిల్ 2024లో అమ్ముడైన 193 యూనిట్లతో పోలిస్తే 4.15 శాతం వృద్ధి.
ప్రీమియం ఫీచర్లే ఉన్నా కూడా, ఈ MPV కొత్త కస్టమర్లను ఆకర్షించడంలో కొంత వెనకబడింది. ఇన్విక్టో మోడల్ టయోటా ఇన్నోవా హైక్రాస్ ఆధారంగా రూపొందించబడిన రీబ్యాడ్జ్డ్ మోడల్. బాడీ, డిజైన్, మెకానికల్స్ అన్నీ ఎక్కువగా టయోటా వాహనానికి సంబంధించినవే. ఇటీవలి కాలంలో ఈ MPVపై లక్షల్లో డిస్కౌంట్లు, ఆఫర్లు అందించినా కూడా, మార్కెట్లో ఇది అనుకున్నంత సక్సెస్‌ఫుల్‌గా అమ్మకాలను సాధించలేకపోయింది. మారుతీ సుజుకీ ఇన్విక్టో ఒక పెద్ద ఫ్యామిలీ కారు.

ఈ ప్రీమియం MPV, ధర పరంగా సంస్థ పోర్ట్‌ఫోలియోలోనే అత్యధిక స్థాయిలో నిలిచింది. ప్రస్తుతం ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.25.51 లక్షల నుంచి రూ.29.22 లక్షల వరకు ఉంది. ఈ ధరల శ్రేణిలో ఉన్నప్పటికీ, అమ్మకాలను మరింత గట్టిగా నిలబెట్టేందుకు మారుతి ఇటీవలి కాలంలో లక్షల్లో డిస్కౌంట్లు, ఆఫర్లు అందిస్తోంది. స్పష్టంగా చెప్పాలంటే, సంస్థ ఈ మోడల్‌ను విపణిలో నిలబెట్టేందుకు మారుతీ తీవ్రంగా ప్రయత్నిస్తుంది.
దీని డైమెన్షన్ల విషయానికి వస్తే, ఇది నిజంగానే ఒక దృఢమైన నిర్మాణం కలిగిన MPV. దీని పొడవు 4755 మిల్లీమీటర్లు, వెడల్పు 1850 మిల్లీమీటర్లు, ఎత్తు 1795 మిల్లీమీటర్లు కాగా, వీటితోపాటు మంచి వీల్‌బేస్ ఉండటంతో ఇది 7 మందికి సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవం అందించగలదు. అందులోనూ కుటుంబ ప్రయాణాలకు తగినంత లగ్జరీ ఫీలింగ్‌ను కలిగించే విధంగా అంతర్గత విభాగం రూపొందించబడింది.

ఎక్స్‌టీరియర్ విషయానికి వస్తే, ఇన్విక్టోకు ఒక శక్తివంతమైన విజువల్ ప్రెజెన్స్ ఉంది. ముందు భాగంలో మల్టిపుల్ లేయర్ క్లామ్‌షెల్ బానెట్, అలాగే స్లిమ్ LED హెడ్‌లైట్లు వాటిలో DRLsతో మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయి. గ్రిల్, క్రోమ్ స్ట్రిప్‌లతో అలంకరించబడి కారు ప్రత్యేకంగా కనిపిస్తుంది. వెడల్పాటి ఎయిర్ డ్యామ్, సిల్వర్ స్కిడ్ ప్లేట్లు కారు ముందు ముఖానికి మరింత డైనమిక్ లుక్‌ను జోడిస్తాయి.


Click it and Unblock the Notifications








