Car Prices Increased ఝలక్‌ల మీద ఝలక్‌లు.. ప్చ్..! ఈ కారు ధర కూడా పెరిగింది!
మారుతి సుజుకి.. భారత వినియోగదారుల్లో చాలా మందికి ఇది ఫేవరేట్ బ్రాండ్. ఈ కంపెనీ నుంచి వచ్చిన వాహనాలు ఎన్నో ఏళ్లుగా వినియోగదారులను ఆకట్టుకుంటూ వస్తున్నాయి. ఇప్పుడు ఈ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ... వినియోగదారులకు ఝలక్‌ల మీద ఝలక్‌లు ఇస్తోంది. ఇటీవల మారుతీ బాలెనో ధర పెంచుతున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చిన ఈ సంస్థ.. తాజాగా మరో కారు ధరను పెంచేసింది. అదే మారుతి సుజుకి ఇన్విక్టో ఎంపీవీ మోడల్. దీని ధరపై ఏకంగా రూ.30,000 పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ పెరిగిన ధరలు ఎప్పటి నుంచి అమల్లోకి రాబోతున్నాయి? ఈ కారులో ఉండే ఫీచర్లు ఏంటి? వంటి వివరాలు చూసేద్దాం.
మారుతి సంస్థ తమ బ్రాండ్ నుంచి అన్నీ మోడళ్ల ధరలను పెంచుతామని గతేడాది డిసెంబరులోనే తెలిపింది. అన్నట్లుగానే ఇప్పుడు ధరలు పెంచి హడల్ పుట్టిస్తోంది. ఈ మారుతి సుజుకి ఇన్విక్టో ఏకంగా రూ30,000 ధర పెరగడం కస్టమర్లకు నిరాశకు గురిచేసే అంశమనే చెప్పవచ్చు. ఈ పెరిగిన ధరలు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

ఈ ఇన్విక్టో కారు.. ఓ పెద్ద ఎంపీవీగా చెప్పవచ్చు. దీన్ని టయోటో ఇన్నోవా హైక్రాస్ మోడల్ ఆధారంగా రూపొందించారు. ఈ ఇన్విక్టో ఎంపీవీ.. జెటా, ఆల్ఫా అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. టయోటా ఇన్నోవా హైక్రాస్‌ని మీరు ఇష్టపడేవారైతే... దీని వెయిటింగ్ పీరియడ్ చాలా ఎక్కువ ఉంటుంది. అయితే దాని ధర కంటే రూ.3-4లక్షలు తక్కువ ధరలో కావాలనుకుంటే మాత్రం మారుతి సుజుకి ఇన్విక్టో మోడల్‌ను ఎంచుకోవచ్చు.
ఈ కారు...Mystic White, Nexa Blue, Majestic Silver సహా 4 ఆకర్షణీయమైన కలర్స్‌లో ఉంటుంది. ఈ ఎంపీవీలో 7-8 మంది హాయిగా ప్రయాణించవచ్చు. ఈ కారు.. 2- లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్‌తో ఉంటుంది. ఇది 186 PS పవర్, 206 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు e-CVT గేర్ బాక్స్ ఆప్షన్‌తో ఉంటుంది. ఇది 23.24 kmpl మైలేజీ అందించగలదు.

ఇక ఈ కారు కేవలం 9.5 సెకన్లలోనే సున్నా నుంచి 100 కి.మీ.ల వేగాన్ని అందుకుంటుంది. ఈ కారు డజన్ల కొద్దీ ఫీచర్లను అందిస్తోంది. ఈ కారులో 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటెయిన్మెంట్ సిస్టం, 50+ connected car tech ఫీచర్లు, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, 7- అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, డ్యూయల్- జోన్ క్లైమేట్ కంట్రోల్ ఫీచర్లు ఉన్నాయి.
ఇవే కాకుండా వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, రూఫ్ యాంబియెంట్ లైటింగ్ సన్‌రూఫ్, వైర్‌లైస్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉంటాయి. సేఫ్టీ విషయంలో ఈ మారుతి సుజుకి ఎంపీవీ ఏం తీసిపోలేదని చెప్పవచ్చు. దీంట్లో 6 ఎయిర్‌బ్యాగులు, VSC (వెహికిల్ స్టెబిలిటీ కంట్రోల్), TPMS (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం), 360- డిగ్రీ కెమెరా, ఫ్రంట్ & రియర్ పార్కింగ్ సెన్సార్స్ ఉంటాయి.
ఇది ఈ సెగ్మెంట్‌లో దీనికి కియా కారెన్స్ కారు గట్టి పోటీగా ఉంటుంది. మారుతి సంస్థ తమ బ్రాండ్ నుంచి అన్నీ మోడళ్ల ధరలను పెంచుతామని గతేడాది డిసెంబరులోనే తెలిపింది. అన్నట్లుగానే ఇప్పుడు ధరలు పెంచి హడల్ పుట్టిస్తోంది. ఈ ఇన్విక్టో పై ఏకంగా రూ30,000 ధర పెరగడం కస్టమర్లకు నిరాశకు గురిచేసే అంశమనే చెప్పవచ్చు. ఈ పెరిగిన ధరలన్నీ ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








