నెలకు 266 మంది కొంటున్న కారు.. రెండు కుటుంబాలు దీనిలో హాయిగా వెళ్లొచ్చు

ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో మంచి వేడి నెలలు గడిచాయి. దాదాపు అన్ని కంపెనీలు తమ అమ్మకాల్లో గణనీయమైన వృద్ధిని నమోదు చేశాయి. కొత్త మోడళ్ల లాంచ్‌లు, ఫెస్టివల్ సీజన్ ఆఫర్లు, వినియోగదారుల డిమాండ్ కారణంగా మార్కెట్ మొత్తం సందడిగా ఉంది. ఈ నేపథ్యంలో భారతదేశంలో అత్యధికంగా కార్లను విక్రయించే కంపెనీగా మారుతి సుజుకి మరొకసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. స్విఫ్ట్, బలెనో, బ్రెజ్జా వంటి మోడళ్లు తమ తమ సెగ్మెంట్లలో టాప్ పొజిషన్‌లో నిలిచాయి. అయితే, ఈ విజయాల వెనుక ఒక మోడల్ మాత్రం కంపెనీకి నిరాశ కలిగిస్తోంది.. అదే మారుతి ఇన్విక్టో (Maruti Invicto). ఇన్విక్టోను మారుతి ఒక ప్రీమియమ్ MPVగా మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఇది టయోటా ఇనోవా హైక్రాస్‌పై ఆధారపడి రూపొందించబడిన మోడల్.

స్టైలిష్ లుక్, లగ్జరీ ఇంటీరియర్, హైబ్రిడ్ టెక్నాలజీతో వచ్చిన ఈ వాహనం మధ్యతరగతి కుటుంబాల నుండి కార్పొరేట్ సగటు వినియోగదారుల వరకు అందరినీ ఆకట్టుకుంటుందనే ఆశతో లాంచ్ చేయబడింది. కానీ, వాస్తవ పరిస్థితులు మాత్రం భిన్నంగా మారాయి. గత ఆరు నెలలలో, అంటే ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు, మారుతి ఇన్విక్టో కేవలం 1600 యూనిట్లు మాత్రమే అమ్ముడైంది. అంటే నెలకు సగటున సుమారు 266 కార్లు మాత్రమే విక్రయించబడినట్టే.

Maruti Suzuki Invicto Six Months Sales Report Details Inside

ఇది మారుతి సుజుకి వంటి కంపెనీకి చాలా తక్కువ సంఖ్య. అదే సమయంలో ఇతర మోడళ్లు వేలల్లో అమ్ముడవుతున్నాయి. మారుతి సుజుకి ఇన్విక్టో అమ్మకాలపై ఒకసారి నెలవారీగా దృష్టి పెడితే, ఈ మోడల్‌కు గత ఆరు నెలల్లో పెద్దగా స్పందన రాలేదనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఏప్రిల్‌లో కంపెనీ ఈ ప్రీమియం ఎంఫీవీ (MPV) మోడల్‌ను 223 యూనిట్లు విక్రయించగా, అదే సంఖ్య మే నెలలో కూడా కొనసాగింది.

జూన్ నెలలో మాత్రం కొంత ఊపిరి పీల్చుకున్నట్టుగా 351 వాహనాలు అమ్ముడవ్వగా, అదే ఉత్సాహం జూలైలోనూ కొనసాగింది. అయితే ఆగస్టులో అమ్మకాలు మళ్లీ తగ్గి 237 యూనిట్లకు పరిమితమయ్యాయి. సెప్టెంబర్‌లో ఈ సంఖ్య మరింతగా తగ్గి కేవలం 215 యూనిట్లకు చేరింది. ఇలా ఏప్రిల్‌ నుండి సెప్టెంబర్‌ వరకు మొత్తం 1600 ఇన్విక్టో వాహనాలు మాత్రమే విక్రయించబడినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. ఇది మారుతి సుజుకి వంటి కంపెనీకి తక్కువగా చెప్పాలి.

Maruti Suzuki Invicto Six Months Sales Report Details Inside

ఎందుకంటే ఇదే కాలంలో కంపెనీకి చెందిన ఇతర మోడళ్లు బలెనో, స్విఫ్ట్, బ్రెజ్జా వంటి కార్లు భారీ సంఖ్యలో అమ్ముడయ్యాయి. కానీ ఇన్విక్టో మాత్రం ఆ రీతిలో మార్కెట్‌లో స్థిరమైన స్థానం సంపాదించలేకపోయింది. ధర, సెగ్మెంట్ పోటీ, మార్కెట్ టార్గెట్ ఆడియన్స్‌ వంటి అంశాలు ఈ మోడల్ అమ్మకాలపై ప్రభావం చూపినట్టుగా కనిపిస్తోంది. ఈ కారు రెండు కుటుంబాలు ప్రయాణాలు చేయడానికి అనువుగా ఉంటుంది.

మారుతి సుజుకి ఇన్విక్టో పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే, ఇది హైబ్రిడ్ టెక్నాలజీ ఆధారంగా పనిచేసే 2.0-లీటర్ TNGA పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఈ ఇంజిన్‌కు ECVT గేర్‌బాక్స్ అనుసంధానించబడి ఉంటుంది. ఈ హైబ్రిడ్ సిస్టమ్ కలయికతో ఇన్విక్టో మొత్తం 183 bhp శక్తిని, 250 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. పనితీరులోనూ ఇది నిరాశపరచదు, 0 నుండి 100 కి.మీ వేగాన్ని కేవలం 9.5 సెకన్లలోనే చేరుతుంది.

Maruti Suzuki Invicto Six Months Sales Report Details Inside

మైలేజ్ పరంగా కూడా ఇన్విక్టో మంచి ఫలితాలను ఇస్తుంది; ఇది లీటరుకు 23.24 కి.మీ వరకు మైలేజీ అందిస్తుంది. ఇది 7-సీటర్ కంఫర్ట్ లేఅవుట్‌తో వస్తుంది, ఇందులో ముందు సీట్లు 8-వే పవర్ అడ్జస్టబుల్ వెంటిలేటెడ్ సీట్లు కాగా, రెండవ వరుసలో కెప్టెన్ సీట్లు ఇవ్వబడ్డాయి. ప్రయాణికుల సౌకర్యం కోసం ఫోల్డబుల్ టేబుల్, మూడవ వరుసకు వన్-టచ్ వాక్-ఇన్ సీట్లు, మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Saturday, November 1, 2025, 12:34 [IST]
English summary
Maruti suzuki invicto six months sales report details inside
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+