మారుతీ బంపర్ ఆఫర్.. రూ.2.15 లక్షల వరకు తగ్గింపుతో కారును సొంతం చేసుకునే ఛాన్స్.. లిమిటెడ్ కాలం వరకే అవకాశం
కొత్తగా కారును కొనుగోలు చేయాలని అనుకుంటున్న వారు పండగ సమయాల్లో కొనడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. దీనికి ప్రధాన కారణం వాహన తయారీ కంపెనీలు ఫెస్టివల్స్‌కు తమ కార్లపై భారీ ఎత్తున తగ్గింపులు, డిస్కౌంట్స్, క్యాష్‌బ్యాక్ ఆఫర్స్‌ను అందిస్తుంటాయి. దీంతో కొత్త కస్టమర్లు వీటిని సద్వినియోగం చేసుకుని కార్లను తక్కువ ధరకే కొనుగోలు చేసి తమ ఇంటికి తీసుకెళ్తుంటారు. 2024 ఏడాది దసరా, దీపావళి సమయాల్లో కార్ల తయారీ కంపెనీలు తమ మోడళ్లపై తగ్గింపులను ప్రకటించడం వలన చాలా మంది కస్టమర్లు తమకు నచ్చిన కారును తక్కువకే కొన్నారు. పండగల లేని సమయాల్లో సేల్స్ సాధారణంగా తక్కువగా జరుగుతుంటాయి. ఒక ఏడాదిలో మొత్తం జరిగే అమ్మకాల్లో సగానికి పైగా ఫెస్టివల్ సమయాల్లో నమోదు అవుతుంటాయి. భారత్‌లో ప్రజలందరూ కూడా పండగ సమయాల్లోనే కొత్త కార్లను తమ ఇంటికి తెచ్చుకోవడానికి ఆసక్తి చూపిస్తారు.
ఈ నేపథ్యంలో దేశీయ దిగ్గజ వాహన తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా సరికొత్త తగ్గింపులను తీసుకొచ్చింది. 2025 ఏడాది ప్రారంభం కావడం, ఇదే సమయంలో పొంగల్ పండుగ ఉండటం, అలాగే రిపబ్లిక్ డే వస్తుండటం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మారుతీ కంపెనీ జనవరి నెలలో ప్రత్యేక తగ్గింపులను ప్రకటించింది. 2024, 2025 మోడళ్లపై కంపెనీ భారీ ఎత్తున డిస్కౌంట్స్‌ను ఇస్తున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది.

సాధారణంగా మారుతీ సుజుకీ కార్లకు దేశంలో మంచి డిమాండ్ ఉంటుంది. ఇవి తక్కువ ధరలో లభించడంతో పాటు, మైలేజ్ కూడా ఎక్కువగా ఇస్తాయి. మధ్య తరగతి వారు కారును కొనుగోలు చేయాలని అనుకున్నప్పుడు ప్రధానంగా ఈ కంపెనీ కార్లను ఎంచుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. ఇంత డిమాండ్ ఉన్న కంపెనీ నుంచి భారీ తగ్గింపులు రావడంతో కొత్త ఏడాదిలో కొత్త కారును కొనుగోలు చేసే వారు ఈ ఆఫర్స్‌ను సద్వినియోగం చేసుకోవచ్చు.
మారుతీ సుజుకీ నుంచి వచ్చిన ప్రకటన ప్రకారం, కంపెనీ తన కార్లపై గరిష్టంగా దాదాపు రూ.2.15 లక్షల వరకు తగ్గింపులు అందిస్తున్నట్లు వెల్లడించింది. 2024, 2025 మోడళ్లపై డిస్కౌంట్స్‌ను అందించడంతో కొత్త కస్టమర్లు భారీగా పెరిగే అవకాశం ఉంది. కంపెనీ ఇస్తున్న ఈ తగ్గింపు గ్రాండ్ విటారా, జిమ్నీ, ఇన్విక్టో ,బాలెనో వంటి వాటితో పాటు ప్రధాన మోడళ్లపై జనవరి ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి.

మారుతీ సుజుకీ బాలెనో (Baleno) పై జనవరి ఆఫర్‌లో భాగంగా రూ.62,000 వరకు తగ్గింపులు ఉన్నాయి. 2024 మోడల్‌పై రూ.40,000, 2025 మోడల్‌పై రూ.20,000 వరకు డిస్కౌంట్ ఉంది. ఇంకా గ్రామీణ తగ్గింపు రూ.2,100, స్క్రాపేజ్ బోనస్ రూ. 20,000, ఎక్స్చేంజ్ బోనస్ రూ. 15,000 వరకు తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి.
జిమ్నీ (Jimny) కారుపై కంపెనీ దాదాపు రూ.1.9 లక్షల వరకు తగ్గింపులను అందిస్తుంది. 2024, 2025 మోడళ్లపై ఇది వర్తిస్తుంది. అదనంగా రూ.25,000 వరకు కస్టమర్ తగ్గింపు కూడా పొందవచ్చు. అయితే జీమ్నీపై మారుతీ సుజుకీ ఎక్స్ఛేంజ్ బోనస్ , స్క్రాపేజ్ బోనస్, గ్రామీణ, కార్పొరేట్ తగ్గింపులు లాంటివి ఏవి అందించడం లేదు. ఈ కారును కొనుగోలు చేయాలని అనుకుంటున్న వారు ఈ విషయాన్ని గమనించాలి.

గ్రాండ్ విటారా (Grand vitara) 2024 మోడల్‌పై రూ.65,000 వరకు తగ్గింపును, అదే 2025 మోడల్‌పై రూ.25,000 వరకు తగ్గింపును ఇస్తుంది. పెట్రోల్ + హైబ్రిడ్ వేరియంట్లపై స్క్రాపేజ్ బోనస్ రూ. 50,000, ఎక్స్ఛేంజ్ బోనస్ రూ. 65,000 వరకు ఉంది. ఇంకా కార్పొరేట్ డిస్కౌంట్స్, గ్రామీణ బోనస్‌లు కూడా ఉన్నాయి. ఇవి ఒక్కొక్కటి రూ. 3,100 వరకు ప్రత్యేక తగ్గింపులతో మొత్తం 1.18 లక్షల వరకు ఆఫర్ ఉంది.
మారుతీ సుజుకీ ఇన్విక్టో(Invicto) కారుపై కొత్త ఏడాదిలో మొదటి నెలలో రూ.2.15 లక్షల వరకు తగ్గింపులు ఉన్నాయి. అయితే 2025 మోడల్‌కు మాత్రం కస్టమర్ తగ్గింపు లేదు. అదే 2024 పై మాత్రం ఉంది. ఈ రెండింటిపై రూ.1,00,000 వరకు తగ్గింపుతో పాటు ఎక్స్చేంజ్ బోనస్ రూ. ఒక లక్ష, స్క్రాపేజ్ బోనస్ రూ.11,500 వరకు డిస్కౌంట్స్ ఉన్నాయి.


Click it and Unblock the Notifications








