ఇండియాలో తయారైన కారును అక్కడి జనాలు ఎగబడి మరి కొంటున్నారు! బుకింగ్‌లు చూస్తే కంపెనీ కూడా షాక్!

భారతదేశంలోని అతిపెద్ద కార్ల తయారీదారు అయినటువంటి మారుతీ సుజుకీ (maruti suzuki) తమ ప్రత్యేకమైన లైఫ్‌స్టైల్ SUV మోడల్ అయిన జిమ్నీ 5-డోర్‌ను గతంలో ఎంతో ఘనంగా భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ కారు తొలిసారి 2023 ఆటో ఎక్స్‌పో వేదికపై ప్రజలకు పరిచయమైంది. అప్పటివరకు భారతీయ మార్కెట్‌లో రఫ్ అండ్ టఫ్ లుక్ ఉన్న వాహనాలకు బలమైన పోటీగా ఇది విడుదల అయింది. అదే సంవత్సరం జూన్‌లో ఈ కారుకు సంబంధించిన ధరల ప్రకటన కూడా జరిగింది. ఆవిష్కరణ సమయంలో కనిపించిన స్పందన చూసి, ఈ కారు భారతీయుల ఆదరణను పొందుతుందన్న ఆశతో మారుతీ చాలా ఎక్కువగా నమ్మింది. ఆయితే, ఈ ఆశలు అంతంతమాత్రంగానే మిగిలిపోయాయి.

జిమ్నీ లాంచ్‌కి ముందే ఐదు నెలల్లోనే దాదాపు 30,000 బుకింగ్‌లను దక్కించుకున్నా, కారుకు ఆ హైప్‌ను కొనసాగించడం సాధ్యపడలేదు. భారత మార్కెట్లో ఉన్న ఇతర SUVలతో పోల్చినప్పుడు ఇందులో ఫీచర్ల కొరత వినియోగదారుల నిరుత్సాహానికి కారణమయ్యాయి. కారుకు ఉన్న అసలైన ఆఫ్-రోడ్ శక్తి సామర్థ్యం సాధారణ నగర వినియోగదారుల అవసరాలకు పూర్తిగా సరిపోలకపోవడంతో, ఇది ప్రజాదరణ పొందలేకపోయింది. జిమ్నీ 5-డోర్, తొలి చూపుకే ఆకట్టుకున్నా సేల్స్‌ మాత్రం సాధించలేకపోయింది.

Maruti Suzuki Jimny 5 Door

ఇదిలా ఉంటే మారుతీ సుజుకీ జిమ్నీ 5-డోర్SUV భారతీయ వినియోగదారుల నుండి ఆశించిన స్థాయిలో ఆదరణ లభించకపోయినప్పటికీ, ఈ కారు విడుదలైన రెండు సంవత్సరాల తర్వాత 1 లక్ష యూనిట్ల అమ్మకాల మైలురాయిని దాటి ప్రయాణించింది. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్ల (SIAM) హోల్‌సేల్ గణాంకాల ప్రకారం, జిమ్నీ ఇప్పటివరకు మొత్తం 1,02,024 యూనిట్ల అమ్మకాలు సాధించింది.

వీటిలో, 2025 ఏప్రిల్ చివరి వరకు భారత దేశీయ మార్కెట్లో 26,180 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. మిగతా 75,844 యూనిట్లు విదేశాలకు ఎగుమతి చేయబడ్డాయి. ఇది స్పష్టంగా చూపిస్తుంది, భారతదేశంలో భిన్నమైన స్పందన ఎదుర్కొన్నప్పటికీ, జపాన్, లాటిన్ అమెరికా, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా వంటి అంతర్జాతీయ మార్కెట్లలో ఈ కారుకు మంచి ఆదరణ లభించింది. దీనిని భారత్‌లో ప్రారంభించిన ఐదు నెలల తర్వాతే విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేయడం మొదలైంది.

Maruti Suzuki Jimny 5 Door Sales

జిమ్నీ గ్లోబల్ మార్కెట్‌లో తన స్థానాన్ని బలపరిచింది. ప్రత్యేకంగా ఆఫ్-రోడ్ వాహనాల పట్ల ఆసక్తి కలిగిన మార్కెట్లలో ఇది ఒక నమ్మదగిన ఎంపికగా నిలిచింది. జిమ్నీ 5-డోర్ SUV, భారత మార్కెట్లో అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా, అంతర్జాతీయంగా మాత్రం ఈ వాహనానికి మంచి గుర్తింపు లభించింది. ముఖ్యంగా మెక్సికో, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో జిమ్నీకి ఆకట్టుకునే స్థాయిలో ఆదరణ లభించింది.

భారతదేశంలో తయారైన ఈ SUVకి ఆ దేశాలలో ఏర్పడిన డిమాండ్ చూస్తే, భారత ఆటోమొబైల్ రంగానికి ఇది ఒక మైలురాయిగా నిలుస్తోంది. 2025 ఏప్రిల్‌లో, జిమ్నీ నోమాడ్ అనే పేరుతో దీని 5-డోర్ల వెర్షన్ జపాన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది. ఇది 4WD లక్షణాలతో కూడిన ఓ ప్రయాణానుభూతిని అందించగలిగే వాహనంగా ఆకట్టుకుంది. 'మేడ్ ఇన్ ఇండియా'గా తయారైన ఈ వాహనానికి జపాన్ వినియోగదారుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది.

Maruti Suzuki Jimny 5 Door Design

విడుదలైన వెంటనే అక్కడి మార్కెట్‌లో ఇది పెద్ద విజయాన్ని నమోదు చేయడంతో, మారుతీ ఎగుమతులకు మరింత బలం చేకూరింది. ఫోర్క్స్ క్రాస్ఓవర్ SUV తర్వాత జపాన్‌లో లాంచ్ అయిన రెండవ మేడ్-ఇన్-ఇండియా మోడల్ జిమ్నీ 5-డోర్ కావడం విశేషం. జిమ్నీ నోమాడ్‌కు ఎదురైన డిమాండ్ స్వయంగా కంపెనీ అంచనాలను మించి పోయింది. బుకింగ్‌లు ప్రారంభమైన నాలుగు రోజుల వ్యవధిలోనే 50,000కి పైగా ప్రీ-ఆర్డర్‌లు నమోదు కావడం, ఆ ఉత్సాహాన్ని నిరూపించింది.

ఈ ఊహించని స్పందన కారణంగా, మారుతీ సుజుకీ కొంతకాలం భారతీయ ఉత్పత్తుల బుకింగ్‌లను తాత్కాలికంగా నిలిపివేయాల్సిన పరిస్థితిని ఎదుర్కొంది. ఈ సమస్త పరిణామాలు చూస్తే, జిమ్నీ 5-డోర్, ప్రత్యేకించి నోమాడ్ వేరియంట్ ద్వారా, మారుతి సుజుకి గ్లోబల్ మార్కెట్‌లో తన స్థాయిని మరింత బలపర్చినట్లు చెప్పవచ్చు.

More from DriveSpark

Article Published On: Monday, June 16, 2025, 7:30 [IST]
English summary
Maruti suzuki jimny 5 door sales achieved 1 lakh units from 2023 june launch
Read more on: #maruti suzuki
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+