మహీంద్రా థార్‌ని కాదని ఈ మారుతి ఆఫ్‌రోడర్‌ మాత్రమే కావాలంటున్న ఇండియన్ ఆర్మీ.. మిలటరీలో దీని పాత్ర కీలకం!

దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ మారుతి సుజుకి గురించి అందరికీ తెలిసిందే. కొన్ని దశాబ్దాలుగా ఈ కంపెనీ కార్లు వినియోగదారులకు బాగా చేరువయ్యాయి. అయితే ఒక కారు మాత్రం మారుతి సుజుకి కంపెనీకి భారత్‌లో చేదు జ్ఞాపకాలను మిగులుస్తోంది. అదే ఆఫ్-రోడ్ SUV జిమ్నీ. మహీంద్రా థార్‌కు ఈ కారు గట్టి పోటీని ఇస్తుందని అందరూ భావించారు. కానీ అనుకున్నది ఒక్కటి అయింది ఒకటి అన్నట్లుగా మారిపోయింది ఈ జిమ్నీ పరిస్థితి. సేల్స్‌లో ఈ కారు బోల్తా పడిపోయింది. కానీ, భారత ఆర్మీలో మాత్రం ఈ కారునే ఎక్కువగా వినియోగిస్తున్నారు. పబ్లిక్‌లో ఆదరణ దక్కించుకోకపోయినప్పటికీ‌ ఈ కారును మిలిటరీలో వాడడానికి గల కారణాలేంటి?

జపాన్‌లో వినియోగదారుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ సొంతం చేసుకున్న ఈ కారును భారత్‌లో 2023లో భారీ అంచనాల మధ్య విడుదల చేశారు. ప్రారంభంలో కొన్ని నెలల పాటు ఈ జిమ్నీ కారు అమ్మకాలు బాగానే సాగాయి. అయితే ఆ తర్వాత నుంచి దీని సేల్స్ క్రమక్రమంగా తగ్గిపోతూ వచ్చాయి.

Maruti Jimny Car in Indian Army

ఒకానొక సమయంలో జిమ్నీ కారు మహేంద్ర థార్ అమ్మకాల్లో కనీసం 10% సేల్స్ కూడా సాధించలేకపోయింది. ఇప్పుడు కూడా ఈ జిమ్నీ కారు అమ్మకాలు అంత భారీగా ఏమీ ఉండట్లేదు. అయితే కేంద్ర ప్రభుత్వం మారుతి సుజుకి సంస్థకు జిమ్నీ కారు తయారీ పట్ల మంచి ప్రోత్సాహం అందించింది.

భారత పారామిలిటరీలో ఈ జిమ్నీ వాహనాలను వినియోగించడం మొదలు పెట్టింది. ఇటీవల కూడా మారుతి సుజుకి భారత ఆర్మీ కోసం 60 జిమ్నీ వాహనాలను డెలివరీ చేసింది. ఈ 60 జిమ్నీ వాహనాలు ఇండో-టిబెటన్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో పెట్రోలింగ్ కోసం వినియోగిస్తున్నారు. అయితే ప్రజల్లో పెద్దగా ఆదరణ దక్కించుకోకపోయిన ఈ కారు భారత ఆర్మీలో విరివిగా వినియోగించడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది.

Maruti Jimny Car in Indian Army

దీనికి కారణం మారుతి సుజుకి నుంచి గతంలో ఆకట్టుకున్న జిప్సీ కారు. అంతకుముందు ఈ పాపులర్ జిప్సీ వాహనాలను ఇండియన్ ఆర్మీలో ఎక్కువగా వినియోగించారు. ఇప్పటికీ కూడా ఆర్మీలో ఈ జిప్సీ కార్లను వినియోగిస్తున్నారు. వీటి నాణ్యత, బాడీ వర్క్ స్ట్రెంత్ విషయంలో ఆర్మీ సంతృప్తిగా ఉంది. అదే తరహాలో మారుతి సుజుకి నుంచి వచ్చిన జిమ్నీ కారు కూడా ఆకట్టుకుంటుందని ఆర్మీ భావించి దీని వాడకాన్ని మొదలుపెట్టింది.

అలాగే కేంద్ర ప్రభుత్వం సైన్యంలో ఈ జిమ్నీ కారును ఉపయోగించడానికి మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. అవి ఏంటంటే ఈ జిమ్నీ కారులో సింపుల్ ఇంజిన్-సెటప్ ఉంటుంది. దీని ద్వారా ఎత్తయిన ప్రాంతాలలో, నివాసాలు లేని ప్రాంతాల్లో ప్రయాణించేటప్పుడు ఇంజిన్ బ్రేక్‌డౌన్ అయితే.. ఆర్మీ సిబ్బందే దీన్ని తమకు తాము రిపేర్ చేసుకోగలరు. అలాగే ఇందులో మోడెర్న్ టెక్నాలజికల్ ఫీచర్స్ కూడా ఉన్నాయి.

Maruti Jimny Car in Indian Army

కాబట్టి ఈ జిమ్నీ కారు వినియోగం సులభంగా ఉండడంతో పాటు దీంతో సమస్యలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. అలాగే ఈ కారు తక్కువ బరువుతో(1,200కేజీ) ఉండడంతో ఎప్పుడైనా స్టార్టింగ్ సమస్య ఉన్నప్పుడు దీనిని ఈజీగా నెట్టుతూ స్టార్ట్ చేయవచ్చు. అలాగే ఈ జిమ్నీ కారు చాలా వెడల్పుగా, ఎత్తుగా ఉండడం వల్ల దీనిని కంట్రోల్ చేయడం తేలికగా ఉంటుంది.

డ్రైవ్‌స్పార్క్ వ్యాఖ్య: ఈ జిమ్నీ కారులో మోడ్రన్‌ టెక్నాలజీస్ చాలా మటుకు లేకపోవడం కారణంగా ఇది కస్టమర్ల నుంచి అంతగా ఆదరణ దక్కించుకోలేకపోతోంది.‌ అయితే దీంట్లోని ఫీచర్ల కారణంగా ఆర్మీలో ఈ కారును ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అలాగే ఈ జిమ్నీ కారు తయారీ ధర తక్కువగా ఉండడం కూడా ప్రభుత్వం దీన్ని కొనుగోలు చేసేందుకు మరో కారణంగా చెప్పవచ్చు.

More from DriveSpark

Article Published On: Friday, February 14, 2025, 18:48 [IST]
English summary
Maruti suzuki jimny car in indian army why it is widely used check reasons are here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+