ఆర్భాటంగా వచ్చింది..కానీ కొనేవారు లేరు..నవంబర్ సేల్స్ చూసి కన్నీరుమున్నీరు అవుతున్న మారుతి
ఆఫ్‌రోడ్ ఎస్‌యూవీల మార్కెట్‌లో మహీంద్రా థార్ (Mahindra Thar) కొన్నేళ్లుగా తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఈ ఆధిపత్యాన్ని సవాలు చేయడానికి మారుతి సుజుకి భారీ అంచనాల మధ్య జిమ్నీని (Jimny) రంగంలోకి దించింది. అయితే, జిమ్నీ ధర అధికంగా ఉండటం, థార్‌తో పోలిస్తే మార్కెటింగ్ వ్యూహాలు సరిగ్గా లేకపోవడం వల్ల ఈ వాహనం మార్కెట్‌లో వెనుకబడింది.
నవంబర్ నెల అమ్మకాల గణాంకాలు చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. థార్ ఏకంగా 10,234 యూనిట్లను విక్రయించగా, జిమ్నీ కేవలం 802 యూనిట్లను మాత్రమే విక్రయించగలిగింది. ఈ భారీ వ్యత్యాసం జిమ్నీకి కొనుగోలుదారుల నుంచి ఆశించిన స్పందన రాలేదని స్పష్టం చేస్తోంది. రూ.12.32 లక్షల నుంచి రూ.14.45 లక్షల వరకు ఉన్న అధిక ధర కూడా అమ్మకాలు తగ్గడానికి ఒక ప్రధాన కారణంగా నిపుణులు భావిస్తున్నారు.

అమ్మకాలు లేక స్టాక్ పేరుకుపోవడంతో మారుతి సుజుకి జిమ్నీపై అనేక ప్రయత్నాలు చేస్తోంది. జీఎస్టీ తగ్గించినప్పుడు ధరను రూ.44,000 నుంచి రూ.51,900 వరకు తగ్గించినప్పటికీ, ఫలితం కనిపించలేదు. దీంతో డిసెంబర్ నెలలో మారుతి సుజుకి జిమ్నీని విక్రయించడానికి గరిష్టంగా రూ.లక్ష వరకు భారీ తగ్గింపు ప్రయోజనాలను అందిస్తోంది.
ఈ ఆఫర్ జిమ్నీలోని అన్ని వేరియంట్లపై డైరెక్ట్ క్యాష్ డిస్కౌంట్ రూపంలో లభిస్తుంది. సాధారణంగా కొత్తగా వచ్చిన వాహనాలపై ఇంత భారీ క్యాష్ డిస్కౌంట్‌లు ఇవ్వడం అనేది మారుతికి ఇదే మొదటిసారి. జిమ్నీ అమ్మకాల వైఫల్యం ఎంత తీవ్రంగా ఉందో ఈ తగ్గింపు తెలియజేస్తోంది. అయితే ఈ కారుపై ఎక్స్ఛేంజ్ బోనస్ లేదా స్క్రాపేజ్ వంటి ఇతర ఆఫర్లు ఏవీ లేవు.

మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్ వెర్షన్, దాని 3-డోర్ అంతర్జాతీయ మోడల్ డిజైన్ తత్వాన్ని అనుసరిస్తుంది. టెక్నికల్ పరంగా ఇది లాడర్ ఫ్రేమ్ ఛాసిస్‌పై తయారు చేయబడింది. ఆఫ్‌రోడింగ్‌కు ఇది చాలా ముఖ్యం. అంతేకాకుండా దీనిలో సుజుకి అత్యంత విశ్వసనీయమైన ఆల్‌గ్రిప్ ప్రో 4WD డ్రైవ్‌ట్రెయిన్ టెక్నాలజీ అమర్చబడి ఉంది. ఇది ఎలాంటి కఠినమైన భూభాగంలోనైనా సులభంగా డ్రైవ్ చేయడానికి వీలు కల్పిస్తుంది.
జిమ్నీ 1.5 లీటర్ K15B మైల్డ్-హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంది. ఇది గరిష్టంగా 105 bhp పవర్, 134 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లలో లభిస్తుంది. కొండ ప్రాంతాలు, హైవేలపై రోజుకు 90-110 కి.మీ వేగంతో ప్రయాణించడానికి ఈ ఇంజిన్ సరిపోతుంది.

జిమ్నీలో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో/ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీతో కూడిన 7-అంగుళాల స్మార్ట్‌ప్లే ప్రో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎల్‌ఈడీ ఆటో హెడ్‌ల్యాంప్‌లు వంటి ఫీచర్లు ఉన్నాయి. చిన్న సైజు, అధిక గ్రౌండ్ క్లియరెన్స్ కారణంగా, కఠినమైన కొండ ప్రాంతాలలో నడపడానికి జిమ్నీ చాలా ప్రభావవంతంగా ఉంటుంది.
జిమ్నీ అమ్మకాలు తగ్గడానికి ప్రధాన కారణం థార్‌తో పోలిస్తే ధర ఎక్కువగా ఉండటం. అలాగే, థార్ ఎంతో కాలంగా ఒక బలమైన బ్రాండ్ ఇమేజ్‌ను కలిగి ఉంది. జిమ్నీ 5-డోర్ వెర్షన్‌ను తీసుకువచ్చినా, దాని డిజైన్, కొలతలు థార్ కంటే చిన్నవిగా అనిపించాయి.
భారతదేశంలో ఆఫ్‌రోడ్ ఎస్‌యూవీని కొనేవారు ముఖ్యంగా రోడ్డుపై కూడా డామినేటింగ్ లుక్ కోరుకుంటారు. ఆ విషయంలో జిమ్నీ సాఫ్ట్ లుక్‌తో థార్‌తో పోటీ పడలేకపోయింది. ఈ కారణాల వల్ల మారుతి జిమ్నీ మార్కెట్‌లో తీవ్రమైన పోటీని ఎదుర్కొంటోంది.


Click it and Unblock the Notifications








