మారుతి కారు అని తెలిసినా దీనిని కొనే దిక్కే లేదు.. ఫిబ్రవరి నెలలో ఎంత మంది కొన్నారో తెలిస్తే షాకే
ప్రస్తుతం మార్కెట్లో ఆఫ్ రోడ్ కాన్సెప్ట్ వెర్షన్ కార్లకు మార్కెట్‌లో అద్భుతమైన డిమాండ్ ఉంది. ప్రీమియం ఫీచర్లతో వచ్చిన మహీంద్రా థార్ తో పాటు జిమ్నీలను చాలా మంది కొనుగోలు చేసేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. ముఖ్యంగా యువత ఈ వాహనాలకు కొనుగోలు చేసేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. వారి ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీ మారుతి సుజుకి ఇండియా ఆఫ్-రోడ్ కాన్సెప్ట్ జిమ్నీను తీసుకొచ్చింది.
ఇండియాలో తయారైన మారుతి సుజుకి ఇండియా జిమ్నీ ఎస్‌యూవీకి జపాన్‌లో మంచి బుకింగులు నమోదయ్యాయి. దీని కారణంగా ఆ కారు కోసం మూడున్నర ఏళ్ల నిరీక్షణ కాలం పూర్తయింది. కాకపోతే భారత మార్కెట్లో ఈ వాహనం పర్ఫామెన్స్ భిన్నంగా ఉంది. అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. ఫిబ్రవరిలో మారుతి లైనప్‌లో జిమ్నీ రెండవ అత్యల్ప విక్రయాల వాహనంగా నిలిచింది. కేవలం 385 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. 380 యూనిట్లు అమ్ముడైన ఇన్విక్టో కంటే కొంచెం ఎక్కువ.

జిమ్నీ దేశీయ మార్కెట్లో అమ్ముడుపోయేందుకు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుంది. సరళంగా చెప్పాలంటే ఈ కారును కొనేందుకు ఎవరూ ఆసక్తి చూపించడం లేదు. ఇది అనేక ఫీచర్లు, స్పెసిఫికేషన్లను కలిగి ఉంది. ఇది ఎట్రాక్టివ్ ఆఫ్-రోడింగ్ ఆఫ్షన్ గా నిలిచింది. ఇది పవర్ ఫుల్ 1.5-లీటర్ 4-సిలిండర్ K15B మైల్డ్-హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంది. అంతే కాకుండా ఇది 105 hpపవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. 134 Nm టార్క్ కెపాసిటీని కలిగి ఉంది.
కస్టమర్లు 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 4-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆఫ్షన్లను ఎంచుకోవచ్చు. ఈ SUV ఎలక్ట్రికల్‌గా అడ్జస్టబుల్ ORVMలు, మౌంటెడ్ కంట్రోల్‌లతో కూడిన మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే కోసం వైర్‌లెస్ కనెక్టివిటీని అందిస్తుంది. ఇది స్మార్ట్‌ప్లే ప్రో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి లేటెస్ట్ ఫీచర్లతో వస్తుంది.

దేశీయంగా విక్రయాలను ప్రోత్సహించడానికి మారుతి సుజుకి ఇండియా ఈ నెలలో జిమ్నీపై భారీ డిస్కౌంట్లను అందజేస్తుంది. ఈ కారును కొనుగోలు చేయాలనుకున్న వాళ్లకు రూ. 1 లక్ష వరకు తగ్గింపును అందిస్తోంది. ఈ చర్య భారతీయ కస్టమర్లకు SUVని మరింత ఆకర్షణీయంగా చేయడానికి దేశీయ మార్కెట్లో దాని అమ్మకాలను పెంచడానికి కంపెనీ ఈ ప్రణాళికను అమలు చేసింది.
జిమ్నీ కూడా సేఫ్టీ విషయంలో రాజీపడలేదు. ఇది ప్రామాణిక డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు, సైడ్ , స్క్రీన్ ఎయిర్‌బ్యాగులు, EBD తో యాంటీ-లాక్ బ్రేక్‌లు, ఎలక్ట్రికల్ స్టెబిలిటీ కంట్రోల్‌తో సహా ఇతర లేటెస్ట్ సేఫ్టీ ఫీచర్లలతో వస్తుంది. అంతేకాకుండా ఇది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, లెదర్ స్టీరింగ్ వీల్, అర్కామిస్ సరౌండ్ సౌండ్‌తో అప్‌గ్రేడ్ చేసిన 9ఇంచుల స్మార్ట్‌ప్లే ప్రో+ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫెసిలిటీలను అందజేస్తుంది. ప్రీమియం డ్రైవింగ్ అనుభవం కోరుకునే వారికి ఇది అనువైనది.

ఇంటర్నేషనల్ వైడ్ భారీగా డిమాండ్ ఉన్నప్పటికీ భారతదేశంలో జిమ్నీ అమ్మకాలు తక్కువగా ఉన్నాయి. అక్టోబర్ 2024లో 1,211 కార్లు అమ్ముడయ్యాయి. ఆ తర్వాత జనవరి 2025లో అమ్మకాలు కేవలం 163యూనిట్లకు పడిపోయాయి. ఇది గత ఆరు నెలల్లో అత్యల్పంగా చెప్పుకోవచ్చు. ఆపై ఫిబ్రవరి 2025లో కొద్దిగా పెరిగి 385 కార్లకు చేరుకుంది.
మారుతి సుజుకి జిమ్నీ జపాన్‌లో గణనీయమైన ప్రజాదరణ పొందింది. చాలా కాలం వెయిటింగ్ ఉన్నప్పటికీ దేశీయంగా దాని ఆదరణ భిన్నంగా ఉంది. అమ్మకాల సంఖ్యలు అంచనాలను అందుకోలేకపోయాయి. అయితే, ఈ SUV అధిక ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ప్రస్తుతం భారీ డిస్కౌంట్లతో భారతదేశంలోని కస్టమర్లను ఆకర్షించే విధంగా కంపెనీ ప్లాన్ చేస్తుంది.


Click it and Unblock the Notifications








