ఏనుగు సైజు కారు.. ఫ్రెండ్స్, ఫ్యామిలీస్‌తో కలిసి వీకెండ్ ట్రిప్స్‌కి, లాంగ్ జర్నీస్‌కి బెస్ట్..
మారుతి సుజుకి (Maruti Suzuki) భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో ఎప్పుడూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న కంపెనీ. ముఖ్యంగా పేద, మధ్యతరగతి ప్రజల కోసం అందుబాటు ధరలో కార్లు అందించడం ఈ కంపెనీకి పెద్ద పేరును తెచ్చిపెట్టింది. చిన్న కార్ల నుంచి ఫ్యామిలీ కార్ల వరకు మారుతి ప్రతి సెగ్మెంట్‌లోనూ తనదైన స్థాయిని నిలుపుకుంటూ వస్తోంది. కస్టమర్లలో నమ్మకం, సులభమైన మెయింటెనెన్స్, అధిక రీసేల్ విలువ ఇవన్నీ కలిపి మారుతి కార్లకు ఎప్పుడూ మంచి డిమాండ్ ఉండేలా చేస్తాయి. ఈ క్రమంలో, కంపెనీకి ప్రాధాన్యత కలిగిన MPV మోడల్ ఇన్విక్టో (Invicto) అమ్మకాల వివరాలను తాజాగా వెల్లడించింది. జూలై 2025లో ఈ పెద్ద ఫ్యామిలీ కారు 351 యూనిట్లు అమ్ముడైంది. ఇది ఒక MPV మోడల్‌కి తగిన స్థాయిలోనే కాకుండా, గత ఏడాదితో పోల్చితే గణనీయమైన వృద్ధిని చూపిస్తోంది.
గతేడాది ఇదే నెలలో, అంటే జూలై 2024లో ఇన్విక్టో అమ్మకాలు కేవలం 251 యూనిట్లుగా మాత్రమే నమోదయ్యాయి, దానితో పోల్చితే, ఈ ఏడాది జూలైలో 39.84 శాతం వృద్ధి జరగడం గమనార్హం. మరోవైపు, 2025 ఫిబ్రవరి నుంచి జూన్ వరకు ఐదు నెలల కాలంలో ఇన్విక్టో MPV స్థిరమైన డిమాండ్ సాధించింది. ఈ కాలంలో మొత్తం 1,362 యూనిట్లు అమ్ముడవ్వగా, ప్రతి నెల సగటున 272 యూనిట్లు మార్కెట్‌లోకి వెళ్లాయి.

MPVల విభాగంలో పోటీ ఎక్కువగా ఉన్నప్పటికీ, ఇన్విక్టో తన ప్రత్యేకతతో ఒక స్థిరమైన స్థానాన్ని పొందిందని ఈ గణాంకాలు చెబుతున్నాయి. భారతీయ కుటుంబాలు ఎక్కువగా విస్తృతమైన ఇంటీరియర్, కంఫర్ట్, సేఫ్టీ, ఫీచర్లు కోరుకునే సందర్భంలో, ఇన్విక్టో లాంటి కార్లు బాగా సరిపోతాయి. అదే కారణంగా, పెద్ద ఫ్యామిలీకి అనువైన వాహనం కోసం చూస్తున్నవారు ఈ మోడల్‌ను ఎంచుకుంటున్నారు. రాబోయే పండుగ సీజన్‌కి అనుగుణంగా ఇది మంచి సేల్స్ సాధిస్తుందని అంచనా.
మారుతి సుజుకి ఇన్విక్టో తన క్లాస్‌లో ప్రత్యేకంగా నిలిచే ప్రిమియం MPV. ఈ కారు విస్తృతమైన ఇంటీరియర్, శక్తివంతమైన హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్, ప్రీమియం ఫీచర్లతో ఫ్యామిలీ కస్టమర్లకు మరింత ఆకర్షణీయమైన ఆప్షన్‌గా మారింది. ధరల విషయానికి వస్తే, ఇన్విక్టోను రూ. 25.51 లక్షల నుంచి రూ. 29.22 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) అందిస్తున్నారు. ఇది కంపెనీ ప్రీమియం బ్రాండ్ అయిన నెక్సా డీలర్‌షిప్‌ల ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటుంది.

ఈ MPVని కంపెనీ జీటా (Zeta), ఆల్ఫా (Alpha) అనే రెండు వేరియంట్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. పనితీరులోనూ ఇన్విక్టో ప్రత్యేకతను నిలబెట్టుకుంది. ఇందులో 2-లీటర్, 4-సిలిండర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్ (పెట్రోల్ + ఎలక్ట్రిక్) అమర్చబడి ఉంది. ఇది గరిష్టంగా 188.9 PS పవర్, 206 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌ను e-CVT గేర్‌బాక్స్‌తో జత చేశారు. ఇది 23.24 kmpl మైలేజీ అందిస్తుంది.
ఫ్యూయల్ ట్యాంక్ విషయానికి వస్తే, 52 లీటర్ల వరకు ఉంది. ఒకసారి ట్యాంక్ నింపితే ఎక్కువ దూరం ప్రయాణించడానికి ఇబ్బంది ఉండదు. ఇది ఫ్యామిలీ ట్రిప్స్‌కి సరిగ్గా సరిపోతుంది. ఇన్విక్టో MPV భద్రత, సౌకర్యం పరంగా తన క్లాస్‌లో ఒక ప్రీమియం ఎంపికగా నిలుస్తోంది. ఈ వాహనం డ్రైవర్‌కి మాత్రమే కాకుండా, ప్రయాణికులందరికీ మెరుగైన రక్షణను అందించేలా ప్రత్యేకంగా రూపొందించబడింది.

భద్రతా అంశాల పరంగా చూస్తే, ఇన్విక్టోలో 6 ఎయిర్‌బ్యాగులు అమర్చబడి ఉండగా, ABS (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), EBD (ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), ESC (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్), VSC (వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్) వంటి ఆధునిక సాంకేతికతలు లభిస్తాయి. అదనంగా, TPMS (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్), 360-డిగ్రీ కెమెరా, రియర్ పార్కింగ్ సెన్సార్లు వంటి ఫీచర్లు డ్రైవర్‌కి మరింత నమ్మకాన్ని, సేఫ్ డ్రైవింగ్ అనుభవాన్ని కల్పిస్తాయి.


Click it and Unblock the Notifications








