పేదలు కూడా కొనేంత తక్కువ ధరకే కారు.. 6 మంది వెళ్లొచ్చు.. జనాలను విపరీతంగా ఆకర్షిస్తుంది

భారత ఆటోమొబైల్ మార్కెట్లో అత్యంత విశ్వసనీయమైన, ప్రజాదరణ పొందిన వాహనాలలో ఒకటిగా మారుతి సుజుకి ఈకో (Maruti Suzuki Eeco) స్థిరంగా నిలిచింది. కుటుంబ అవసరాలకైనా, వ్యాపార ప్రయోజనాలకైనా లేదా స్కూల్ వ్యాన్‌‌లుగా ఉపయోగించుకునేందుకైనా ఈకో భారతీయ వినియోగదారుల జీవనశైలిలో ఒక భాగమైపోయింది. గతంలో మారుతి ఓమ్ని ఎంత ప్రాచుర్యం పొందిందో, ఇప్పుడు ఆ స్థానం మొత్తాన్ని ఈకో దక్కించుకుందనే చెప్పాలి. ఓమ్ని ఉత్పత్తి నిలిపివేయబడిన తర్వాత ఏర్పడిన ఆ ఖాళీని ఈకో భర్తి చేసి, తన విశ్వసనీయతతో మార్కెట్లో కొత్త చరిత్ర సృష్టిస్తోంది. అక్టోబర్ 2025 నెల ఈ విజయ పరంపరలో మరో ముఖ్యమైన అధ్యాయం అయింది.

మారుతి సుజుకి అధికారిక అమ్మకాల నివేదిక ప్రకారం, ఈ నెలలో కంపెనీ మొత్తం 13,537 యూనిట్ల ఈకో వాహనాలను విక్రయించింది. ఇది గత ఏడాది అక్టోబర్‌లో నమోదైన 11,653 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే 1,884 యూనిట్ల పెరుగుదల అని చెప్పాలి. అంటే కేవలం ఒక సంవత్సరంలోనే ఈ మోడల్‌పై వినియోగదారుల నమ్మకం మరింత బలపడిందని స్పష్టంగా అర్థమవుతుంది. ఈ వృద్ధి వెనుక పలు కీలక కారణాలు ఉన్నాయి.

Maruti Suzuki Mpv Eeco October 2025 Sales 13537 Units Details Inside

మొదటగా, మారుతి సుజుకి ఈకో ధరకు తగిన విలువను అందిస్తోంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ స్థలం, సులభమైన మెయింటెనెన్స్, అద్భుతమైన మైలేజ్.. ఇవన్నీ ప్రతి తరగతి వినియోగదారులకు అనుకూలంగా నిలబెడుతున్నాయి. చిన్న వ్యాపారులు తమ వస్తువుల రవాణాకు, స్కూల్‌లు విద్యార్థుల రవాణాకు, కుటుంబాలు తమ రోజువారీ ప్రయాణాలకు ఈ వాహనాన్ని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. భారతదేశంలో పెరుగుతున్న లాజిస్టిక్స్, డెలివరీ సర్వీసులు, చిన్న వ్యాపారాల విస్తరణ కూడా ఈకో అమ్మకాలకు ఊతమిచ్చింది.

మెయింటెనెన్స్ తక్కువగా ఉండటం, విడి భాగాలు సులభంగా అందుబాటులో ఉండటం వంటి అంశాలు దీన్ని చిన్న వ్యాపారులకు అత్యంత ఆర్థికంగా ఉపయోగపడే వాహనంగా నిలబెట్టాయి. మారుతి సుజుకి కూడా ఈ మోడల్‌ను వినియోగదారుల అవసరాలకు తగ్గట్టు ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ వస్తోంది. భద్రతా ప్రమాణాలు, ఫ్యూయల్ ఎఫిషెన్సీ, ఇంజిన్ పనితీరు కలిపి ఈకోకు స్థిరమైన మార్కెట్ డిమాండ్‌ను అందిస్తున్నాయి.

Maruti Suzuki Mpv Eeco October 2025 Sales 13537 Units Details Inside

ప్రస్తుతం మార్కెట్లో మారుతి సుజుకి ఈకో ఎంట్రీ-లెవల్ వేరియంట్ ధర కేవలం రూ.5.21 లక్షలు మాత్రమే. అంటే తక్కువ బడ్జెట్‌లో వాహనం కొనాలనుకునే వారికి ఇది ఒక అద్భుతమైన ఎంపికగా మారింది. అదే సమయంలో, ఈకో టాప్ వేరియంట్ ధర రూ.6.36 లక్షలు (ఎక్స్-షోరూమ్) మాత్రమే. ధర పరంగా పెద్ద తేడా లేకపోవడం కూడా ఈ మోడల్‌ను మరింత ఆకర్షణీయంగా నిలబెడుతోంది. ఈకో మంచి మైలేజ్ కూడా ఇస్తుంది.

పెట్రోల్ వేరియంట్లు లీటర్‌కు 19.71 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తాయి. ఇది నగర డ్రైవింగ్, లాంగ్ రైడ్‌లకు కూడా సమానంగా అనుకూలంగా ఉంటుంది. ఇక CNG వేరియంట్లు మరింత ఆర్థికంగా ఉండి లీటర్‌కు 26.78 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తాయని ARAI సర్టిఫికేషన్ ప్రకారం మారుతి సుజుకి ప్రకటించింది. ఈకో వాహనం ప్రధాన ఆకర్షణ దీని సింపుల్ డిజైన్, అంతర్గత స్థలం, తక్కువ నిర్వహణ ఖర్చు, మెరుగైన మైలేజ్.

Maruti Suzuki Mpv Eeco October 2025 Sales 13537 Units Details Inside

మారుతి సుజుకి ఈకో తక్కువ ధరలో లభించే వాహనం అయినప్పటికీ, భద్రత పరంగా మాత్రం ఎలాంటి రాజీ పడలేదు. ఈ వాహనం ఇప్పుడు తన విభాగంలో అత్యుత్తమ భద్రతా ప్రమాణాలను అందిస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు ప్రామాణికంగా (స్టాండర్డ్‌గా) ఇవ్వడం మారుతి సుజుకి కంపెనీ భద్రతా దృష్టిని స్పష్టంగా తెలియజేస్తోంది. ESP,ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్‌తో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటివి దీనిలో ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Monday, November 3, 2025, 14:51 [IST]
English summary
Maruti suzuki mpv eeco october 2025 sales 13537 units details inside
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+