ఏనుగు సైజున్న కారును పడగొట్టిన కస్టమర్లు.. మారుతికి పెద్ద షాక్ ఇచ్చారు!

మారుతి సుజుకి ఇన్విక్టో (Maruti Suzuki Invicto) భారత మార్కెట్లో ఒక పెద్ద, ప్రీమియం MPVగా నిలుస్తోంది. ఇది అసలు టయోటా ఇన్నోవా హైక్రాస్ రీ-బ్యాడ్జ్ చేయబడిన వెర్షన్ అయినప్పటికీ, సుజుకి తమదైన టచ్‌తో ఈ కారును మరింత ఫ్యామిలీ ఫ్రెండ్లీ, కంఫర్ట్-ఒరియెంటెడ్ కారుగా తీర్చిదిద్దింది. బలమైన రోడ్ ప్రెజెన్స్, సొగసైన డిజైన్, ఆధునిక టెక్నాలజీ, అలాగే హై-ఎండ్ ఫీచర్లతో ఇన్విక్టో మొదట మార్కెట్లో మంచి దృష్టిని ఆకర్షించింది. అయితే, కాలక్రమేణా ఈ మోడల్ అమ్మకాల పరంగా కొంత మందగించింది. ప్రత్యేకంగా 2025 సెప్టెంబర్ నెలలో అమ్మకాల గణాంకాలు చూస్తే, కేవలం 215 యూనిట్లు మాత్రమే డెలివరీ చేయబడ్డాయి. గత ఏడాది ఇదే కాలంలో ఈ సంఖ్య 312 యూనిట్లుగా ఉండగా, ప్రస్తుతం అమ్మకాలు దాదాపు 31% తగ్గుదలను నమోదు చేశాయి.

ఈ క్షీణతకు పలు కారణాలు ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. మొదటగా, టయోటా ఇన్నోవా హైక్రాస్ ఇప్పటికే మార్కెట్లో బలమైన స్థానం కలిగి ఉండటం వల్ల, అదే సెగ్మెంట్‌లో ఇన్విక్టోకు ప్రత్యేకత చూపడం కష్టమైంది. రెండవది, ఇన్విక్టో ప్రీమియం ధర అనేక మంది వినియోగదారులకు కొంత ఎక్కువగా అనిపిస్తోంది. ధర చాలా ఎక్కువగా ఉండటం వలన కొత్త వినియోగదారులు ఈ కారు కొనడానికి ఆసక్తి చూపించడం లేదు.

Maruti Suzuki Mpv Invicto September 2025 Sales 31 Percent Down Compared To Previous

అంతేకాకుండా, SUVలపై పెరుగుతున్న డిమాండ్ కూడా MPVల అమ్మకాలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. అయినా కూడా, ఇన్విక్టో తన సాఫ్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ, విశాలమైన ఇంటీరియర్, సుజుకి నమ్మకానికి కట్టుబడి ఉండటం వల్ల కొన్ని వర్గాల్లో మాత్రం స్థిరమైన అభిమానాన్ని కొనసాగిస్తోంది. భవిష్యత్తులో కంపెనీ కొన్ని అప్‌డేట్లు లేదా కొత్త వేరియంట్లను విడుదల చేస్తే, ఈ MPV మరల తన అమ్మకాలలో ఊపును పొందే అవకాశం ఉంది.

కొత్త మారుతి సుజుకి ఇన్విక్టో ప్రస్తుతం మార్కెట్లో ప్రీమియం MPV సెగ్మెంట్‌లో ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పరుచుకుంది. ధర పరంగా రూ. 24.97 లక్షల నుండి ప్రారంభమై, రూ.28.60 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఈ MPV రెండు అధునాతన వేరియంట్లలో జీటా (Zeta), ఆల్ఫా (Alpha) లభిస్తుంది. . రెండు వేరియంట్లూ లగ్జరీ ఫీచర్లతో, విశాలమైన ఇంటీరియర్‌తో, ఫ్యామిలీ ట్రావెల్స్‌కి అనువైన కంఫర్ట్ లెవెల్‌తో రూపొందించబడ్డాయి.

Maruti Suzuki Mpv Invicto September 2025 Sales 31 Percent Down Compared To Previous

ఇన్విక్టో అసలు బలం దాని పవర్‌ట్రెయిన్‌లోనే ఉంది. ఇది 2.0-లీటర్, 4-సిలిండర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్‌ను కలిగి ఉంది, ఇది పెట్రోల్, ఎలక్ట్రిక్ మోటార్ కలయికలో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ 6,000 rpm వద్ద 152 bhp శక్తిని, అలాగే 5,200 rpm వద్ద 188 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి జతచేయబడిన e-CVT గేర్‌బాక్స్ స్మూత్ డ్రైవింగ్ ఎక్స్పీరియెన్స్‌ను అందిస్తుంది. ముఖ్యంగా నగర రహదారులపై బెస్ట్.

మైలేజ్ విషయానికి వస్తే, ఇన్విక్టో లీటరుకు 23 kmpl వరకు ఇస్తుంది. దీని 52 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ దూర ప్రయాణాలకు తగినదిగా ఉంటుంది, తరచూ రీఫ్యూయల్ అవసరాన్ని తగ్గిస్తుంది. పర్ఫార్మెన్స్ పరంగా కూడా ఈ MPV నిరాశపరచదు. ఇది 0 నుండి 100 kmph వేగాన్ని కేవలం 9.5 సెకన్లలో చేరుతుంది. గరిష్ట వేగం 170 kmph, అంటే దూర ప్రయాణాలు కూడా పూర్తి సౌకర్యంతో చేయవచ్చు.

Maruti Suzuki Mpv Invicto September 2025 Sales 31 Percent Down Compared To Previous

మారుతి సుజుకి ఇన్విక్టో తన లగ్జరీ ఇంటీరియర్, ఆధునిక ఫీచర్లతో కుటుంబ వినియోగదారులను ప్రధానంగా ఆకట్టుకుంటోంది. వేరియంట్ల ఆధారంగా ఇది 7 లేదా 8 సీటర్ కాన్ఫిగరేషన్‌లో లభిస్తుంది, అందువల్ల చిన్న కుటుంబాలకైనా, పెద్ద కుటుంబాలకైనా ఇది ఒక అద్భుతమైన ఎంపికగా మారింది. ప్రతి సీటు కంఫర్ట్‌కి ప్రాధాన్యతనిస్తూ డిజైన్ చేయబడింది. ఇది సేప్టీలో 5 స్టార్ రేటింగ్ పొందింది.

More from DriveSpark

Article Published On: Wednesday, October 15, 2025, 16:20 [IST]
English summary
Maruti suzuki mpv invicto september 2025 sales 31 percent down compared to previous
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+