ఇంకా ఎన్నాళ్లు పెట్రోల్-డీజిల్ కొట్టించడానికి కష్టపడతారు.. ఈ 500+ కి.మీల రేంజ్ మారుతీ కారుతో చెక్ పెట్టేయండి
ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతుంది. పెట్రోల్, డీజిల్, cng వాహనాలతో పాటే ఈవీలను కూడా చాలా మంది కొనుగోలు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే భారత్‌లోనే వీటి డిమాండ్ మరింత ఎక్కువగా కనిపిస్తుంది. దీంతో దేశీయ కంపెనీలే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లో కూడా మంచి పేరు కలిగిన వాహన తయారీదారులు తమ మోడళ్లను భారత్‌లో విడుదల చేస్తున్నారు. లోకల్ కంపెనీలు టాటా మోటార్స్, మహీంద్రా వంటి సంస్థలు ఇప్పటికే సాంప్రదాయ ఇంధన వాహనాలను లాంచ్ చేస్తూనే ఎలక్ట్రిక్ కార్లను కూడా తీసుకొస్తున్నారు. అయితే భారత్‌లో అతిపెద్ద వాహన తయారీదారుగా ఉన్న మారుతీ సుజుకీ మాత్రం ఈ విభాగంలో ఇంకా వెనుకబడి ఉంది. దీంతో మిగతా కంపెనీలకు పోటీగా ఈవీలలో కూడా తన సత్తాను చాటుకోడానికి దేశంలో తన మొదటి ఎలక్ట్రిక్ కారు కొత్త ఇ-విటారాను ఆవిష్కరించింది.
ఢిల్లిలో జరుగుతున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 ఈవెంట్‌లో మారుతీ తన కొత్త ఇ విటారా(e-vitara)ను పరిచయం చేసింది. ఈ కారు రాకతో మార్కెట్లో కంపెనీ పేరు మరింత మారుమోగుతుంది. ఇన్నాళ్లు కూడా ఈవీలలో వెనుకబడి ఉన్న సంస్థ ఇప్పుడు పోటీకి సిద్ధం అయింది. ఇ విటారాను ఇహార్టెక్ ప్లాట్‌ఫారమ్ ద్వారా రూపొందించబడింది. దీనిని 2023లో ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన మారుతి EVX కాన్సెప్ట్ నుంచి తీసుకున్నారు.

మారుతీ ఇ వాటారా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కొనుగోలుకు అందుబాటులోకి వచ్చినట్లయితే సేల్స్ పరంగా దూసుకుపోతుందని కంపెనీ భారీ అంచనాలు పెట్టుకుంది. ఇప్పటికే దేశీయ మార్కెట్లో అమ్మకానికి ఉన్న టాటా మోటార్స్, కియా, మహీంద్రా వంటి కంపెనీలకు చెందిన కార్లకు గట్టి పోటీ ఎదురుకానుంది. సాధారణంగా మారుతీ నుంచి వచ్చే వాహనాలకు మంచి డిమాండ్ ఉంటుంది. అలాంటిది ఇప్పుడు ఎలక్ట్రిక్ కారు అంటే దీనికి మంచి ఆదరణ లభించే అవకాశం ఉంది.
మారుతీ ఇ విటారా బ్యాటరీ: ఈ కారులో 49kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది 142bhp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. రెండో బ్యాటరీ 61kWh గరిష్టంగా 172bhp పవర్‌ను విడుదల చేస్తుంది. రెండు 192Nm టార్కును ఉత్పత్తి చేస్తాయి. ఈ ఎలక్ట్రిక్ కారు సింగిల్ ఛార్జ్‌తో దాదాపు 500 కి.మీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుంది. దీనిలో శక్తివంతమైన లిథియం ఐరన్-ఫాస్ఫేట్ బ్యాటరీల ద్వారా నడిచే మోటారును ఏర్పాటు చేశారు.

డిజైన్ : మారుతీ ఇ విటారా ఎక్స్టీరియర్ ఆకట్టుకుంటుంది. పొడవైన వీల్‌బేస్, పెద్ద టైర్లు, కఠినమైన వాతావరణ పరిస్థితులను సైతం తట్టుకునేలా దీని బాడీ ఆకర్షణీయంగా ఉంటుంది. అడ్వాంచర్ తరహ రైడింగ్‌ను అందిస్తుంది. ముందు, వెనుక నుంచి దీని స్టైలిష్ డిజైన్ ఎక్కువ మంది వినియోగదారులకు నచ్చేలా ఉంది. కంపెనీ దీని డిజైన్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఇంటీరియర్ కూడా అట్రాక్టివ్‌గా ఉంటుంది.
ఫీచర్స్: కారు లోపల పెద్ద 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, డ్యూయల్ డిస్‌ప్లే, 10-వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ మొబైల్ ఛార్జర్, మూడు లేయర్లుగా డివైడ్ చేసిన డ్యాష్‌బోర్డ్, 2-స్పోక్ స్టీరింగ్ వీల్, ప్రయాణికుల భద్రత కోసం ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు, చుట్టు చూడటానికి 360-డిగ్రీ కెమెరా, మొదటి స్థాయి-2 ADAS, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటివి ఉన్నాయి.

ఆటో ఎక్స్‌పోకి సంబంధించిన లైవ్ అప్‌డేట్స్ కోసం మా డ్రైవ్‌స్పార్క్ సోషల్ మీడియా పేజీలను ఫాలో అవ్వండి. మా తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు.


Click it and Unblock the Notifications








