28.65 కి.మీ మైలేజ్, 5 స్టార్ సేఫ్టీ.. మధ్యతరగతి కలల కారు.. డీలర్‌షిప్‌లకు చేరుకున్న విక్టోరిస్!

భారత ఆటోమొబైల్ రంగంలో పెరుగుతున్న పోటీకి సమాధానంగా మారుతి సుజుకి (Maruti Suzuki) తన సత్తాను మరోసారి చూపించేందుకు సిద్ధమవుతోంది. ఎప్పుడూ సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే ధరలతో, నమ్మకమైన పనితీరుతో వాహనాలను అందించే ఈ దిగ్గజ సంస్థ ఇప్పుడు SUV మార్కెట్‌లో అడుగు వేసింది. తాజాగా మారుతి సుజుకి విక్టోరిస్ (Maruti Suzuki victoris) SUVను అధికారికంగా పరిచయం చేసింది. ఈ కొత్త SUV రూపకల్పనలోనే కాకుండా ఫీచర్ల పరంగా కూడా ఆధునికతను మిళితం చేస్తూ వచ్చింది. బలమైన డిజైన్, ఆకర్షణీయమైన లుక్, సౌకర్యవంతమైన ఇంటీరియర్‌తోవినియోగదారులకు కొత్త అనుభూతిని ఇవ్వబోతుందని కంపెనీ చెబుతోంది. ఇది కేవలం డిజైన్ పరంగానే కాకుండా, టెక్నాలజీ పరంగా కూడా పూర్తిగా అప్డేట్ అవుతూ వచ్చింది.

హ్యుందాయ్ క్రెటా, హోండా ఎలివేట్, టాటా నెక్సాన్, కియా సెల్టోస్ వంటి ప్రస్తుత మార్కెట్ లీడర్లతో నేరుగా పోటీపడేలా విక్టోరిస్ SUVను సిద్ధం చేశారు. ఈ కారు రోడ్డుపైకి రాగానే మధ్యస్థ SUV సెగ్మెంట్‌లో మరో హీట్ పోటీ మొదలవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కంపెనీ దేశవ్యాప్తంగా ఉన్న డీలర్‌షిప్‌లకు ఈ కారును డెలివరీ చేసే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించింది. అక్టోబర్ నెలలో అధికారికంగా లాంచ్ చేయబడే అవకాశముంది.

Maruti Suzuki New Suv Victoris Arrives Dealerships

ధర పరంగా అందుబాటులోనే ఉండబోతోంది. ఎక్స్-షోరూమ్ ధరను రూ. 9.70 లక్షలుగా అంచనా. ఇది ఇప్పటికే ఉన్న పోటీ SUVలతో పోలిస్తే సరసమైన రేంజ్‌లో ఉండటం వల్ల, వినియోగదారుల దృష్టిని ఆకర్షించే అవకాశం ఎక్కువ. ఇక బుకింగ్‌లు కూడా ప్రారంభమయ్యాయి. ఆసక్తి ఉన్న కస్టమర్లు కేవలం రూ. 11,000 ముందస్తు చెల్లించడం ద్వారా తమ ఆర్డర్‌ను కన్‌ఫర్మ్ చేసుకోవచ్చు. ఇప్పటికే షోరూమ్‌ల వద్ద మంచి స్పందన రావడం ప్రారంభమైందని సమాచారం.

ఈ SUVకి ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన అంశం భద్రతా ప్రమాణాలు. డిజైర్ తర్వాత క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ రేటింగ్ సాధించిన మారుతి రెండవ మోడల్ ఇది. భారత వినియోగదారులు భద్రతా రేటింగ్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న సమయంలో ఈ ఘనత విక్టోరిస్‌ను ప్రత్యేకంగా నిలబెడుతోంది. ఫ్యామిలీ వినియోగదారులు ఈ కారును హాయిగా ఎంచుకోవచ్చు. పండుగ సమయంలో కస్టమర్లకు ఇది బెస్ట్ ఆప్షన్‌గా ఉండనుంది.

Maruti Suzuki New Suv Victoris Arrives Dealerships

ఇక పవర్‌ట్రెయిన్‌ల విషయానికి వస్తే, విక్టోరిస్ మూడు వేర్వేరు ఇంజిన్ ఆప్షన్లలో అందిస్తున్నారు. ఇందులో 1.5-లీటర్ మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ వేరియంట్ ఉంది. ఈ ఇంజిన్ 103 bhp శక్తిని ఉత్పత్తి చేస్తూ, 137 Nm పీక్ టార్క్‌ను అందిస్తుంది. దీనికి 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలు ఇవ్వబడ్డాయి. మరోవైపు, మరింత శక్తివంతమైన 1.5-లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ (పెట్రోల్ + ఎలక్ట్రిక్) ఇంజిన్ కూడా లభిస్తోంది.

ఇది 116 bhp హార్స్‌పవర్‌తో పాటు 141 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ వేరియంట్ ప్రత్యేకంగా e-CVT గేర్‌బాక్స్‌తోనే జతచేయబడింది, కాబట్టి ఇది మరింత స్మూత్ డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది. మరోవైపు, మరింత శక్తివంతమైన 1.5-లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ (పెట్రోల్ + ఎలక్ట్రిక్) ఇంజిన్ కూడా లభిస్తోంది. ఇది 116 bhp హార్స్‌పవర్‌తో పాటు 141 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Maruti Suzuki New Suv Victoris Arrives Dealerships

ఈ వేరియంట్ ప్రత్యేకంగా e-CVT గేర్‌బాక్స్‌తోనే జతచేయబడింది. దీనిలో ప్రధాన ఆకర్షణ ఫ్యూయల్ ఎఫిషియెన్సీ. వేరియంట్‌ను బట్టి, విక్టోరిస్ 19 kmpl నుంచి 28.65 kmpl వరకు మైలేజీ అందిస్తుంది. అంటే, కార్లే కాకుండా బైక్‌ల మైలేజీకి కూడా సాటిలేనిది. డిజైన్ విషయానికి వస్తే, లేటెస్ట్ ఫ్రంట్ గ్రిల్, షార్ప్ LED లైట్లు, స్పోర్టీ బాడీ లైన్‌లు, ప్రీమియం ఇంటీరియర్‌లో యువతతో పాటు ఫ్యామిలీ కస్టమర్లను కూడా ఆకట్టుకునేలా ఉంది.

More from DriveSpark

Article Published On: Saturday, September 6, 2025, 12:16 [IST]
English summary
Maruti suzuki new suv victoris arrives dealerships more details inside
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+