రేపటి అనౌన్స్‌మెంట్ కోసం దేశవ్యాప్తంగా వెయిటింగ్.. ఇప్పటికే షోరూమ్ ముందు బారులు తీరిన కస్టమర్లు!

దేశీయ ఆటోమొబైల్ రంగంలో అగ్రగామిగా నిలిచిన మారుతి సుజుకి (Maruti Suzuki) ఎప్పటికప్పుడు వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా కొత్త మోడళ్లను మార్కెట్‌లోకి తీసుకువస్తూ, తన స్థాయిని మరింత బలపరుస్తూ వస్తోంది. ఆధునిక కాలానికి తగ్గట్టుగా డిజైన్‌, టెక్నాలజీ, ఫీచర్స్ అన్నింటినీ సమన్వయం చేస్తూ కొత్త వాహనాలను పరిచయం చేయడంలో కంపెనీ ఎల్లప్పుడూ ముందుంటుంది. ఈ క్రమంలో తాజాగా విక్టోరిస్ SUVను ఆవిష్కరించడం ద్వారా మరోసారి వినియోగదారుల దృష్టిని ఆకర్షించింది. ఈ మోడల్‌లో అందించిన డిజైన్‌ ప్రత్యేకంగా ఆకట్టుకునే విధంగా ఉండగా, ఎక్స్‌టీరియర్ నుంచి ఇంటీరియర్ వరకు ప్రతిదీ లేటెస్ట్ లుక్‌ను ప్రతిబింబిస్తుంది. ఒక SUVలో కావలసిన ప్రతి ఫీచర్‌ను దాదాపుగా సమకూర్చి, మధ్యతరగతి వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని అందుబాటు ధరలో అందించాలన్న ఆలోచనతో మారుతి ముందుకు వచ్చినట్లు కనిపిస్తోంది.

ఇప్పటికే ఈ కొత్త SUVని డీలర్‌షిప్‌లకు డెలివరీ చేయడం ప్రారంభించింది. ధర విషయంలో పెద్ద ఆశలు పెట్టుకున్నారు. రేపు (సెప్టెంబర్ 15) అధికారిక ధర ప్రకటించనుండగా, ఇది రూ. 9.70 లక్షల నుండి రూ. 15 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ధర SUV మార్కెట్లో ప్రస్తుత పోటీని దృష్టిలో ఉంచుకుని చూస్తే, వినియోగదారులకి ఇది ఒక బెస్ట్ ఆఫర్‌గా నిలుస్తుంది.

Maruti Suzuki New Suv Victoris Price Will Be Announced On Tomorrow

ముఖ్యంగా కుటుంబాలు, మధ్యతరగతి కొనుగోలుదారులు ఈ కొత్త SUV వైపు మరింతగా ఆకర్షితులయ్యే అవకాశం ఉంది. మార్కెటింగ్ & సేల్స్ విభాగం సీనియర్ అధికారి పార్థో బెనర్జీ మాట్లాడుతూ, విక్టోరిస్ ధరను రేపే ప్రకటిస్తాం. వినియోగదారుల అంచనాలను తీరుస్తూ, సరసమైన ధరలో అత్యుత్తమ SUVగా నిలుస్తుందని మా నమ్మకం అని అన్నారు. దీంతో కస్టమర్లలో ఆసక్తి మరింత పెరిగింది. ధర ప్రకటనా తరువాత మార్కెట్లో ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

మారుతి సుజుకి తాజాగా ఆవిష్కరించిన విక్టోరిస్ SUV కోసం ఇప్పటికే బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. ఆసక్తి ఉన్న వినియోగదారులు కేవలం రూ. 11,000 అడ్వాన్స్ చెల్లించడం ద్వారా తమ ఆర్డర్‌ను బుక్ చేసుకోవచ్చు. ఈ SUVపై ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పటివరకు ప్రతిరోజూ సగటున వెయ్యి బుకింగ్‌లు అందుకుంటున్నట్లు తెలుస్తోంది. అంటే మార్కెట్‌లో ఈ మోడల్‌కి ఎంతటి డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

Maruti Suzuki New Suv Victoris Price Will Be Announced On Tomorrow

పర్ఫార్మెన్స్ విషయంలోనూ విక్టోరిస్ SUV దుమ్మురేపేలా వస్తోంది. ఇందులో మూడు రకాల పవర్‌ట్రెయిన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. మొదటిది 1.5-లీటర్ మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్, రెండోది 1.5-లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ (పెట్రోల్ + ఎలక్ట్రిక్), మూడోది 1.5-లీటర్ CNG ఇంజిన్. ట్రాన్స్‌మిషన్ విషయానికి వస్తే 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్, e-CVT గేర్‌బాక్స్ వేరియంట్లలో అందుబాటులో ఉండబోతోంది.

మైలేజీ విషయానికొస్తే వేరియంట్‌ను బట్టి 19 kmpl నుండి 28.65 kmpl వరకు మైలేజీ ఇస్తుంది. అంటే ఇంధన సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకునే వినియోగదారులకు ఇది ఒక గేమ్‌చేంజర్ లాంటిదే. అదనంగా, ఇందులో 45 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ అందించబడింది. పెర్ఫార్మెన్స్ గణాంకాలను చూస్తే ఇది మరింత ఆకట్టుకుంటుంది. గరిష్ట వేగం గంటకు 135 కి.మీ.లు కాగా, కేవలం 12.9 సెకన్లలో 0 నుండి 100 కి.మీ. వేగం అందుకుంటుంది.

Maruti Suzuki New Suv Victoris Price Will Be Announced On Tomorrow

ఈ కారులో ప్రధాన ఆకర్షణ దీని సేఫ్టీ. ఇది ప్రయాణీకుల రక్షణ కోసం భారత్ NCAP నుండి దీనికి 5-స్టార్ భద్రతా రేటింగ్ పొందింది. దీని కోసం, దీనికి 6 ఎయిర్‌బ్యాగులు, ESC (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్), TPMS (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్), ABS (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్), EBD (ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్), 360-డిగ్రీ కెమెరా ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Sunday, September 14, 2025, 16:13 [IST]
English summary
Maruti suzuki new suv victoris price will be announced on tomorrow
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+