అదిగో.. స్విఫ్ట్ కొత్త మోడల్ వచ్చేస్తోంది… ఈసారి మైలేజీ, సేఫ్టీ ఇంటర్నేషనల్ లెవెల్లో..
భారతీయ ఆటో మొబైల్ ఇండస్ట్రీలో మారుతీ సుజుకీ పేరు అందరికీ సుపరిచితమే. ఈ సంస్థ నుంచి వచ్చే కొత్త కారు మోడళ్ల కోసం వినియోగదారులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఈ కంపెనీ నుంచి పాపులర్ హ్యాచ్ బ్యాక్ అయిన స్విఫ్ట్.. ఎంతో మంది కస్టమర్లకు ఫేవరేట్ కారుగా పేరు సంపాదించింది. దాని అట్రాక్టివ్ డిజైన్, ఫీచర్లతో సేల్స్ పెంచుకుని టాప్‌లో ఒకటిగా కొనసాగుతోంది. గతేడాది ఈ కారుకు సంబంధించి ఫోర్త్ జనరేషన్ మోడల్‌ను తీసుకువచ్చిందీ సంస్థ. అయితే... దీంట్లో అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న సుజకీ స్విప్ట్ మోడల్‌లో ఉండే ఫీచర్లన్నీ లేవు. కానీ, ఇప్పుడు ఆ లోటును భర్తీ చేసేందుకు సిద్ధమవుతోంది మారుతీ సంస్థ. అత్యాధునిక హంగులతో కొత్త స్విఫ్ట్ మోడల్‌ను భారత మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. ఆ విశేషాలేంటో చూసేద్దాం.
ఈ సంస్థ నుంచి రాబోయే కొత్త స్విఫ్ట్ మోడల్ కారు దిల్లీలో ఎవరో టెస్ట్ డ్రైవ్ చేస్తుండగా కనిపించింది. దీని ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వచ్చేశాయి. అంతా అనుకున్నట్లు జరిగితే... రానున్న కొన్ని నెలల్లోనే దీన్ని భారత్‌లో లాంఛ్ చేసే అవకాశం ఉంది.

సోషల్ మీడియాలో కనిపించిన మారుతీ సుజుకీ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్.... అట్రాక్టివ్ ఎక్స్‌టీరియర్ డిజైన్‌తో ఉంది. ఈ కారు ముందు, వెనకాల ఒక స్పోర్టీ బంపర్ ఉంది. దీన్ని జాగ్రత్తగా గమనిస్తే.. దీని ఫ్రంట్ గ్రిల్ పైన 'radar module' ఉన్నట్లు కనిపిస్తోంది. అంతేగాకుండా ఈ కారులో ADAS (అడ్వాన్స్ డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టం) ఫీచర్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
ADAS అనేది ఒక సేఫ్టీ ఫీచర్. దీంట్లో లైన్ డిపార్చర్ వార్నింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, డ్రైవర్ అసిస్టెన్స్, రియర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్, ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ వంటి ప్రయాణికుల రక్షణ కోసం నిర్దేశించిన ఫీచర్లు ఉంటాయి.

టెస్ట్‌డ్రైవ్‌లో కనిపించిన మారుతీ సుజుకీ స్విఫ్ట్ కొత్త మోడల్ కారు.. హైబ్రిడ్(ఎలక్ట్రిక్+ పెట్రోల్) ఇంజిన్‌తో ఉండే అవకాశం ఉంది. ఇది 24.8 నుంచి 26.3 కేఎంపీఎల్ మైలేజీ అందించగలదని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న స్విఫ్ట్ మోడల్ కంటే ఈ కొత్త మోడల్ ధర కాస్త ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది.
ఇక మారుతీ స్విఫ్ట్ రెగ్యులర్ కారు... దేశీయ మార్కెట్లో ప్రస్తుతం ధర రూ.6.49 లక్షల నుంచి రూ.9.60 లక్షల(ఎక్స్- షోరూమ్) మద్య ఉంది. దీంట్లో పెట్రోల్, సీఎన్‌జీ ఇంజిన్ల ఆప్షన్లు ఉన్నాయి. ఇది 24.80 నుంచి 32.85 kmpl మైలేజీ అందించగలదు. 5- సీటర్ ఆప్షన్‌తో ఉన్న ఈ కారులో సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు.
ఈ కారులో 9- అంగుళాల ఇన్‌ఫోటెయిన్మెంట్ సిస్టం, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, ఆటో- క్లైమేట్ కంట్రోల్, సెమీ- డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్లెస్ ఛార్జర్, ఆర్కామిస్- ట్యూన్‌డ్ సౌండ్ సిస్టం వంటి ఫీచర్లు ఉంటాయి. దీని సేఫ్టీ విషయానికి వస్తే.. ఇది 6 ఎయిర్ బ్యాగులతో, ABS ()యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టం), 3- పాయింట్ సీట్ బెల్ట్స్‌తో ఉంటుంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








