దుమ్మురేపిన మారుతి.. ఒక్క నెలలోనే ఇన్ని లక్షల మంది కొత్త కారు కొన్నారు.. మార్కెట్‌నే కుదిపేసింది!

భారత ఆటోమొబైల్ రంగంలో అగ్రస్థానాన్ని దక్కించుకున్న మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (Maruti Suzuki India Limited), అక్టోబర్ 2025లో మరొకసారి తన ఆధిపత్యాన్ని నిరూపించింది. ఈ నెలలో కంపెనీ అద్భుతమైన అమ్మకాల గణాంకాలను నమోదు చేస్తూ మళ్లీ మార్కెట్‌లో దూసుకుపోయింది. మొత్తం 2,20,894 యూనిట్లను విక్రయించిన మారుతి సుజుకి, దేశీయ మార్కెట్‌లోనే కాకుండా ఎగుమతుల్లో కూడా బలమైన పనితీరును కనబరిచింది. గత ఏడాది అదే నెలలో, అంటే అక్టోబర్ 2024లో, పండుగ సీజన్ కారణంగా 2,06,434 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈసారి ఆ గణాంకాన్ని అధిగమిస్తూ కంపెనీ 7 శాతం వృద్ధిని సాధించడం విశేషం. దీని ద్వారా మారుతి సుజుకి బ్రాండ్‌పై వినియోగదారుల నమ్మకం ఎంతగానో పెరిగిందని మరోసారి తేలింది.

2025 అక్టోబర్ నెలలో జరిగిన దీపావళి, ఇతర పండుగల సీజన్ మారుతి సుజుకి అమ్మకాలకు ప్రధాన బలం అయ్యింది. బ్రెజా, స్విఫ్ట్, డిజైర్, బాలెనో వంటి మోడళ్లు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ను కొనసాగించాయి. ముఖ్యంగా కొత్త SUV మోడల్ విక్టోరిస్‌కు వచ్చిన విపరీతమైన స్పందన కంపెనీకి మరింత ఊపిరి నింపింది. ఇటీవల కాలంలో భారత వినియోగదారులు SUVలు, కాంపాక్ట్ కార్లను ఎక్కువగా కోరుకుంటున్నారు.

Maruti Suzuki October 2025 Sales 7 Percent Growth Compared To Previous

ఈ మార్పు ధోరణిని గమనించిన మారుతి, తన లైనప్‌ను ఆధునికతతో అప్‌డేట్ చేస్తూ కొత్త ఫీచర్లు, ఫ్యూయల్ ఎఫిషెన్సీ, భద్రతా ప్రమాణాలతో కార్లను అందిస్తోంది. అందువల్లే కంపెనీ అమ్మకాలు సుస్థిరంగా పెరుగుతున్నాయి. దసరా, దీపావళి వంటి పండుగ సీజన్‌లో వాహనాల కొనుగోలు శుభప్రారంభంగా భావించే భారతీయ వినియోగదారులు, ఈసారి కూడా కొత్త కార్లను కొనుగోలు చేయడంలో ఆసక్తి చూపారు.

అయితే ఈసారి అమ్మకాలు పెరగడానికి మరో ప్రధాన కారణం కూడా ఉంది, అదే GST 2.0 పన్ను రేట్లలో సవరణలు. ఇటీవల అమల్లోకి వచ్చిన మార్పులు పలు మోడళ్ల ధరలను గణనీయంగా తగ్గించాయి, దాంతో వినియోగదారులు మరింత ఉత్సాహంగా కార్ల కొనుగోలుకు ముందుకు వచ్చారు. ఈ సానుకూల పరిస్థితుల్లో మారుతి సుజుకి అక్టోబర్ 2025లో మొత్తం 2,20,894 కార్లను విక్రయించింది. ఇందులో దేశీయ, ఎగుమతి గణాంకాలు రెండూ కలిపి ఉన్నాయి.

Maruti Suzuki October 2025 Sales 7 Percent Growth Compared To Previous

వీటిలో 31,304 యూనిట్లు విదేశాలకు ఎగుమతి చేయబడ్డాయి, ఇది కంపెనీ గ్లోబల్ ప్రెజెన్స్‌ను మరింత బలపరచింది. మిగిలిన 1,76,318 యూనిట్లు దేశీయ మార్కెట్‌లోనే అమ్ముడయ్యాయి, ఇది గత ఏడాది అక్టోబర్ నెలలో నమోదైన 1,59,591 యూనిట్లతో పోలిస్తే 10.48 శాతం వృద్ధిగా నమోదైంది. ఈ వృద్ధి గణాంకాలు మారుతి కోసం ఒక పెద్ద మైలురాయిగా నిలిచాయి. ఏప్రిల్ నుండి అక్టోబర్ వరకు కూడా కంపెనీ మంచి అమ్మకాలను నమోదు చేసింది.

ఈ ఏడాది ఏప్రిల్ నుండి అక్టోబర్ వరకు కంపెనీ భారతీయ మార్కెట్‌లో మొత్తం 9,71,764 కార్లను విక్రయించింది. దేశీయ మార్కెట్‌లో మారుతి సుజుకి ఆధిపత్యాన్ని మరోసారి రుజువు చేసింది. దేశీయ అమ్మకాలతో పాటు, కంపెనీ ఎగుమతుల రంగంలో కూడా బలమైన ప్రదర్శన కనబరిచింది. 2.38 లక్షలకుపైగా యూనిట్లు విదేశీ మార్కెట్లకు పంపించబడ్డాయి, ఇది భారతీయ వాహన బ్రాండ్‌గా మారుతి సుజుకి గ్లోబల్ స్థాయిలో ఎంత బలంగా ఎదుగుతోందో చూపిస్తోంది.

Maruti Suzuki October 2025 Sales 7 Percent Growth Compared To Previous

మొత్తం మీద, ఈ ఏడాది మొదటి ఏడు నెలల్లో అంటే ఏప్రిల్ నుండి అక్టోబర్ 2025 వరకు కంపెనీ 12,11,527 యూనిట్లను విక్రయించింది. ఈ గణాంకం గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో నమోదైన 11,85,649 యూనిట్లతో పోలిస్తే స్వల్ప వృద్ధిని సూచిస్తుంది. మొత్తం మీద, మారుతి సుజుకి ఈ ఏడాది కూడా స్థిరమైన పనితీరును కొనసాగిస్తూ, భారత ఆటోమొబైల్ రంగానికి దిశానిర్దేశం చేస్తూనే ఉంది.

More from DriveSpark

Article Published On: Monday, November 3, 2025, 12:38 [IST]
English summary
Maruti suzuki october 2025 sales 7 percent growth compared to previous
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+