ఈ కారును ఇష్టపడని వారు ఎవరు ఉండరు.. ఫ్యామిలీకి బెస్ట్.. గత ఏడాది 1.90 లక్షల మంది సొంతం చేసుకున్నారు
మారుతీ సుజుకీ (Maruti Suzuki) భారతదేశంలో అత్యధికంగా కార్ల విక్రయాలను సాధిస్తున్న కంపెనీగా ఉంది. ప్రతి ఏడాది ఇతర కంపెనీల కంటే ఎక్కువగా సేల్స్‌ను నమోదు చేస్తూ దేశీయ దిగ్గజ వాహనాల తయారీ సంస్థగా తక్కువ ధరలో, ఎక్కువ మైలేజ్ అందించే కార్లను విడుదల చేస్తుంది. ప్రతి ఏడాది లాగే 2024లో కూడా మారుతీ అమ్మకాలు మెరుగ్గా ఉన్నాయి. టాటా మోటార్స్, హ్యూందాయ్, మహీంద్రా వంటి కంపెనీల కంటే 2024లో ఏడాదిలో అత్యధికంగా సేల్స్‌ను నమోదు చేసిన కంపెనీగా అగ్రస్థానంలో నిలిచింది. దాదాపు 17 లక్షలకు పైగా మారుతీ కార్లు గత సంవత్సరం అమ్ముడుపోయాయి. ఇదిలా ఉంటే భారత్‌లో సాధారణంగా ఎస్‌యూవీ (SUV)లకు మంచి డిమాండ్ ఉంటుంది. ఇలాంటి తరుణంలో వీటికి పోటీగా కొన్ని హ్యాచ్‌బ్యాక్‌లు సైతం మెరుగైన సేల్స్‌ను సాధిస్తున్నాయి.
ఈ క్రమంలో మారుతీ సుజుకీకి చెందిన ప్రముఖ మోడల్ వ్యాగన్ఆర్(wagonr) గత ఏడాది మంచి అమ్మకాలను నమోదు చేసింది. తాజాగా విడుదల అయిన గణంకాల ప్రకారం, వ్యాగన్ఆర్ హ్యాచ్‌బ్యాక్ 2024లో దాదాపు 1,90,855 యూనిట్ల సేల్స్‌ను సాధించింది. కంపెనీ మొత్తం కార్ల అమ్మకాలలో అత్యంత డిమాండ్ ఉన్న మోడల్‌గా వ్యాగన్ఆర్ నిలిచింది. దీంతో పాటు స్విఫ్ట్, బాలెనో వంటి మోడల్స్‌ను కూడా గత ఏడాది ఎక్కువ మంది కొనుగోలు చేశారు.

SUVలకు మంచి ఆదరణ ఉన్న కాలంలో కూడా ఇలాంటి హ్యాచ్‌బ్యాక్‌లను కూడా చాలా మంది కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తుండటంతో మారుతీ సుజుకీ కంపెనీ తన హ్యాచ్‌బ్యాక్ మోడళ్ల అమ్మకాలను నిలిపివేయడం లేదు. ఒకవైపు ఎస్‌యూవీ, ఎంపీవీ విభాగాల్లో తన సత్తాను చాటుతూనే చిన్న ఫ్యామిలీకి ఉపయోగకరంగా తక్కువ ధరలో హ్యాచ్‌బ్యాక్‌లను తీసుకొస్తూ, ఈ సెగ్మెంట్‌లో కూడా అమ్మకాలను గణనీయంగా పెంచుకోవాలని ప్రయత్నాలు చేస్తుంది.
2024 డిసెంబర్ నెలలో వ్యాగన్ఆర్ 29,566 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. దీనికి ముందు మారుతీ స్విఫ్ట్ 29,765 యూనిట్లను విక్రయించగా, మరో డిమండ్ ఉన్న మోడల్ బాలెనో 26,789 యూనిట్ల సేల్స్‌ను సాధించింది. వ్యాగన్ఆర్ విషయానికి వస్తే, దీన్ని భారత్‌లో చిన్న కుటుంబం గల వారి కోసం మొదటి సారిగా ఇండియాలో 1999 డిసెంబర్‌లో లాంచ్ చేశారు.ఇది 25 ఏళ్ల నుంచి సరికొత్త ఫీచర్లతో అప్‌డేట్ అవుతూనే ఉంది.

చిన్న ఫ్యామిలీ వినియోగదారులు ఇది అత్యుత్తమమైన ఎంపిక. దాదాపు 2024 ఏడాదిలో ప్రతినెలా కూడా పదివేల మంది ఈ కారును కొనుగోలు చేశారు. ఈ గణంకాలను చూసినట్లయితే ఇండియా ఫ్యామిలీ కస్టమర్లలో వ్యాగన్ఆర్ కారుకు డిమాండ్ తగ్గలేదని తెలుస్తుంది. కంపెనీ ఇటీవల దీనిలో వాల్ట్జ్ ఎడిషన్ అనే ప్రత్యేక వేరియంట్‌ను తీసుకొచ్చింది. వ్యాగన్ఆర్ 1.0-లీటర్, .2-లీటర్ K-సిరీస్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది.
ఇది cng ఇంజిన్ ఆప్షన్‌లో కూడా అందుబాటులో ఉంది. మైలేజ్ విషయానికి వస్తే, కిలో cng ఇంధనానికి 33.48 కి.మీల మైలేజ్ వస్తుంది. అదే పెట్రోల్ ఇంజిన్‌లో అయితే లీటర్‌కు 25.19 కిమీల వరకు దూరం ప్రయాణిస్తుంది. దేశీయ మార్కెట్లో ఈ హ్యాచ్‌బ్యాక్ ప్రారంభ ధర రూ.5.55 లక్షలుగా ఉంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








