ఆ కారు అమ్మకాల్లో మారుతి సుజుకి చెత్త రికార్డు.. దేశవ్యాప్తంగా ఒకనెలలో 8 మందే ఈ కారుని కొన్నారు!

మారుతి సుజుకి.. భారత ఆటో మొబైల్ ఇండస్ట్రీలో ఈ పేరు ప్రత్యేకం. దేశవాసులకు ఎన్నో ఏళ్లుగా సుపరిచితమైన బ్రాండ్. ప్రత్యర్థి సంస్థలకు గట్టిపోటీనిస్తూ మార్కెట్లో టాప్‌లో కొనసాగుతున్న కంపెనీ. అయితే.. ఈ కంపెనీ ఇప్పుడు ఓ కారు కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ కారు ధర అత్యంత తక్కువ ధరలో ఉన్నప్పటికీ.. దీన్ని కొనుగోలు చేసేందుకు వినియోగదారులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అదే మారుతి సుజుకి ఎస్- ప్రెస్సో మోడల్. గతేడాది డిసెంబరు నెలలో ఈ కారు అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. ఈ కారు ఎందుకు వినియోగదారులను ఆకట్టుకోలేకపోతోంది? ఇప్పటివరకు దీని అమ్మకాలు ఎలా సాగాయి? దీంట్లో ఉన్న ప్రధాన లోపాలేంటో ఇప్పుడు చూద్దాం.

2024 డిసెంబరు నెలకు సంబంధించి మారుతి సుజుకి ఎస్- ప్రెస్సో కారు అమ్మకాల రిపోర్ట్‌ను రిలీజ్ చేసింది మారుతి సంస్థ. ఈ నివేదిక ప్రకారం.. డిసెంబరు నెలలో 8 కార్లను మాత్రమే ఈ సంస్థ విక్రయించింది. అవును.. మీరు చదివింది నిజమే! ఈ నెలలో 8 మంది వినియోగదారులే దీన్ని కొనుగోలు చేశారు.

Maruti Suzuki S Presso December 2024 Sales Report

మరో విషయం ఏంటంటే.. ఈ కారు అమ్మకాల్లో 87శాతం డ్రాప్ కనిపించింది. 2023 డిసెంబరు నెలలో ఈ ఎస్- ప్రెస్సో 60 కార్లను మారుతి సుజుకి సంస్థ విక్రయించింది. 2024 డిసెంబరులో మాత్రం ఈ సంఖ్య 8కి పడిపోయింది. ఇది 87శాతానికి సమానం. దీంతో కంపెనీకి సేల్స్‌లో పెద్ద దెబ్బ పడింది. మిగతా కార్లతో పోలిస్తే ఇది చాలా తక్కువ.

మారుతి సుజుకి అత్యంత అందుబాటు ధరలో ఉండే కారు అని చెప్పవచ్చు. దీని ప్రారంభ ధర రూ.4.26 లక్షలుగా ఉంది. అదే సమయంలో దీంట్లోని టాప్ వేరియంట్ ధర రూ.6.11 లక్షలుగా ఉంది. ఎస్- ప్రెస్సో లో సీఎన్‌జీ వేరియంట్ కారు.. ఏకంగా 32.73 km per kg మైలేజీ అందిస్తుంది. ఈ కారు ధర ఇంత తక్కువగా ‌ఉన్నప్పటికీ.. వినియోగదారుల నుంచి రోజురోజుకు స్పందన కరవు అవుతుండడం గమనార్హం.

Maruti Suzuki S Presso December 2024 Sales Report

డ్రైవ్‌స్పార్క్ వ్యాఖ్య: మారుతి సుజుకి ఎస్- ప్రెస్సో మోడల్... ఈ సంస్థ నుంచి వచ్చిన ఒక 'ఫ్లాప్' కారు అని చెప్పవచ్చు. ఎందుకంటే.. గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టులో ఈ కారు ఘోరంగా విఫలమైంది. ఇదే ఈ కారు ఫెయిల్యూర్‌గా ముద్రపడడానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు.

చైల్డ్ సేఫ్టీ విషయంలో ఈ కారు.. జీరో స్టార్ రేటింగ్ సాధించిన కారణంగా చాలా మంది వినియోగదారులు దీన్ని ఇష్టపడడం లేదు. దీని డిజైన్ కూడా చాలా మంది వినియోగదారులకు నచ్చకపోవడం కూడా దీని సేల్స్‌ను మరింత దిగజారేలా చేసిందని చెప్పవచ్చు.

Maruti Suzuki S Presso Sales

ఈ కారణాల రీత్యా భవిష్యత్తులో మారుతి సుజుకి సంస్థ ఈ ఎస్- ప్రెస్సో కారు తయారీని పూర్తిగా నిలిపివేసే అవకాశం కనిపిస్తోంది. మారుతి సుజుకి దేశంలో టాప్ వాహన తయారీ సంస్థ అయినప్పటికీ.. ఈ సంస్థ నుంచి కూడా కొన్ని ఫెయిల్యూర్ మోడల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ జాబితాలో ఎస్- ప్రెస్సో చేరింది.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Monday, January 20, 2025, 19:08 [IST]
English summary
Maruti suzuki s presso december 2024 sales dropped 87 percent check full sales report here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+