రూ.4.27 లక్షలకే 33 కి.మీ మైలేజ్ ఇచ్చే ఈ కారును కొని ఇంట్లో పార్క్ చేసుకోండి! ఏప్రిల్‌తో పోలిస్తే డబుల్ సేల్స్

భారత మార్కెట్లో అత్యంత తక్కువ ధరలో లభించే కార్లలో మారుతీ సుజుకీ ఎస్-ప్రెస్సో (Maruti Suzuki S-Presso) ఒకటి. బడ్జెట్‌ కారు కోసం చూస్తున్న వారికి ఇది మంచి ఎంపికగా నిలుస్తోంది. చిన్నదైనా స్టైల్‌లో పెద్దదిగా కనిపించే ఈ హ్యాచ్‌బ్యాక్, అందుబాటు ధరతో పాటు మంచి మైలేజీను కూడా అందిస్తోంది. ఇది అనేక మంది మధ్య తరగతి వినియోగదారులకు సౌకర్యవంతమైన కారు. ఇటీవల విడుదలైన అమ్మకాల నివేదిక ద్వారా, ఎస్-ప్రెస్సో పట్ల వినియోగదారుల స్పందన ఎలా మారుతోంది అన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఈ నివేదిక ప్రకారం, మే 2025లో మొత్తం 1,806 యూనిట్లు అమ్ముడవడం గమనార్హం. అయితే, ఇదే మోడల్ గత ఏడాది మే నెలలో 2,227 యూనిట్లను విక్రయించగా, ఈ సంవత్సరం అదే నెలలో అమ్మకాలు సుమారు 19 శాతం తగ్గినట్లు స్పష్టమవుతోంది.

అయితే, ఈ డేటాను మరో కోణంలో చూస్తే, ఇది పూర్తిగా నెగటివ్ దిశలో ఉందని మాత్రం చెప్పలేం. ఎందుకంటే ఏప్రిల్ 2025లో ఎస్-ప్రెస్సో కేవలం 726 యూనిట్లను మాత్రమే విక్రయించింది. ఆ లెక్కన మే నెలలో నమోదైన 1,806 యూనిట్ల విక్రయాలు ఏప్రిల్‌తో పోలిస్తే దాదాపు 59.80 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఈ స్థాయిలో అమ్మకాలు పెరగడం మారుతీ సుజుకీ సంస్థకు కొంత ఉత్సాహాన్ని కలిగించే విషయమే.

S Presso Hatchback 1806 Sales

బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్ విభాగంలో పోటీ ఎక్కువగా ఉన్నా, ఎస్-ప్రెస్సో మళ్లీ పుంజుకోవడంలో ఇది సానుకూల సంకేతంగా చెప్పవచ్చు. వినియోగదారుల నమ్మకాన్ని తిరిగి గెలుచుకోవడంలో, మే నెలలో నమోదైన ఈ అమ్మకాలు ముఖ్యపాత్ర పోషించాయి. మొత్తానికి, గత సంవత్సరం మే నెలతో పోలిస్తే తగ్గుదల కనిపించినా, తక్కువ వ్యవధిలోనే రికవరీ దశలో ఉన్నట్లు ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. ఈ కారు ధర, ఇతర వివరాలను ఒకసారి ఈ కింది కథనంలో తెలుసుకుందాం.

మారుతీ సుజుకీ ఎస్-ప్రెస్సో ఎంట్రీ లెవల్ వేరియంట్ ధర రూ.4.27 లక్షలు ఉండగా, టాప్ వేరియంట్ ధర రూ.6.12 లక్షల వరకు ఉంటుంది. ఈ ధరలు ఎక్స్-షోరూమ్. ఇది అనేక మంది మధ్య తరగతి వినియోగదారులకు సౌకర్యవంతమైన ఆప్షన్‌గా మారుతోంది. మైలేజీ పరంగా చూస్తే, ఎస్-ప్రెస్సో ముందు వరుసలో నిలబడుతుంది. ఇందులోని Std (O), LXi (O) వంటి బేసిక్ పెట్రోల్ వేరియంట్లు 24.12 కిలోమీటర్ల మైలేజీని ఇవ్వగలవు.

Maruti Suzuki S Presso Hatchback 1806 Sales Reported

ఇక VXi (O), VXi+ (O) వేరియంట్లు ఇంకా మెరుగైన 24.76 కిమీ/లీ మైలేజీని అందిస్తాయి. ఆటో గేర్ షిఫ్ట్(AGS) వేరియంట్లైన VXi (O) AGS, VXi+ (O)AGS అయితే 25.30 కిలోమీటర్ల మైలేజీ ఇస్తాయి. మైలేజీ కింగ్‌గా నిలుస్తున్న CNG వేరియంట్లు LXI (O), VXI (O) ఇంకా ఎక్కువ మైలేజీని అందించగలవు. CNG వేరియంట్లు కిలో ఇంధనానికి దాదాపు 32.73 కి.మీల ARAI సర్టిఫైడ్ మైలేజ్‌ను అందిస్తాయి.

భద్రతా అంశాలను చూసినట్లయితే, ఈ కారులో కూడా మరిన్ని లేటెస్ట్ సేఫ్టీ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. డ్యూయల్ ఎయిర్‌బ్యాగులు, EBD తో కూడిన ABS, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు వంటి ఫీచర్లు ప్రయాణాన్ని మరింత సురక్షితంగా మార్చుతాయి. ఇది నగర ప్రయాణాలకు అనుకూలంగా ఉంటాయి. మారుతీ ఎస్-ప్రెస్సో పొడవు 3,565 మిల్లీమీటర్లు, వెడల్పు 1,520 మిల్లీమీటర్లు, ఎత్తు 1,553 మిల్లీమీటర్లు ఉంటుంది. వీటితో పాటు, వీల్‌బేస్ 2,380 మిల్లీమీటర్లు ఉంది.

Maruti Suzuki S Presso

ఈ చిన్న హ్యాచ్‌బ్యాక్ వినియోగదారులకు తక్కువ ధరలో ఎక్కువ విలువను అందించే ప్రయత్నం చేస్తోంది. ఎక్కువ మైలేజ్, తక్కువ నిర్వహణ ఖర్చులు, సురక్షిత ఫీచర్లు, నగర ప్రయాణాలకు అనువైన పనితీరు అన్నింటినీ కలిగి ఉన్న ఎస్-ప్రెస్సో, ఒక బెస్ట్ ఎంపికగా నిలుస్తోంది. ఇది భారతీయ మార్కెట్లో రెనాల్ట్ క్విడ్, టాటా టియాగో వంటి కార్లకు ప్రత్యమ్నాయంగా నిలుస్తుంది.

More from DriveSpark

Article Published On: Friday, June 13, 2025, 12:50 [IST]
English summary
Maruti suzuki s presso hatchback 1806 sales reported in may 2025 more details
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+