బైక్ ధరకే కారు! కేవలం రూ.3.50 లక్షలు, 33 కి.మీ మైలేజ్.. కళ్లు మూసుకుని కొనేయొచ్చు!

మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో (Maruti Suzuki S-presso) భారతీయ మార్కెట్లో ఒక ప్రధాన ఎంట్రీ-లెవల్ కారు. ఇది తక్కువ బడ్జెట్‌లో కుటుంబాల కోసం రూపొందించబడింది, అందుకే ఈ కారు సాధారణ వినియోగదారుల కోసం అత్యంత ఆకర్షణీయంగా మారింది. పేద వర్గం నుండి మధ్యతరగతి వర్గం వరకు ఉన్న కుటుంబాలు తమ అవసరాలను, బడ్జెట్ పరిమాణాలను దృష్టిలో పెట్టుకొని ఈ కారును కొనుగోలు చేస్తున్నారు. నగరాల్లో రోజు ప్రయాణానికి అనువుగా ఉండటం, పార్కింగ్ సులభంగా చేయగలిగే సైజు, అలాగే తక్కువ నిర్వహణ ఖర్చులు.. ఈ కారును మరింత వినియోగదారులకు నమ్మకమైన ఎంపికగా నిలిపాయి. పైగా ఒక ప్రీమియం బైక్ ధరలోనే దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఎస్-ప్రెస్సో గురించిన ఇతర పూర్తి వివరాలు ఈ కింది కథనంలో చూద్దాం.

మారుతి సుజుకి ఎస్-ప్రెస్సోని వేర్వేరు వేరియంట్లలో మార్కెట్లో అందుబాటులో ఉంచడం, వినియోగదారులకు సులభంగా ఎంపిక చేసుకునే అవకాశం ఇస్తోంది. వేరియంట్ ఆధారంగా దీని ధర రూ. 3.50 లక్షల నుండి రూ. 5.25 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది, కాబట్టి పేద, మధ్యతరగతి వర్గాలకు కూడా ఈ కారు సులభంగా అందుబాటులో ఉంటుంది. ఇది స్టాండర్డ్, LXI, VXI, VXI ప్లస్ అనే నాలుగు వేరియంట్లలో కొనుగోలుకు లభిస్తుంది.

Maruti Suzuki S-presso Hatchback Price Engine Mileage

ప్రతి వేరియంట్ ప్రత్యేక ఫీచర్లు, సౌకర్యాలు, డిజైన్ నాణ్యతలో తేడాతో వస్తుంది, తద్వారా వినియోగదారులు తమ అవసరాలకు అనుగుణంగా సరిపడే మోడల్ ఎంచుకోవచ్చు. మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో ఇంజిన్ ఎంపికల విషయంలో వినియోగదారులకు రెండు ముఖ్య అవకాశాలను అందిస్తుంది. మొదటిది 1-లీటర్ పెట్రోల్, 1-లీటర్ పెట్రోల్ + CNG ఇంజిన్‌లు. ఈ ఫ్లెక్సిబుల్ ఇంధన ఎంపికలు వినియోగదారుల బడ్జెట్, ప్రయాణ అవసరాలకు అనుగుణంగా ఉంటాయి.

పెట్రోల్ వేరియంట్లు 24.12 నుండి 25.30 kmpl వరకు మైలేజీ ఇవ్వడం, నగరంలో రోజువారీ డైలీ రైడ్ చేసే వారికి బెస్ట్. అదే సెగ్మెంట్‌లోని మరే ఇతర హ్యాచ్‌బ్యాక్ కారు కూడా ఇంత మైలేజ్ ఇవ్వదు. మరింత మైలేజ్ కావాలనుకునే వారికి Cng ఆప్షన్ బాగా అనుకూలంగా ఉంటుంది. CNG వేరియంట్లు 32.73 kmpl మైలేజీని అందిస్తాయి. ఈ రకమైన అధిక మైలేజీ వల్ల ఇంధన ఖర్చు చాలా తగ్గిపోతుంది.

Maruti Suzuki S-presso Hatchback Price Engine Mileage

మారుతి సుజుకి ఎస్-ప్రెస్సోలో ఫీచర్ల పరంగా వినియోగదారులకు పూర్తి సౌకర్యం, భద్రతా ఫీచర్లు ఒకే చోట ఉన్నాయి. కారు లోపల 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉండటం ద్వారా ఆడియో, నావిగేషన్, కనెక్టివిటీ ఫీచర్లను సులభంగా కంట్రోల్ చేయవచ్చు. అదనంగా, సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ స్పష్టమైన డిస్ప్లేతో వేగం, ఫ్యూయల్ స్థాయి, ట్రిప్ మానిటరింగ్ వంటి సమాచారాన్ని అందిస్తుంది.

కారులో ఎయిర్ కండిషనింగ్, పవర్ విండోస్, USB కనెక్టివిటీ, కీలెస్ ఎంట్రీ వంటి ఫీచర్లు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా, మారుస్తాయి. చిన్న కుటుంబాలు, యువ రైడర్లు వీటిని ప్రత్యేకంగా ఆస్వాదిస్తారు. భద్రతా అంశాలను కూడా పక్కన పెట్టడం లేదు. ఈ కారు డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బాగులు, ABS (యాంటీ-లాక్ బ్రేక్ సిస్టమ్), EBD (ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), ESP (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్) వంటి అత్యాధునిక భద్రతా ఫీచర్లను అందిస్తుంది.

Maruti Suzuki S-presso Hatchback Price Engine Mileage

అదనంగా, సెంట్రల్ లాకింగ్, రియర్ పార్కింగ్ సెన్సార్లు కూడా ఉండటం వల్ల నగరంలోని పార్కింగ్ సమస్యలు తక్కువగా ఉంటాయి. గత నెల అమ్మకాలను ఒకసారి చూసినట్లయితే, దాదాపు 2,857 యూనిట్లు వినియోగదారులకు డెలివరీ చేయబడ్డాయి. 2024 ఇదే కాలంలో, 2,139 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ సంఖ్యను పోల్చినప్పుడు, అమ్మకాలు శాతం పరంగా 33.57% పెరిగింది.

More from DriveSpark

Article Published On: Sunday, November 30, 2025, 7:22 [IST]
English summary
Maruti suzuki s presso hatchback price engine mileage and top things
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+