రూ 4.26 లక్షలకే 33 కి.మీల మైలేజీ ఇచ్చే ఈ మారుతి సుజుకి కారు చాలా ఫేమస్.. గత నెల సేల్స్‌లో రివర్స్ గేర్!
తక్కువ ధరలో దొరికే కార్లను కొనేందుకు గతంలో ఎక్కువమంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండేవారు. అయితే ప్రస్తుతం భారత మార్కెట్లో.. చాలా కార్లు ఖరీదైనవే ఉంటున్నాయి. రూ 10 లక్షల కంటే తక్కువగా ఉండే కార్లు దొరకడం ప్రస్తుతం అరుదుగా ఉన్నాయని మాత్రమే చెప్పవచ్చు. దీంతో అందరూ ఖరీదైన కార్ల పైనే దృష్టి పెడుతుండగా తక్కువ ధరలో దొరికే కార్లకు డిమాండ్ తగ్గిపోయింది. దీనిపై దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ మారుతి సుజుకి గతంలో తమ ఆందోళన వ్యక్తం చేసింది. ఎందుకంటే.. తక్కువ ధరలో లభించే తమ మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో కారు సేల్స్.. దీనివల్ల బాగా దెబ్బతిన్నాయి. ఈ 2025 జనవరి నెలలో ఈ అమ్మకాలు మరింతగా పడిపోయాయి.
మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో కారు ఒక హ్యాచ్‌బ్యాక్. అయితే ఎస్‌యూవీలను దృష్టిలో ఉంచుకొని దీన్ని డిజైన్ చేశారు. చూసేందుకు ఇది ఒక మినీ ఎస్‌యూవీగా కనిపిస్తుంది. అయినప్పటికీ ఈ కారు అమ్మకాల్లో ఆశించినంత స్థాయిని అందుకోలేకపోయింది. అయితే ఈ కార్ ఫెయిల్యూర్‌కి ప్రధాన కారణం.. తక్కువ ధరలో లభించే కార్లపై వినియోగదారులు ఆసక్తి చూపకపోవడమే అని చెప్పలేము. దీనికి మరికొన్ని కారణాలు కూడా తోడయ్యాయి.

అందులో ఈ కారు క్రాష్ టెస్టులో ఫెయిల్ అవ్వడం కూడా ఒకటి. 2019లో ఈ కారు తొలిసారి లాంచ్ అయింది. అయితే ముందు చెప్పుకున్నట్లుగానే మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో కారు అనుకున్నంత స్థాయిలో సెల్స్‌లో రాణించలేకపోయింది. దాంతో ఈ కారును ఆపేస్తారేమోనని అందరూ అనుకున్నారు. కానీ మారుతి సుజుకి సంస్థ ఈ ఎస్-ప్రెస్సో కారు అమ్మకాలను భారత మార్కెట్లో ఇంకా కొనసాగిస్తూనే ఉంది.
అయినప్పటికీ ఈ కారు అమ్మకాల సంఖ్య పెరగడం లేదు. ఈ 2025 జనవరి నెలలోనూ ఈ కారు సేల్స్‌లో బోల్తా పడిందనే చెప్పాలి. ఇటీవల విడుదలైన సేల్స్ రిపోర్టులో ఈ విషయం వెల్లడైంది. ఈ జనవరి నెలలో మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో కారు అమ్మకాలు 2,895 యూనిట్లుగా మాత్రమే నమోదు అయ్యాయి. అంతకుముందు ఏడాది 2024 జనవరి నెలలో ఈ సంఖ్య 3,454గా ఉంది.

గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం.. సేల్స్ 16 శాతం పడిపోయిందని చెప్పవచ్చు. మారుతి సుజుకి ఈ ఎస్-ప్రెస్సో కారు రూ. 4.26 లక్షల కే అందుబాటులో ఉంది. దీంట్లోని ఎంట్రీ లెవెల్ వేరియంట్ ఈ ధరలో లభిస్తుంది. ఇక దీంట్లోనే టాప్ పేరెంట్ ధర కేవలం రూ.6.11 లక్షలు మాత్రమే. ఇవి ఎక్స్- షోరూం ధరలు.
ఇది సరసమైన ధరలో లభించే కారు మాత్రమే కాకుండా మంచి మైలేజ్ కూడా అందించే కారు. ఇందులోని CNG వేరియంట్ కారు.. 32.73 km/kg మైలేజీ అందిస్తుంది. అయినప్పటికీ ఈ కారు అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉండడం.. మారుతి సుజుకి సంస్థకు కలవరపెట్టే అంశంగా చెప్పవచ్చు. ఇకపై సేల్స్‌లో ఏమేరకు రాణిస్తుందో చూడాలి.
డ్రైవ్‌స్పార్క్ వ్యాఖ్య: మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో కారు పరిస్థితి ప్రస్తుతం ICU లో ఉన్న పేషెంట్ తరహాలో ఉంది. కొత్త డిజైన్, కొత్త స్టేట్-ఆఫ్-ద-ఆర్ట్, సేఫ్టీ ఫీచర్లు వంటి వాటి వల్ల ఎస్-ప్రెస్సో ఇప్పటికీ ఫేవరేట్‌గా ఉంది. ఓ మంచి హ్యాచ్‌బ్యాక్ కోసం చూస్తున్నట్లైతే ఇది మీకు సరిపోతుంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








