కేవలం రూ.4.5 లక్షలకే బైక్ మైలేజ్ ఇచ్చే కారు.. అయినా ఎవ్వరూ కొనలేదు! ఎందుకంటే..?
భారతదేశంలో మారుతీ సుజుకీ బ్రాండ్ అంటేనే చాలా మందికి పేదల బడ్జెట్‌కు అనుగుణంగా తక్కువ ధరలో కార్లను విడుదల చేసే తయారీ కంపెనీగా పేరుంది. అనుకూలమైన ధర, నిర్వహణ ఖర్చులు తక్కువ స్థాయిలో ఉండటం, ఎక్కువ మైలేజ్ ఇవ్వడం వల్ల మారుతీ సుజుకీ కార్లను జనాలు సాధారణంగా ఎగబడి మరి కొంటున్నారు. ఇటీవల మార్చి నెల ముగిసిన నేపథ్యంలో కంపెనీ తన సేల్స్ వివరాలను విడుదల చేస్తుంది. ఈ క్రమంలో ఎస్-ప్రెస్సో (S-Presso)కు సంబంధించిన అమ్మకాల గణంకాలను వెల్లడించింది. ఈ కారు వినియోగదారులను ఆకర్షించడంలో చాలా ఇబ్బంది పడుతుంది. బలమైన పోటీ నేపథ్యంలో ఎస్-ప్రెస్సో ఆశించిన స్థాయిలో నిలబడలేకపోయింది.
ఎస్-ప్రెస్సో, ప్రారంభంలో "మినీ SUV"గా మార్కెట్లోకి ప్రవేశించి వినియోగదారులను ఆకట్టుకోగా క్రమంగా దాని పట్ల ఆకర్షణ తగ్గుతూ వచ్చింది. ఇటీవల అమ్మకాల గణాంకాలు ఈ పరిస్థితిని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. 2025 మార్చి నెలలో మారుతీ సుజుకీ కేవలం 1,788 ఎస్-ప్రెస్సో యూనిట్లను మాత్రమే విక్రయించింది. ఇది 2024 మార్చిలో నమోదైన 2,497 యూనిట్లతో పోలిస్తే దాదాపుగా 28 శాతం తగ్గుదల. ఇది సాధారణంగా మార్కెట్లో బలమైన పోటీ ఉన్నప్పుడు జరుగుతుంది.

వినియోగదారులు కార్ల ఎంపిక విషయంలో తమ ఇష్టాలను కూడా మార్చుకుంటున్నారు. అందుకే మంచి మైలేజ్, తక్కువ ధరలో లభించే కారుకు ఆదరణ తగ్గుతుంది. చాలా మంది కొనుగోలుదారులు ఇప్పుడు కేవలం ధర మాత్రమే కాకుండా, తమ కుటుంబ భద్రతకు పెద్ద ప్రాధాన్యత ఇస్తున్నారు. NCAP వంటి సంస్థల నుండి వచ్చిన భద్రతా రేటింగ్స్ కూడా వినియోగదారుల అభిప్రాయాలను ప్రభావితం చేసిన అంశాలుగా ఉంటున్నాయి. అందుకే ఇది తక్కువగా సేల్ అయింది.
ఈ కారు ప్రధానంగా చిన్న కుటుంబాలకు, మొదటి సారి కారు కొనుగోలు చేయాలనుకునే వారికి అనుకూలంగా రూపొందించబడింది. ధర పరంగా చూసినా, మైలేజ్ పరంగా చూసినా ఇది బెస్ట్ ఆప్షన్‌గా కనిపిస్తుంది. అయినప్పటికి ఈ కారుకు ప్రజల నుంచి ఆదరణ తగ్గుతూ వస్తుంది. ప్రస్తుతం ఎస్-ప్రెస్సో ఎంట్రీ-లెవల్ వేరియంట్ అయిన STD (O) వేరియంట్ ధర కేవలం రూ. 4.27 లక్షలుగా ఉంది (ఎక్స్-షోరూమ్ ధర).

ఇది మార్కెట్‌లో అందుబాటులో ఉన్న అత్యంత తక్కువ ధర కార్లలో ఒకటిగా నిలుస్తోంది. దీని టాప్ వేరియంట్ అయిన VXI (O) CNG ధర కూడా చాలా రూ. 6.12 లక్షల (ఎక్స్-షోరూమ్) వద్ద ఉంది. మైలేజ్ విషయానికొస్తే, ఎస్-ప్రెస్సో పెట్రోల్ వేరియంట్లు లీటరుకు 24.12 కి.మీల నుంచి 25.30 కి.మీల వరకు ఇస్తుంది. అదే CNG వేరియంట్లు అయితే కిలోకి 32.73 కి.మీ వరకు మైలేజ్ అందించడం విశేషం.
ఇది సాధారణంగా రోజువారీ వాడకంలో భాగంగా తక్కువ ఖర్చులో ప్రయాణించాలనుకునే వారికి బాగా ఉపయోగపడుతుంది. చిన్న కుటుంబాలు భారతదేశంలో ఎక్కువగా ఉంటున్నారు. అలాంటి వారు దీనిని కొనుగోలు చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీని సేల్స్ పెంచడానికి కంపెనీ ఇంజిన్ పనితీరు మాత్రమే కాకుండా, వినియోగదారుల నమ్మకాన్ని గెలుచుకునేలా డిజైన్, సౌకర్యాలు, ముఖ్యంగా సేఫ్టీపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








