బైకుకు బదులుగా ఈ కారును కొనడం బెస్ట్.. రూ.4 లక్షలకే 33 కి.మీ మైలేజ్.. ఐదు నెలల సేల్స్ ఎన్నంటే?
భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో గత కొన్నేళ్లుగా తక్కువ ధరలో లభించే అన్ని వర్గాల వారు కొనగలిగే కార్లకు డిమాండ్ తగ్గుతుంది. తాజాగా ఇటీవలి కాలంలో విడుదలవుతున్న అమ్మకాల గణంకాలను చూస్తే ఇదే అర్థం అవుతుంది. తాజాగా మారుతీ సుజుకీ తన సేల్స్ డేటాను వెల్లడించింది. దీని ప్రకారం, పేద, మధ్యతరగతి వారికి బాగా ఇష్టమైన ప్రసిద్ధ మోడల్ ఎస్-ప్రెస్సో (S-presso) ఒక ఉదాహరణగా నిలుస్తోంది. ఈ మోడల్‌ను తక్కువలో, సులభంగా అందుబాటులో ఉండే హ్యాచ్‌బ్యాక్‌గా భావిస్తారు. నిజానికి, తక్కువ ధరలో అందుబాటులో ఉన్న కార్ల జాబితా తయారు చేస్తే, ఎస్-ప్రెస్సో ఖచ్చితంగా ఆ జాబితాలో స్థానం సంపాదిస్తుంది. ఇంత తక్కువ బడ్జెట్‌లో సొంత కారు కొనాలనుకునేవారికి, ముఖ్యంగా కొత్తగా మొదటిసారి కారులోకి అడుగుపెడుతున్న వినియోగదారులకు, ఎస్-ప్రెస్సో సరైన ఆప్షన్ అవుతుంది.
తాజాగా విడుదలైన డేటా ప్రకారం, 2025 సంవత్సరం (జనవరి-మే) 2025 మొదటి 5 నెలల్లో, కేవలం 8,900 ఎస్-ప్రెస్సో కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి. నెలవారీగా చూసినట్లయితే జనవరి 2025లో 2,895 ఎస్-ప్రెస్సో కార్లు అమ్ముడయ్యాయి. ఫిబ్రవరిలో 1,685 యూనిట్లు, మార్చిలో 1,788, ఆ తర్వాతి ఏప్రిల్ నెలలో కేవలం 726 యూనిట్లు, దీని తర్వాత మే నెలలో 1,806 ఎస్-ప్రెస్సో కార్లు అమ్ముడయ్యాయి.

బేస్ వేరియంట్ ధర కేవలం రూ.4.26 లక్షలు(ఎక్స్-షోరూమ్)గా ఉండగా, టాప్ వేరియంట్ ధర కూడా కేవలం రూ.6.12 లక్షలకే పరిమితం అవుతోంది. ఇవన్నీ మారుతి సుజుకి అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొన్న వివరాలు. దీనిలో సింపుల్ డిజైన్, ఉపయోగకరమైన ఫీచర్లు, మారుతీ సుజుకీ బ్రాండ్ విశ్వసనీయత అన్నీ కలసి ఈ కారును మరింత ప్రాక్టికల్ ఆప్షన్‌గా తీర్చిదిద్దాయి. ఇది పలు రకాల వేరియంట్లలో అవసరాల మేరకు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.
ఎస్-ప్రెస్సోలో ఉన్న వేరియంట్లను పరిశీలిస్తే, Std (O), LXi (O) వేరియంట్లు లీటర్ పెట్రోల్‌కు 24.12 కి.మీ మైలేజీ అందిస్తాయి. ఇది రోజువారీ సిటీ డ్రైవ్‌కి సరిపడే స్థిరమైన ఎకానమీని అందిస్తుంది. అదే సమయంలో, వేరియంట్లు కొంచెం పైకి వెళ్లినప్పుడు ఇంకా మెరుగైన ఫ్యూయల్ ఎఫిషెన్సీ వస్తుంది. VXi (O), VXi+ (O) వేరియంట్లు ఒక్క లీటర్ పెట్రోల్‌తో సగటున 24.76 కి.మీ దూరం ప్రయాణించగలవు.

వేరియంట్లు VXi (O) AGS, VXi+ (O) AGS 25.30 కి.మీ/లీ మైలేజీని అందించగల సామర్థ్యం కలిగి ఉన్నాయి. అంటే, మెరుగైన సౌకర్యం కోసం ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంచుకున్నా, ఫ్యూయల్ పొదుపు విషయంలో ఏమైనా రాజీ పడాల్సిన అవసరం ఉండదు. ఇవి అన్నీ పెట్రోల్ ఇంజిన్ వేరియంట్లే కావడం విశేషం. ఎస్-ప్రెస్సోను కొత్తగా మొదటి సారి కారు కొనే వారికి, బడ్జెట్ వినియోగదారులకి బాగా సరిపడే ప్రాక్టికల్ ఎంపికగా నిలబెడుతోంది.
పెట్రోల్ వేరియంట్లే ఇప్పటికే 24-25 కి.మీ/లీటర్ మధ్యలో మైలేజ్ ఇస్తూ తక్కువ ధరలో ప్రయాణానికి బాగా ఉపయోగపడతాయి.అయితే, ఇంకా ఎక్కువ ఫ్యూయల్ ఖర్చు పొదుపు కోరుకునేవారి కోసం ఈ కారులో సీఎన్‌జీ ఆప్షన్ మరింత ఆకర్షణీయంగా మారింది. సీఎన్‌జీ ఇంజిన్‌తో వచ్చే ఎస్-ప్రెస్సో వేరియంట్లు LXI (O), VXI (O) తక్కువ ఖర్చుతో అధిక దూరం ప్రయాణించే వీలుని కల్పిస్తాయి. ఇవి కిలో సీఎన్‌జీకి 32.73 కి.మీ మైలేజ్ ఇస్తాయి.

ఇది ARAI (ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) ద్వారా ధృవీకరించబడినది. ఇలాంటి అసాధారణమైన ఫ్యూయల్ ఎఫిషెన్సీ వల్ల రోజూ ఎక్కువ కిలోమీటర్లు ప్రయాణించే వారి కోసం ఎస్-ప్రెస్సో ఒక బడ్జెట్ అనుకూల కారుగా నిలుస్తోంది. పెట్రోల్ ధరల వేగంగా పెరుగుతున్న పరిస్థితుల్లో, సీఎన్‌జీ వేరియంట్ ఎంచుకోవడం వల్ల నెలవారీ ఇంధన ఖర్చు కనీసం తగ్గుతుంది.


Click it and Unblock the Notifications








