విదేశీ టెస్టుల్లో ఫెయిల్.. మన టెస్టుల్లో పాస్.. బాలనో కారు కూడా పాలిటిక్స్ చేస్తోందా ఏంటి?

భారతీయ రోడ్ల మీద రారాజుగా వెలుగుతున్న మారుతి సుజుకి బాలనో (Maruti Suzuki Baleno) గురించి ప్రస్తుతం ఆటోమొబైల్ రంగంలో ఒక పెద్ద చర్చ నడుస్తోంది. ఒకవైపు సేఫ్టీ రేటింగ్‌ల విషయంలో వినియోగదారుల్లో అవగాహన పెరుగుతుంటే, మరోవైపు బాలనో కారుకు వచ్చిన భిన్నమైన ఫలితాలు కస్టమర్లను గందరగోళానికి గురిచేస్తున్నాయి.

అసలు విషయం ఏమిటంటే, భారతదేశంలో తయారై విదేశాలకు ఎగుమతి అయిన బాలనోను ల్యాటిన్ ఎన్‌సీఏపీ (Latin NCAP) పరీక్షించగా, అది కేవలం 1 స్టార్ రేటింగ్ మాత్రమే సాధించింది. ఈ వార్త బయటకు రాగానే సోషల్ మీడియాలో భారతదేశం పరువు పోయింది, ఇందులో వెళ్తే దేవుడు కూడా కాపాడలేడు అంటూ విపరీతమైన ట్రోల్స్ మొదలయ్యాయి. కానీ దీని వెనుక ఉన్న అసలు నిజాన్ని విశ్లేషిస్తే కథ మరోలా ఉంది.

Maruti Suzuki Safety Update 2025 Balenos 4-Star Triumph in Bharat NCAP vs Latin NCAP Shock

లాటిన్ అమెరికా దేశాల్లో విక్రయించే బాలనో మోడల్ అక్కడ నిర్వహించిన క్రాష్ టెస్టుల్లో దారుణంగా విఫలమైంది. కేవలం 2 ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్న వేరియంట్‌కు 1 స్టార్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్న టాప్ ఎండ్ మోడల్‌కు కూడా కేవలం 2 స్టార్ రేటింగ్ మాత్రమే లభించింది. ఎగుమతి చేయబడిన ఈ కారు భద్రతలో ఎందుకు వెనుకబడిందనేది ఆందోళన కలిగించే విషయమే.

అయితే, విదేశీ మార్కెట్లలో భద్రతా ప్రమాణాలు, అక్కడ వాడే సామగ్రి, టెస్టింగ్ నిబంధనలు మన దేశంతో పోలిస్తే భిన్నంగా ఉంటాయి. అందుకే ఈ రేటింగ్స్ చూసి మన దేశంలోని వాహనదారులు భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు సూచిస్తున్నారు.

Maruti Suzuki Safety Update 2025 Balenos 4-Star Triumph in Bharat NCAP vs Latin NCAP Shock

నిజానికి, భారతదేశంలో విక్రయించే మారుతి సుజుకి బాలనో మోడల్ ఇటీవలే మన దేశపు సొంత సేఫ్టీ ఏజెన్సీ అయిన భారత్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్టుల్లో పాల్గొని అద్భుతమైన ఫలితాలను నమోదు చేసింది. మన ఊరి రోడ్ల మీద తిరిగే బలనో కారు పెద్దల భద్రతలో 4 స్టార్, పిల్లల భద్రతలో 3 స్టార్ రేటింగ్ సాధించింది.

అంటే ల్యాటిన్ ఎన్‌సీఏపీ రిపోర్టు కంటే మన దేశీయ మోడల్ చాలా మెరుగైన భద్రతను అందిస్తోంది. ఎగుమతి అయ్యే మోడల్‌కు, మన దేశంలో అమ్మే మోడల్‌కు మధ్య బాడీ స్ట్రక్చర్, సేఫ్టీ ఫీచర్లలో కొన్ని కీలక మార్పులు ఉండటమే ఈ తేడాలకు ప్రధాన కారణం.

Maruti Suzuki Safety Update 2025 Balenos 4-Star Triumph in Bharat NCAP vs Latin NCAP Shock

ఒకప్పుడు మారుతి సుజుకి అంటే కేవలం మైలేజీకి మాత్రమే ప్రాధాన్యత ఇస్తుంది, భద్రతలో సున్నా అనే అపవాదు ఉండేది. కానీ కాలక్రమేణా మారుతి తన పద్ధతిని మార్చుకుంది. టాటా మరియు మహీంద్రా వంటి కంపెనీలు సేఫ్టీలో దూసుకుపోతుండటంతో, మారుతి కూడా తన కార్ల బాడీ క్వాలిటీని భారీగా పెంచింది.

దీనికి నిదర్శనమే ఇటీవల వచ్చిన మారుతి సుజుకి డిజైర్ (Maruti Suzuki Dzire), మారుతి సుజుకి విక్టోరిస్ (Maruti Suzuki Victoris). ఈ రెండు కార్లు భారత్ ఎన్‌సీఏపీ, గ్లోబల్ ఎన్‌సీఏపీ టెస్టుల్లో ఏకంగా 5 స్టార్ రేటింగ్ సాధించి సరికొత్త చరిత్ర సృష్టించాయి. మారుతి కార్లు కూడా అత్యంత సురక్షితమైనవి అని ఇప్పుడు కస్టమర్లు గర్వంగా చెప్పుకుంటున్నారు.

Maruti Suzuki Safety Update 2025 Balenos 4-Star Triumph in Bharat NCAP vs Latin NCAP Shock

ప్రస్తుతం మన దేశంలో లభిస్తున్న బాలనోలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), హిల్‌ హోల్డ్ అసిస్ట్, ఏబీఎస్ వంటి ఆధునిక భద్రతా ఫీచర్లు స్టాండర్డుగా వస్తున్నాయి. లాటిన్ అమెరికాలో వచ్చిన తక్కువ రేటింగ్ కేవలం అక్కడి ఎగుమతి మోడల్‌కు మాత్రమే పరిమితం.

కాబట్టి, బాలనో కారు కొనాలని ప్లాన్ చేస్తున్న వారు లేదా ఇప్పటికే వాడుతున్న వారు ఆందోళన చెందాల్సిన పని లేదు. మొత్తానికి మారుతి సుజుకి తన కార్లను మైలేజీతో పాటు స్టార్ రేటింగ్ లోనూ అగ్రస్థానంలో నిలబెట్టడానికి గట్టిగా కృషి చేస్తోంది.

More from DriveSpark

Article Published On: Saturday, December 20, 2025, 7:37 [IST]
English summary
Maruti suzuki safety update 2025 balenos 4 star triumph in bharat ncap vs latin ncap shock
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+