ఈ స్టైలిష్ మారుతీ కారు ఇకపై కనిపించదు! సెడాన్ లవర్స్‌కు ఇది పెద్ద షాకింగ్ న్యూస్

ఇండియాలో పేద, మధ్య తరగతి వినియోగదారులకు తక్కువ ధరలో కార్లను విడుదల చేయడంలో ప్రసిద్ధి చెందిన ప్రముఖ వాహన తయారీ కంపెనీ మారుతీ సుజుకీ (Maruti Suzuki) దేశంలో విక్రయిస్తున్న ఏకైక సెడాన్ మోడల్ సియాజ్ కారు అమ్మకాలను నిలిపివేయాలని ఆలోచనలో ఉన్నట్లు మార్కెట్ వర్గాల నివేదికలు పేర్కొంటున్నాయి. ఇది సెడాన్ కార్ల లవర్స్‌కు బాధ కలిగించే న్యూస్ అని చెప్పవచ్చు. మారుతీ సుజుకీ సియాజ్ (ciaz) అమ్మకాలు ఈ ఏడాది ఏప్రిల్ నాటికి నిలిపివేయబడతాయని తెలుస్తుంది. అయితే కంపెనీ నుంచి ఈ విషయంపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ నివేదికలు మాత్రం ఈ కారు ఉత్పత్తిని మార్చి చివరి నాటికి ఆగిపోతుందని, ఏప్రిల్ నాటికి సేల్స్ క్లోజ్ అవుతాయని అంటున్నారు. భారతీయ మార్కెట్లో సెడాన్ మోడల్ సియాజ్ కారుకు మంచి డిమాండ్ ఉంది. అయినప్పటికి అమ్మకాలు ఆగిపోనున్నాయి.

భారత్‌లో సాధారణంగా సెడాన్ కార్లను ఇష్టపడే వారిలో చాలా మందికి ఇది మొదటి ఎంపికగా ఉంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో SUVలకు డిమాండ్ పెరగడం మొదలైంది. హ్యాచ్‌బ్యాక్ కార్లను కూడా అధికంగానే కొనుగోలు చేస్తున్నారు. వీటన్నింటిని సైతం తట్టుకుని సియాజ్ సెడాన్ నిలబడింది. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా SUVలను ఎక్కువగా కొనుగోలు చేస్తుండటంతో కంపెనీ ఈ కారు అమ్మకాలను కావాలనే నిలిపివేస్తున్నట్లు సమాచారం.

Maruti Suzuki Sedan Model Ciaz News

మారుతీ సుజుకీ ఈ సియాజ్ కారును మొదటిసారిగా భారతదేశంలో 2014 లో విడుదల చేసింది. అయితే ఆ టైంలో దేశంలో సెడాన్ కార్ల హవా ఎక్కువగా ఉండేది. కొత్తగా కారును కొనుగోలు చేయడానికి షోరూమ్‌కు వెళ్లే వారు మొదటగా సెడాన్ సెగ్మెంట్ కార్లను ఎంచుకునే వారు, దీంతో అప్పుడు సియాజ్‌ను చాలా మంది కొనుగోలు చేశారు. దేశీయంగా సెడాన్లకు డిమాండ్ ఉన్న సమయంలో సియాజ్ తన హవాను చూపించింది.

అయితే రాను రాను క్రమంగా పరిస్థితి మారిపోయింది. సెడాన్లను కొనుగోలు చేసే వారు చాలా వరకు తగ్గిపోయారు. SUV లను కొనుగోలు చేసేవారి సంఖ్య పెరిగింది. దీంతో నెల నెలా అమ్మకాలు తగ్గుతూ వచ్చాయి. ఏకంగా వీటి సేల్స్ ఎంతలా పడిపోయాయంటే నెలకు 600-500 యూనిట్లు అమ్మడం పెద్ద విషయంగా మారింది. 2015లో మొత్తం కార్ల విక్రయాల్లో సెడాన్ల వాటా 20 శాతంగా ఉంది.

Maruti Suzuki Sedan Ciaz

అయితే ఇది గత ఏడాది 2024 వచ్చేసరికి 10 శాతం కిందికి పడిపోయింది. అయితే ఇదే భారతదేశంలో ఎస్‌యూవీ సెగ్మెంట్‌కు డిమాండ్ ఎక్కువ పెరగడం మొదలైంది. డేటా ప్రకారం, వీటి అమ్మకాలు సగానికి పైగా పెరిగాయి. ఒక్క మారుతీ సెడాన్ అమ్మకాలే కాకుండా ఇతర దిగ్గజ కంపెనీలకు చెందిన సెడాన్ల సేల్స్ తగ్గిపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో మారుతీ తన సెడాన్ మోడల్ సియాజ్ అమ్మకాలు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్లుంది.

త్వరలోనే మారుతీ కంపెనీ దీనికి సంబంధించి ఒక అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. ఇక సియాజ్ కారు విషయానికి వస్తే, రూ.9.41 లక్షల ప్రారంభ ధర (ఎక్స్ షోరూమ్) నుంచి కొనుగోలుకు లభిస్తుంది. 1.5-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్​తో రన్ అవుతతుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లో లభిస్తుంది.

Ciaz Discontinued By April 2025

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, February 25, 2025, 17:51 [IST]
English summary
Maruti suzuki sedan model ciaz discontinued by april 2025 full details check here
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+