జిఎస్‌టి తగ్గించగానే కస్టమర్లతో కిక్కిరిసిన కార్ల మార్కెట్.. ఒక్కో కంపెనీ ఎన్ని వేల కార్లు అమ్మిందో తెలుసా ?

సాధారణంగా దసరా పండుగ సమయంలో కార్ల అమ్మకాలు అవి ఏ కంపెనీ అయినా ఎక్కువగానే ఉంటాయి. ఈసారి నవరాత్రి మొదటి రోజు (సెప్టెంబర్ 22) జీఎస్టీ రేట్ల తగ్గింపు కూడా తోడవడంతో కార్ సేల్స్ భారీగా పెరిగాయి. ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో కార్లు అమ్ముడయ్యాయి. భారతదేశంలోని ప్రముఖ కార్ల తయారీ సంస్థలైన మారుతి సుజుకి, హ్యుందాయ్, టాటా మోటార్స్ భారీ అమ్మకాలను నమోదు చేశాయి.

నవరాత్రులు మొదలు, జీఎస్టీ రేట్ల తగ్గింపు అనే రెండు ముఖ్యమైన కారణాల వల్ల ఒక్క రోజులోనే కార్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా సెప్టెంబర్ 22న ప్రభుత్వం కొత్త జీఎస్టీ రేట్లను అమలు చేసింది. దీని వల్ల కార్లపై పన్ను 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గింది. దీనితో కార్ల ధరలు గణనీయంగా తగ్గాయి. ఈ కారణంగా భారత కార్ల మార్కెట్‌లో హిస్టరీ క్రియేట్ అయింది.

Maruti Suzuki Sells 30 000 Cars Hyundai 11 000 in a Single Day After GST Reduction

సెప్టెంబర్ 22న ఒక్కరోజులోనే వేలాది కార్లు అమ్ముడయ్యాయి. మారుతి సుజుకి, హ్యుందాయ్, టాటా మోటార్స్ వంటి అగ్రశ్రేణి కంపెనీలు ఊహించని అమ్మకాలతో రికార్డులు సృష్టించాయి. ఈ భారీ అమ్మకాల వెనుక ఉన్న కారణాలు, కంపెనీల స్పందన గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

నవరాత్రి పండుగ ప్రారంభం, జిఎస్‌టి (GST) రేట్ల తగ్గింపు.. ఈ రెండు ముఖ్యమైన కారణాలతో భారత కార్ల మార్కెట్ ఒక్కసారిగా పుంజుకుంది. సెప్టెంబర్ 22న, అంటే నవరాత్రి మొదటి రోజు అలాగే జిఎస్‌టి తగ్గింపు అమల్లోకి వచ్చిన రోజు, భారతదేశంలో భారీ సంఖ్యలో కార్లు అమ్ముడయ్యాయి. షోరూమ్‌లు కస్టమర్లతో కిక్కిరిసిపోయి, సంతలను తలపించాయి.

Maruti Suzuki Sells 30 000 Cars Hyundai 11 000 in a Single Day After GST Reduction

దేశంలోని అగ్రశ్రేణి కార్ల తయారీ కంపెనీలు ఊహించని స్థాయిలో అమ్మకాలను నమోదు చేశాయి
మారుతి సుజుకి: భారతదేశంలో నంబర్-1 కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి సెప్టెంబర్ 22న ఒక్కరోజులోనే 30,000 కంటే ఎక్కువ కార్లను విక్రయించి సంచలనం సృష్టించింది. అంతేకాకుండా అదే రోజున 80,000 మందికి పైగా కస్టమర్‌లు మారుతి డీలర్‌షిప్‌లలో కార్ల కొనుగోలు గురించి విచారించారు.

హ్యుందాయ్: మరో ప్రముఖ కార్ల కంపెనీ హ్యుందాయ్ కూడా సెప్టెంబర్ 22న ఒక్కరోజులోనే 11,000 కార్లను విక్రయించింది. గత ఐదేళ్లలో ఒక్కరోజులో హ్యుందాయ్ సాధించిన అత్యధిక అమ్మకాల సంఖ్య ఇదే కావడం విశేషం.

Maruti Suzuki Sells 30 000 Cars Hyundai 11 000 in a Single Day After GST Reduction

టాటా మోటార్స్: ఈ రెండు కంపెనీల సరసన టాటా మోటార్స్ కూడా చేరింది. టాటా మోటార్స్ సెప్టెంబర్ 22న 10,000 కార్లను కస్టమర్‌లకు డెలివరీ చేసింది. ఇది టాటా మోటార్స్ చరిత్రలోనే ఒక మైలురాయిగా ది హిందూ బిజినెస్ లైన్ నివేదించింది. అదే రోజున 25,000 మందికి పైగా కస్టమర్‌లు టాటా మోటార్స్ డీలర్‌షిప్‌లను సందర్శించి కార్ల గురించి ఆరా తీశారు.

పైన పేర్కొన్న కంపెనీలే కాకుండా, ఇతర ప్రముఖ కార్ల తయారీ సంస్థలు కూడా సెప్టెంబర్ 22న రికార్డు స్థాయిలో అమ్మకాలను నమోదు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Maruti Suzuki Sells 30 000 Cars Hyundai 11 000 in a Single Day After GST Reduction

జిఎస్‌టి తగ్గింపు, కంపెనీల స్పందన
జిఎస్‌టి రేట్ల తగ్గింపు కారణంగా భారత మార్కెట్‌లో కార్ల ధరలు గణనీయంగా తగ్గాయి. దీనితో కొత్త కార్లను కొనుగోలు చేయడానికి చాలా మంది కస్టమర్‌లు ఆసక్తి చూపుతున్నారు. హ్యుందాయ్ ఇండియా సీవోవో తరుణ్ గార్గ్ మాట్లాడుతూ.. జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలను కస్టమర్‌లకు పూర్తిగా అందించిన మొదటి కంపెనీలలో హ్యుందాయ్ ఒకటని, కస్టమర్‌ల పండుగలను మరింత సంతోషంగా మార్చినందుకు తాము సంతోషిస్తున్నామని తెలిపారు.

ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ ఫెడరేషన్ (FADA) కూడా డీలర్‌షిప్‌లకు వచ్చే కస్టమర్‌ల సంఖ్య పెరిగిందని కన్ఫాం చేసింది. కార్ల ఉత్పత్తి కంపెనీలు, డీలర్‌షిప్‌లు జీఎస్టీ తగ్గింపును స్వాగతించాయి. ఇది కస్టమర్‌ల కొనుగోలు శక్తిని పెంచుతుందని వారు అభిప్రాయపడ్డారు. ఈ ప్రయత్నానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు. జీఎస్టీ తగ్గింపు, పండుగ సీజన్ కలయికతో రానున్న కాలంలో కార్ల అమ్మకాలు గణనీయంగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం : భారతదేశంలోని మధ్యతరగతి ప్రజలు కొత్త కారును కొనుగోలు చేయడానికి ఇది నిజంగా మంచి అవకాశం. జీఎస్టీ తగ్గింపుతో ప్రస్తుతం కార్ల ధరలు తగ్గాయి. అదనంగా, పండుగ సీజన్‌ను పురస్కరించుకొని, కస్టమర్‌లు తగ్గింపులు, ఆఫర్‌లను కూడా పొందవచ్చు. ఇది కార్ల కొనుగోలుకు అనువైన సమయం అని నిపుణులు సూచిస్తున్నారు.

More from DriveSpark

Article Published On: Wednesday, September 24, 2025, 9:51 [IST]
English summary
Maruti suzuki sells 30 000 cars hyundai 11 000 in a single day after gst reduction
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+