జనాలు ఎక్కువగా ఆ మారుతి కారునే కొన్నారు.. దీనిలో అంత స్పెషల్ ఏముందో మరి?
ప్రతినెల చివరలో భారతీయ వాహన పరిశ్రమలో అన్ని ప్రధాన ఆటోమొబైల్ తయారీదారులు తమ నెలవారీ అమ్మకాల గణాంకాలను వెల్లడిస్తుంటారు, దీనివల్ల మార్కెట్‌లో ట్రెండ్స్, వినియోగదారుల ప్రాధాన్యతలు స్పష్టంగా తెలుస్తాయి. ఈ నేపథ్యలో, దేశీయ ఆటో దిగ్గజం మారుతి సుజుకి (Maruti Suzuki) కూడా సెప్టెంబర్ 2025 నెలకు సంబంధించిన తన అమ్మకాల వివరాలను ప్రకటించింది. సేల్స్ రిపోర్ట్ ప్రకారం, సెప్టెంబర్ 2025లో మారుతి సుజుకి మొత్తం 1,32,821 కార్లను విక్రయించింది. అయితే, గత ఏడాది ఇదే కాలంలో నమోదైన అమ్మకాలు 1,44,904 యూనిట్లతో పోలిస్తే, ఇది దాదాపు 8.38% తగ్గుదలగా ఉంది. అమ్మకాలలో ఈ తగ్గుదల కేవలం సంఖ్యలో మాత్రమే కాకుండా, మార్కెట్ వాటా పరంగా కూడా ప్రతిఫలించింది.
సెప్టెంబర్ 2024లో మారుతి సుజుకి మొత్తం వాహన మార్కెట్‌లో 40.4% వాటా కలిగినప్పటికీ, సెప్టెంబర్ 2025లో ఇది 35.1%కి తగ్గింది, అంటే దాదాపు 5 శాతం తేడా ఉంది. ఈ తేడా భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో SUVలు, కాంపాక్ట్ క్రాస్ఓవర్‌లు, ఇతర కొత్త మోడళ్ల కస్టమర్ ఆకర్షణ పెరుగుదలతో సంబంధం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మారుతి సుజుకి కోసం ఇది ఒక తాత్కాలిక సవాలు మాత్రమే.

సెప్టెంబర్ 2025లో మారుతి సుజుకి టాప్ కార్ల అమ్మకాలు చూసినట్లయితే, ఈ నెలలో డిజైర్ అత్యధికంగా అమ్ముడైన మోడల్‌గా నిలిచింది. గత సంవత్సరం సెప్టెంబర్‌తో పోలిస్తే డిజైర్ 85% వృద్ధి నమోదు చేసి, 20,038 యూనిట్లు విక్రయించబడాయి. అలాగే, ఆగస్టు 2025తో పోలిస్తే డిజైర్ అమ్మకాలు 21% పెరిగాయి. రెండవ స్థానంలో నిలిచిన స్విఫ్ట్ కార్లు, సెప్టెంబర్ 2025లో 15,547 యూనిట్ల అమ్మకాలను నమోదు చేశాయి.
గత సంవత్సరం సెప్టెంబర్‌తో పోలిస్తే ఇది 4% తక్కువ, కానీ ఆగస్టు 2025తో పోలిస్తే నెలవారీ అమ్మకాల్లో 26% వృద్ధి. జాబితాలో మూడవ స్థానంలో ఉన్న వ్యాగన్ఆర్ కూడా బలమైన డిమాండ్‌ను రికార్డ్ చేసింది. సెప్టెంబర్ 2025లో 15,388 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసి, వార్షిక ప్రాతిపదికన 15% వృద్ధి, నెలవారీ ప్రాతిపదికన 6% వృద్ధిని సాధించింది. ఈ స్థిరమైన సేల్స్ వ్యాగన్ఆర్‌కు భారత మార్కెట్‌లో మంచి స్థానం కల్పిస్తోంది.

సెప్టెంబర్ 2025లో నాల్గవ స్థానంలో నిలిచిన ఫ్రాంక్స్ 13,767 యూనిట్లు విక్రయించింది. ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 1% తగ్గుదల, కానీ ఆగస్టు 2025తో పోలిస్తే 11% నెలవారీ వృద్ధి సాధించింది. అదేవిధంగా, ఐదో స్థానంలో నిలిచిన బాలెనో సెప్టెంబర్ 2025లో 13,173 యూనిట్లు విక్రయించింది.తరువావ ఎర్టిగా ఈ నెలలో 12,115 యూనిట్లు, బ్రెజ్జా 10,173 యూనిట్లు విక్రయించాయి.
ఈకో వ్యాన్ అమ్మకాలు తగ్గి 10,035 యూనిట్లకి చేరినవి. గ్రాండ్ విటారా అమ్మకాలు గత సంవత్సరం పోలిస్తే 45% తగ్గి 5,698 యూనిట్లకు చేరాయి. చిన్న హ్యాచ్‌బ్యాక్‌లలో, ఆల్టో సెప్టెంబర్‌లో 5,434 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. XL6 అమ్మకాలు తగ్గి 2,170 యూనిట్లు మాత్రమే రికార్డ్ అయ్యాయి. అదే సమయంలో, S-ప్రెస్సో కారు 1,774 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది, ఇది గత సంవత్సరం పోలిస్తే 4% వృద్ధి.

మిగతా మోడళ్లలో, ఇగ్నిస్ (1,704 యూనిట్లు), సెలెరియో (1,033 యూనిట్లు), జిమ్నీ (296 యూనిట్లు) అమ్మకాలు సంవత్సరానికి, నెలవారీగా తగ్గాయి. అలాగే, ఇన్విక్టో కూడా కేవలం 215 యూనిట్ల విక్రయాలతో మార్కెట్‌లో సాధారణ స్థాయిలోనే నిలిచింది. మొత్తం మీద, సెప్టెంబర్ 2025లో మారుతి సుజుకి అమ్మకాలలో కొన్ని మోడళ్లకు బలమైన డిమాండ్ వచ్చినప్పటికి, మరికొన్నింటికి తగ్గింది.


Click it and Unblock the Notifications








