రూ.8.69 లక్షలు, 25 కి.మీ మైలేజ్, 5-సీటర్.. ఈ తోపు కారును ఎంతమంది కొన్నారో తెలుసా?

దేశీయ దిగ్గజ కార్ల తయారీదారు మారుతి సుజుకి (Maruti Suzuki)కి చెందిన బ్రెజ్జా (Brezza), భారత మార్కెట్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సాధించిన నమ్మకమైన SUV. స్టైలిష్, కాంపాక్ట్ డిజైన్‌తో పాటు, డజన్ల కొద్దీ ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగి ఉండటం దీని ప్రధాన బలాలు. రోడ్డుపై దాని ప్రెజెన్స్, ప్రాక్టికల్ సైజు, ఫీచర్స్ ఇవి అన్నీ కలిపి బ్రెజ్జాను కుటుంబాలకే కాకుండా యువతరానికి కూడా ఒక సరైన ఎంపికగా నిలిపాయి. పనితీరులోనూ ఇది తన క్లాస్‌లో ఒక నమ్మకమైన మోడల్‌గా ప్రసిద్ధి చెందింది. జూలై నెల ముగిసిన నేపథ్యంలో మారుతి ఈ కారుకు సంబంధించిన సేల్స్ వివరాలను వెల్లడించింది. దీని ప్రకారం, జూలై 2025లో బ్రెజ్జా మొత్తం 14,065 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది.

ఈ కారు కోసం గత నెలలో మొత్తం 14,065 మంది మారుతి షోరూమ్‌లకు వచ్చారు. అయితే, 2024 జూలైలో అమ్ముడైన 14,676 యూనిట్లతో పోలిస్తే, ఈసారి అమ్మకాలు కొద్దిగా తగ్గాయి. గణాంకాల ప్రకారం, ఇది సంవత్సరానికి 4 శాతం స్వల్ప తగ్గుదలగా నమోదు అయింది. అయినా, ఈ తేడా చాలా తక్కువగా ఉండటం, బ్రెజ్జా మార్కెట్లో తన డిమాండ్‌ ఇంకా బలంగానే కొనసాగుతోందని సూచిస్తుంది.

Maruti Suzuki Suv Brezza July 2025 Sales 4 Percent Down

ముఖ్యంగా, కఠినమైన పోటీ ఉన్న కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లో కూడా బ్రెజ్జా నిలకడగా మంచి అమ్మకాలను నమోదు చేస్తుండటం, మారుతి సుజుకి నమ్మకాన్ని, వినియోగదారుల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. 2025లోని మొదటి ఆరు నెలల్లో మారుతి సుజుకి బ్రెజ్జా తన సేల్స్‌ను స్థిరంగా కొనసాగిస్తూ, మార్కెట్లో బలమైన ప్రదర్శనను కనబరిచింది. ఈ కాలంలో మొత్తం 78,982 యూనిట్లు అమ్ముడవ్వడం, ఈ SUVకి ఉన్న నిరంతర డిమాండ్‌కు మరోసారి నిదర్శనంగా నిలిచింది.

బ్రెజ్జా నిలకడగా ప్రతి నెల సగటున 13,163 యూనిట్లు కొత్త యజమానుల ఇంటికి చేరినట్లుగా అర్థమవుతుంది. ఇది కేవలం ఒక గణాంకం మాత్రమే కాదు, పోటీతో నిండిన కాంపాక్ట్ SUV మార్కెట్లో, బ్రెజ్జా తన స్థానం ఎంత గట్టిగా నిలబెట్టుకున్నదీ చూపిస్తుంది. కొత్త మోడళ్ల రాక, విభిన్న బ్రాండ్ల ఆకర్షణీయ ఆఫర్లు, మారుతున్న వినియోగదారుల అభిరుచులు వంటి ప్రతికూలతలు ఉన్నప్పటికీ, బ్రెజ్జా తన స్థిరమైన అమ్మకాలతో బ్రాండ్‌కు బలాన్ని చేకూర్చింది.

Maruti Suzuki Suv Brezza July 2025 Sales

బ్రెజ్జా ధర, దాని ఫీచర్స్ గురించి చూసినట్లయితే, ధర రూ. 8.69 లక్షల నుండి రూ. 14.14 లక్షల(ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. కొత్త బ్రెజ్జా శక్తివంతమైన 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది, ఇది 101 PS పవర్‌తో పాటు 137 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. నగర డ్రైవింగ్‌లోనూ, హైవేలోనూ సరైన పవర్ డెలివరీ అనుభవాన్ని కల్పిస్తుంది. ఈ పవర్‌ట్రెయిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడింది.

బ్రెజ్జా కేవలం ఒకే ఇంజిన్ ఆప్షన్‌కే పరిమితం కాకుండా, వినియోగదారుల అభిరుచులకు తగిన విధంగా పలు పవర్‌ట్రెయిన్‌లతో అందుబాటులో ఉంది. ఇందులో ఒకటి 1.5-లీటర్ మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్‌(పెట్రోల్ + ఎలక్ట్రిక్), ఇది 103 PS పవర్, 139 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ వెర్షన్‌ను 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ఎంచుకోవచ్చు, అందువల్ల నగర డ్రైవింగ్‌కైనా, దీర్ఘ ప్రయాణాలకైనా సరైన డ్రైవ్ అనుభవాన్ని అందిస్తుంది.

Maruti Suzuki Suv Brezza July 2025 Sales

ఇంకో ఆప్షన్‌గా, 1.5-లీటర్ పెట్రోల్/CNG ఇంజిన్ లభిస్తుంది. ఇది CNG మోడ్‌లో 88 PS పవర్, 121.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ వేరియంట్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే అందించబడుతుంది, ఫ్యూయల్ ఖర్చును తగ్గించుకోవాలనుకునే వారికి ఇది ఒక మంచి ఎంపిక. మైలేజీ పరంగా బ్రెజ్జా మరింత ఆకర్షణీయంగా నిలుస్తుంది. వేరియంట్ ఆధారంగా, ఇది లీటరుకు 17.80 నుండి గరిష్టంగా 25.51 కిలోమీటర్ల వరకు మైలేజ్ అందించగలదు.

More from DriveSpark

Article Published On: Monday, August 11, 2025, 13:10 [IST]
English summary
Maruti suzuki suv brezza july 2025 sales 4 percent down details check
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+