ఫుల్ ట్యాంక్ నింపితే ఏకంగా 1500 కి.మీల పైనే.. ఒక్క నెలలో 9 వేల మంది ఈ కారు కోసం ఎగబడ్డారు!
భారతదేశంలో కార్ల తయారీలో అతిపెద్ద కంపెనీ మారుతి సుజుకి (maruti suzuki). ఇది పేద, మధ్య తరగతి ప్రజలు కొనుగోలు చేసే విధంగా అందుబాటు ధరలోనే వాహనాలను విడుదల చేస్తుంది. ధర తక్కువగా ఉన్నప్పటికి ఫీచర్స్ మాత్రం బోలెడు ఉన్నాయి. తాజాగా విడుదలైన అమ్మకాల నివేదిక ప్రకారం, మారుతి సుజుకి ఫ్రాంక్స్ (Fronx) దేశీయ మార్కెట్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకుంటూ, కాంపాక్ట్ SUV విభాగంలో వేగంగా ఎదుగుతోంది. బాలెనో ప్లాట్‌ఫాంపైన ఆధారపడి రూపొందించిన ఈ మోడల్, స్టైలిష్ డిజైన్‌తో పాటు, వినియోగదారులను ఆకట్టుకునే ప్రీమియం అంశాలతో మార్కెట్లోకి అడుగుపెట్టింది. విడుదలైన నాటి నుండి వినియోగదారుల్లో విశ్వాసాన్ని సంపాదించుకుంటూ, అమ్మకాల పరంగా కూడా స్థిరమైన ప్రదర్శనను కనబరుస్తోంది.
తాజాగా జూన్ 2025లో ఫ్రాంక్స్ మొత్తం 9,815 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇది గత సంవత్సరం ఇదే నెలలో విక్రయించిన 9,688 యూనిట్లతో పోలిస్తే స్వల్పంగా 1 శాతం వృద్ధిని సూచిస్తోంది. ప్రతిష్టాత్మక SUVల మధ్య పోటీ పెరిగిన ఈ తరుణంలో, ఫ్రాంక్స్‌కు ఇప్పటికీ కొనుగోలుదారులలో ఆదరణ ఉంది. కేవలం జూన్ నెలే కాదు, 2025 సంవత్సరంలో ఇప్పటి వరకూ ఫ్రాంక్స్ చేసిన ప్రదర్శన మరింత బలంగా ఉంది.

ఈ ఏడాది నెలవారీగా విక్రయాలను చూసినట్లయితే జనవరిలో 15,192 యూనిట్లు అమ్ముడుపోయింది. తరువాత ఫిబ్రవరిలో అత్యధికంగా 21,461 యూనిట్లు సేల్ అయింది. తిరిగి మార్చిలో 13,669 యూనిట్లకు పడిపోయింది. తరువాత ఏప్రిల్‌లో 14,345 యూనిట్లకు పెరిగి మే నెలలో 13,584 యూనిట్లు నమోదైంది. ఈ అమ్మకాలను చూస్తే, సంవత్సర ప్రారంభం నుండి ఫ్రాంక్స్ కారు ప్రతినెలా పటిష్టమైన అమ్మకాల సంఖ్యను కొనసాగించడమే కాకుండా, పాపులారిటీ ఎలా పెరిగిపోతుందో స్పష్టంగా తెలుస్తోంది.
మారుతి సుజుకి ఫ్రాంక్స్ తన అద్భుతమైన డిజైన్‌తో పాటు అందుబాటు ధరతోనూ మధ్యతరగతి వినియోగదారుల మనసులను దోచుకుంటోంది. భారతీయ మార్కెట్ లక్ష్యంగా రూపొందించిన ఈ SUV, తక్కువ ఖర్చుతో ఎక్కువ విలువ అందించే వాహనంగా నిలుస్తోంది. దీని ప్రారంభ ధర రూ. 7.54 లక్షల నుండి రూ. 13.03 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండటం వలన, డ్రీమ్ SUVను సొంతం చేసుకోవాలనుకునే వారికి ఇది ఒక సరైన ఎంపికగా మారింది.

ఈ కారును మార్కెట్లో సిగ్మా, డెల్టా ప్లస్ (O), జీటా, ఆల్ఫా, డెల్టా, డెల్టా ప్లస్ అనే వివిధ వేరియంట్లలో అందుబాటులో ఉంచారు. ప్రతి వేరియంట్ వినియోగదారుని బడ్జెట్, అవసరాలపై ఆధారపడి ఫీచర్లలో తేడాలతో వస్తుంది, దీంతో ప్రతి ఒక్కరికీ తనకు తగ్గ మోడల్‌ను ఎంచుకునే అవకాశం ఉంటుంది. పెర్ఫార్మెన్స్ పరంగా కూడా ఫ్రాంక్స్ ఎలాంటి రాజీకి పోకుండా శక్తివంతమైన పవర్‌ట్రెయిన్ ఎంపికలను అందిస్తోంది.
ఇది 1.2 లీటర్ డ్యూయల్‌జెట్ పెట్రోల్ ఇంజిన్, 1.0 లీటర్ బూస్ట్‌ర్జెట్ టర్బో పెట్రోల్ ఇంజిన్, ఎక్కువ మైలేజ్ కావాలనుకునే వినియోగదారులకు CNG వేరియంట్ ఎకనామికల్ ఆప్షన్‌లో లభిస్తుంది. ఇంతటి శక్తివంతమైన ఇంజిన్‌లకు సరిపోయేలా, ట్రాన్స్మిషన్ ఆప్షన్లలో 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ AMT, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ SUV 20 నుంచి 28 కిలోమీటర్ల వరకు మైలేజ్ అందించగలదు.

పెట్రోల్ ధరలు రోజురోజుకీ పెరిగిపోతున్న ఈ రోజుల్లో, ఇంత ఎకనామికల్ మైలేజ్‌ను అందించే SUVను కొనుగోలు చేయడం అనేది నిజంగా ఒక మంచి పెట్టుబడిగా చెప్పాలి. ఇది సేఫ్టీ పరంగా కూడా బెస్ట్. దీనిలో 6 ఎయిర్‌బ్యాగులు ఉంటాయి. అలాగే బ్రేకింగ్ సమయంలో వాహనం స్కిడ్ కాకుండా చూసే సిస్టమ్ ABS, వాహనం కంట్రోల్ తప్పకుండా చూసే ESP, EBD, ట్రాక్షన్ కంట్రోల్, 360-డిగ్రీ కెమెరా వంటివి కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








