రూ.7.54 లక్షల కారుకు మార్కెట్లో డిమాండ్ చూస్తే ఆశ్చర్యపోతారు! ఒక్క నెలలో భారీ సేల్స్

భారతీయ ప్రముఖ కార్ల తయారీదారు మారుతి సుజుకి (Maruti Suzuki)కి చెందిన ఫ్రాంక్స్ (Fronx) SUV విభాగంలో తన ప్రత్యేకతను నిలబెట్టుకుంది. ఆకర్షణీయమైన డిజైన్, లేటెస్ట్ ఫీచర్లు, మంచి పనితీరు ఈ కారుకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. స్టైలిష్‌గా ఉండే బాడీ లైన్లు, స్మార్ట్ LED లైటింగ్, ఫ్యూచరిస్టిక్ ఇంటీరియర్ అన్ని కలిసి దీనికి ఒక ప్రీమియం లుక్‌ను ఇస్తున్నాయి. ఇది నగర ప్రయాణాలకు అనుకూలంగా ఉండటంతోపాటు దూర ప్రయాణాల్లోనూ సౌకర్యంగా ఉండేలా రూపొందించబడింది. అందుకే ఈ కారుకు డిమాండ్ సానుకూలంగా ఉంటుంది. తాజాగా విడుదలైన గణాంకాల ప్రకారం, మార్కెట్‌లో దీనిపై ఉన్న డిమాండ్ నిరంతరం పెరుగుతూనే ఉంది. ఈ SUV ని కొనుగోలు చేయాలనే ఆసక్తి గల వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నదీ స్పష్టంగా అర్థం అవుతుంది.

జూలై నెల మారుతి సుజుకి ఫ్రాంక్స్ విశేషమైన సేల్స్‌ను నమోదు చేసింది. ఒకే నెలలో 12,900 యూనిట్ల వరకు ఈ SUV అమ్ముడవ్వడం అనేది వినియోగదారులలో దీనిపై ఉన్న నమ్మకాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది. మార్కెట్‌లో పెరిగిన పోటీలోనూ, కొత్త కొత్త వాహనాలు ప్రవేశిస్తున్నా, ఫ్రాంక్స్ తన ప్రత్యేకతను నిలబెట్టుకొని కొనుగోలుదారుల నమ్మకాన్ని పొందుతోంది. ఇంతకుముందు, 2025 సంవత్సరంలో మొదటి ఆరు నెలలు కూడా ఈ కారు మెరుగైన సేల్స్ సాధించింది.

Maruti Suzuki Suv Fronx July 2025 Sales

ఫ్రాంక్స్ జనవరి నుంచి జూన్ వరకు మొత్తం 72,874 యూనిట్లు అమ్ముడవడం విశేషం. ఈ గణాంకాలను గమనిస్తే, ప్రతి నెల సగటున సుమారు 12,145 యూనిట్లు అమ్ముడయ్యాయని అర్థం. ఈ సంఖ్యలు కేవలం ఒక కారు అమ్మకాలే కాకుండా, వినియోగదారుల అభిరుచులు ఏ దిశగా మారుతున్నాయో తెలియజేస్తున్నాయి. ఇది భారతీయ మధ్యతరగతి వినియోగదారులకు సరైన ఎంపికగా నిలుస్తోంది. SUVగా ఫ్రాంక్స్ మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి దీనికి అభిమానులు పెరుగుతూనే ఉన్నారు.

మారుతి సుజుకి ఫ్రాంక్స్ ధర రూ.7.54 లక్షల నుండి ప్రారంభమై రూ.13.06 లక్షల వరకు ఉంటుంది (ఎక్స్-షోరూమ్ ధరల ప్రకారం), ఇది బడ్జెట్ పరిధిలో వినియోగదారులను ఆకట్టుకునే విధంగా రూపొందించబడింది. వేరియంట్ల విషయానికొస్తే, ఇది సిగ్మా, జీటా,ఆల్ఫా, డెల్టా, డెల్టా ప్లస్, డెల్టా ప్లస్(ఓ) వంటి వేరియంట్లలో అందుబాటులో ఉంది. ప్రతి వేరియంట్‌‍కు తగిన ఫీచర్లు, సాంకేతికత ఉండటంతో, వినియోగదారుడు తన అవసరానికి అనుగుణంగా ఎంపిక చేసుకునే అవకాశం కలుగుతుంది.

Maruti Suzuki Suv Fronx July 2025 Sales

ఇంజిన్ గురించి మాట్లాడితే, ఫ్రాంక్స్ శక్తివంతమైన 1-లీటర్ టర్బోచార్జ్డ్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో రన్ అవుతుంది. ఇది 100 PS శక్తిని, 148 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డ్రైవింగ్ సమయంలో ఇది యాక్సిలరేషన్‌ను, ఫ్యూయల్ వినియోగాన్ని అందిస్తుంది. ఈ ఇంజిన్‌కు 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు కూడా ఉన్నాయి, తద్వారా డ్రైవింగ్ స్టైల్‌కు అనుగుణంగా ఎంపిక చేసుకునే ఆప్షన్ ఉంది.

ఈ SUV 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్‌లో లభిస్తుంది. ఇది 90 PS శక్తిని, 113 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. అలాగే, 1-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్/సిఎన్‌జి ఇంజిన్ కూడా అందుబాటులో ఉంది. ఇది 77.5 PS శక్తిని, 98.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది.

Maruti Suzuki Suv Fronx July 2025 Sales Recorded 12900 Units

మైలేజ్ గమనిస్తే, ఈ కారు సుమారు 20 నుండి 28 కిలోమీటర్లు లీటర్‌కు (వేరియంట్ పై ఆధారపడి) మైలేజీ ఇవ్వగలదు. ఇంధన ధరలు పెరుగుతున్న నేపథ్యంలో, ఇది వినియోగదారుల కోసం ఒక పెద్ద ప్లస్ పాయింట్‌గా నిలుస్తోంది. ఈ కారులో అద్బుతమైన ఫీచర్స్ ఉన్నాయి. సేఫ్టీ పరంగా కూడా ఇది బెస్ట్. దీనిలో 6 ఎయిర్‌బ్యాగులు, ABS, EBD, ESP (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్) వంటివి ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Thursday, August 7, 2025, 14:15 [IST]
English summary
Maruti suzuki suv fronx july 2025 sales recorded 12900 units details
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+