చిన్న కుటుంబాలకు ఈ కారు ఎప్పుడూ ఫేవరెట్! మార్కెట్‌ను షేక్ చేసిన రూ.6 లక్షల హ్యాచ్‌బ్యాక్
ఒకప్పుడు మధ్యతరగతి కుటుంబాలకు మొదటి ఎంపికగా నిలిచిన మారుతీ సుజుకీ స్విఫ్ట్ (maruti suzuki Swift) గత నెల అమ్మకాల్లో మంచి పెర్ఫామెన్స్‌ను చూపింది. తాజాగా విడుదలైన నివేదిక ప్రకారం, ఏప్రిల్ 2025లో ఈ కారు దాదాపు 14,592 మంది కస్టమర్లను ఆకర్షించి, అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్లలో ఇది 7వ స్థానంలో నిలిచింది. ఆకట్టుకునే డిజైన్, నమ్మకమైన పనితీరు, మైలేజ్ కెపాసిటీ వంటి అంశాలతో స్విఫ్ట్ మరోసారి వినియోగదారులను ఆకట్టుకుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుుడు అప్‌డేట్ అవుతూ వస్తున్న ఈ కారు భారతీయ ప్రజలను ఆకర్షించడంలో బాగా విజయవంతం అయింది. ఇది కేవలం ఓ హ్యాచ్‌బ్యాక్ కారు కాదు, రోజువారీ ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మారుస్తుంది.
రూ. 6.49 లక్షల ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరతో అందుబాటులోకి వచ్చిన మారుతీ సుజుకీ స్విఫ్ట్ తాజా మోడల్, అదిరిపోయే ఫీచర్లు కోరుకునే మధ్యతరగతి వినియోగదారులకు ఒక ఆకర్షణీయమైన ఎంపికగా నిలిచింది. లేటెస్ట్ డిజైన్, టెక్నాలజీ ఆధారిత అంశాలు, మెరుగైన డ్రైవింగ్ అనుభవం కలగలిసిన హ్యాచ్‌బ్యాక్, భారత మార్కెట్‌లో తిరిగి తన స్థానాన్ని బలపరుచుకుంది. హ్యుందాయ్ క్రెటా నెల మొత్తం టాప్ 10 అత్యధికంగా అమ్ముడైన కార్లలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది.

క్రెటా తర్వాతి స్థానాల్లో మారుతి డిజైర్, బ్రెజ్జా, ఎర్టిగా వంటి కార్లు నిలిచాయి. ఈ పోటీ వాతావరణంలో స్విఫ్ట్ తన స్థానం కోల్పోకుండా టాప్ 10లో నిలవడం, దాని నిరంతర ప్రజాదరణకు నిదర్శనం. అది ప్రజలు కోరుకునే వినియోగదారుల అనుభవాన్ని, నమ్మకాన్ని, పనితీరును కలిపి అందిస్తున్న వాహనంగా నిలిచింది. వినియోగదారులకు అవసరయ్యే ఫీచర్స్ డజన్ల కొద్ది ఉన్నాయి. వైర్‌లెస్ మొబైల్ ఛార్జర్, డ్యూయల్ ఛార్జింగ్ పోర్టులు వంటి సదుపాయాలు ఉన్నాయి.
ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని డిజైన్ చేసిన వెనుక AC వెంట్స్ వంటి సదుపాయాలు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేస్తాయి. పార్కింగ్ లేదా రివర్స్ సమయంలో వెనుక కెమెరా ఇందులో భాగంగా ఉంటుంది. 9-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్ వ్యవస్థ, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే మద్దతు ఇవ్వడం ద్వారా ఎంటర్‌టైన్‌మెంట్, కనెక్టివిటీని మరింత బలోపేతం చేస్తుంది. దీని ద్వారా డ్రైవర్‌కు డాష్‌బోర్డ్‌పై నావిగేషన్ ఫంక్షన్లపై ఈజీ నియంత్రణ లభిస్తుంది.

మారుతీ సుజుకీ స్విఫ్ట్ మోడల్‌లో భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ కారులో హిల్ హోల్డ్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP) వంటి ఫీచర్లు ఉన్నాయి. స్విఫ్ట్ ఇప్పుడు అన్ని వెర్షన్లలో 6 ఎయిర్‌బ్యాగులు కలిగి ఉంది, ఇది భద్రతా పరంగా పెద్ద ముందడుగు. క్రూయిజ్ కంట్రోల్, అన్ని సీట్లకు 3-పాయింట్ సీట్‌బెల్ట్‌లు, అత్యవసర పరిస్థితుల్లో సహాయం చేసే బ్రేక్ అసిస్ట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
ఇవి డ్రైవింగ్ పరిస్థితుల్లో ఎలాంటి మార్పులొచ్చినా కారు నియంత్రణను గట్టిగా నిలుపుతాయి. అలాగే, సస్పెన్షన్ సిస్టమ్ వలన ఎలాంటి రోడ్డుపై ప్రయాణించినా ప్రయాణికులకు సాఫీగా ఉండే అనుభవం లభిస్తుంది. యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) మరియు ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD) వలన బ్రేకింగ్ సమయంలో వాహనం అదుపులో ఉండేలా చూసుకుంటాయి. భద్రతకే కాకుండా, డిజైన్ పరంగా కూడా అప్‌డేట్ చేసిన LED ఫాగ్ ల్యాంప్‌లు దాని లుక్‌ను పెంచాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








