కోటి మందికి పైగా కొన్న కారు.. చరిత్ర సృష్టించిన పేద-మిడిల్ క్లాస్ ఫేవరెట్! మీ ఇంట్లో ఉందా ఆ లెజెండ్?
మారుతి సుజుకి స్విఫ్ట్ (Maruti Suzuki Swift) పేరు వినగానే చాలా మంది మధ్యతరగతి కుటుంబాలకు ప్రత్యేకమైన అనుబంధం గుర్తుకు వస్తుంది. కారు కొనాలనుకున్న మొదటి క్షణం నుంచే స్విఫ్ట్ ఒక కలల కారు లాగా నిలుస్తోంది. చిన్న కారు విభాగంలో సరసమైన ధర, స్టైలిష్ డిజైన్, విశ్వసనీయత, మైలేజ్ కలిపి స్విఫ్ట్‌ను ఒక ప్రత్యేక స్థాయికి తీసుకెళ్లాయి. అందుకే 20 ఏళ్లుగా భారతీయ రోడ్లపై ఈ కారు రాజ్యం చేస్తూ వస్తోంది. మార్కెట్లోకి కొత్త కొత్త మోడళ్లు వస్తున్నప్పటికీ, స్విఫ్ట్ ఆకర్షణ మాత్రం ఎప్పటికీ తగ్గలేదు. ఆధునిక ఫీచర్లు, అప్‌డేట్ చేసిన వెర్షన్లు, కొత్త తరం డిజైన్లతో మారుతి సుజుకి ఈ కారును కాలానికి తగ్గట్టు మార్చుకుంటూ వచ్చింది. అదే కారణంగా ఇది వినియోగదారుల హృదయాలను గెలుచుకుని, తరతరాలుగా ఒకే కుటుంబంలో వరుసగా కొనుగోలు అవుతున్న కారు అన్న పేరు సంపాదించుకుంది.
తాజాగా విడుదలైన గణాంకాలు స్విఫ్ట్ డిమాండ్‌ను మరింత బలంగా నిరూపిస్తున్నాయి. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 10 మిలియన్ (ఒక కోటి) యూనిట్లు అమ్ముడవడం ఈ కారు సాధించిన గొప్ప ఘనత. ఇది కేవలం ఒక అమ్మకాల సంఖ్య మాత్రమే కాదు, స్విఫ్ట్ మీద ఉన్న విశ్వాసానికి, ప్రేమకు నిదర్శనం. కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను అనేక దేశాల్లో గెలుచుకోవడం కూడా దీని అంతర్జాతీయ స్థాయిలో విజయాన్ని మరోసారి రుజువు చేస్తోంది.

అందులోనూ, ఈ 10 మిలియన్ యూనిట్లలో 60 శాతం అమ్మకాలు భారతదేశంలోనే జరిగాయి. అంటే, స్విఫ్ట్ కథలో భారత్‌నే ప్రధాన పాత్రధారి. యూరప్‌లో 14 శాతం, జపాన్‌లో 8 శాతం, మిగిలిన 18 శాతం ఇతర ప్రాంతాల్లో అమ్ముడవ్వగా, భారత్ మార్కెట్‌లో స్విఫ్ట్ నిలబెట్టుకున్న ఆధిపత్యం స్పష్టంగా తెలుస్తోంది. రాబోయే రోజుల్లో కూడా ఇది తన స్థానాన్ని నిలబెట్టుకుంటూ, ఇంకా ఎన్నో కొత్త రికార్డులను సృష్టించే అవకాశం ఉందని చెప్పవచ్చు.
స్విఫ్ట్ భారత కార్ల చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయంలా నిలిచింది. 2005లో మొదటి సారి రోడ్డెక్కిన ఈ హ్యాచ్‌బ్యాక్, అప్పటి నుంచి ఇప్పటి వరకు భారతీయ ఆటోమొబైల్ రంగంలో ఒక మైలురాయిగా మారింది. ప్రారంభం నుంచి ఇప్పటివరకు భారత్‌లోనే దాదాపు ఆరు మిలియన్ యూనిట్లు అమ్ముడవ్వడం దీని స్థానానికి నిదర్శనం. కేవలం కొత్త కార్ల మార్కెట్లోనే కాదు, సెకండ్ హ్యాండ్ మార్కెట్‌లో కూడా స్విఫ్ట్‌కు అద్భుతమైన రీసేల్ విలువ ఉంది.

స్విఫ్ట్ నాల్గవ తరం వెర్షన్‌కు వచ్చినప్పటికీ, ఇది ఇప్పటికీ భారతదేశంలో హాట్ కేకుల్లా అమ్ముడవుతోంది. ముఖ్యంగా, కొత్త జెనరేషన్‌లో నాలుగు సిలిండర్ల ఇంజిన్‌ను తొలగించి మూడు సిలిండర్ల ఇంజిన్‌కు మారడం ఒక కీలకమైన మార్పు. ప్రస్తుతానికి, ఈ కార్ LXI, VXI, VXI AMT, VXI(O), VXI(O) AMT వేరియంట్లలో అందుబాటులో ఉంది. ధరలు కూడా అందుబాటులో రూ.6.49 లక్షల నుండి రూ.9.64 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి.
నాల్గవ తరం స్విఫ్ట్ 2024లో అధికారికంగా రోడ్డెక్కినప్పటి నుంచే హ్యాచ్‌బ్యాక్ మార్కెట్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. ఈ మోడల్ డ్రైవింగ్ అనుభవాన్ని మరింత సాఫీగా, రిఫైన్‌డ్‌గా మార్చింది. ఎక్స్‌టీరియర్ డిజైన్ విషయానికి వస్తే,స్విఫ్ట్‌ను పూర్తిగా కొత్తగా తీర్చిదిద్దింది. స్మోక్డ్ LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, గ్లోస్-బ్లాక్ ఫినిషింగ్ కలిగిన గ్రిల్, అలాగే కారు మొత్తం చుట్టూ ఫ్లోయింగ్ ర్యాప్‌అరౌండ్ క్యారెక్టర్ లైన్‌లు దీనికి స్పోర్టీ, ఆధునిక రూపాన్ని అందించాయి.

ఈ కారణంగానే కొత్త స్విఫ్ట్ రోడ్లపై మరింత ఆకర్షణీయంగా, దృష్టిని కట్టిపడేసేలా నిలుస్తోంది. ఇంటీరియర్‌లో స్విఫ్ట్ కాక్‌పిట్ లాంటి లేఅవుట్‌ను కలిగి ఉండటం ప్రత్యేకత. ఫ్లాట్-బాటమ్డ్ స్టీరింగ్ వీల్, ఫంక్షనల్‌గా డిజైన్ చేసిన ఇంటీరియర్ లేఅవుట్ డ్రైవర్‌కు మరింత స్పోర్టీ ఫీల్ ఇస్తాయి. భద్రతా అంశాలలో 6 ఎయిర్‌బ్యాగులు, ESP, హిల్ హోల్డ్ అసిస్ట్, EBDతో ABS, అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్లు వంటి ఫీచర్లు ఇప్పుడు స్టాండర్డ్‌గా లభిస్తున్నాయి.


Click it and Unblock the Notifications








