ఇండియాలో అందరి ఫేవరెట్ కారు.. రూ.6.49 లక్షల ధర.. దేశవ్యాప్తంగా ఎగబడిన జనం.. ఫుల్ డిమాండ్
దేశీయ దిగ్గజ వాహన తయారీ కంపెనీ మారుతీ సుజుకీ (Maruti Suzuki)కి చెందిన ప్రసిద్ధ మోడల్ స్విఫ్ట్ (Swift) ఇండియాలో బాగా డిమాండ్ ఉన్న మోడల్. ఈ కారు చాలా ఏళ్లుగా అమ్మకానికి అందుబాటులో ఉంది. ఇది భారతీయుల ఫేవరెట్ హ్యాచ్‌బ్యాక్. మారుతున్న కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ మార్కెట్లోకి విడుదల అవుతుంది. స్విఫ్ట్‌కు దేశంలో చాలా మంది అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా మధ్య తరగతి వినియోగదారుల కలల కారు. ఢిల్లీ నుంచి మొదలుకుని గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇది కనిపిస్తుంది. చిన్న కుటుంబం కలిగిన కస్టమర్లకు ఇది అత్యంత అనువైన మోడల్. దీని ఆకట్టుకునే డిజైన్, ఫీచర్స్‌తో గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటిగా నిలుస్తుంది.
మారుతీ సుజుకీ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ, స్టైలిష్ డిజైన్, ప్రీమియం ఫీచర్లు, లోపల అనుకూలమైన స్థలం మొదలగు వాటితో మంచి ఫ్యామిలీ కారుగా అందరి చేత ప్రశంసలు అందుకుంటుంది. కస్టమర్ల నుంచి ఈ కారుకు డిమాండ్ అసాధారణంగా ఉండటంతో కంపెనీ సైతం గత ఏడాది అప్‌డేట్ చేసిన స్విఫ్ట్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీంతో ఈ కారుకు డిమాండ్ మరింత పెరిగింది.

తాజాగా మారుతీ నుంచి విడుదలైన నివేదిక ప్రకారం, స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ ఫిబ్రవరి 2025లో ఏకంగా 16,269 అమ్మకాలను నమోదు చేయడం విశేషం. కేవలం ఒక నెలలో భారీ సేల్స్‌ను సాధించడం అంటే మామూలు విషయం కాదు. కొత్త అప్‌డేట్ మోడల్ అమ్మకాలను పెంచడానికి బాగా ఉపయోగపడింది. అదే గత ఏడాది ఇదే నెలలో కారు 13,165 యూనిట్ల అమ్మకాలను సాధించింది. సంవత్సరం ప్రాతిపదికన చూస్తే ఇది 24 శాతం వృద్ధి.
భారతదేశంలో హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో తిరుగులేని గిరాకీ ఉన్న మారుతి స్విఫ్ట్ మరోసారి తన సత్తా చాటింది. ప్రతినెలా కూడా ఈ కారు అమ్మకాలతో దూసుకుపోతుంది. ఫిబ్రవరి నెలలో స్విఫ్ట్ అమ్మకాల సంఖ్య చూస్తుంటే, కొత్త జెనరేషన్ మోడల్‌పై కూడా మంచి హైప్ ఉందని అర్థమవుతోంది. ప్రస్తుతం దేశంలో మారుతీ స్విఫ్ట్‌కి ఉన్న క్రేజ్ చూస్తుంటే, రానున్న నెలల్లో కూడా అమ్మకాల్లో ఇదే జోరు కొనసాగే అవకాశం ఉంది.

ప్రస్తుతం మారుతీ సుజుకీ స్విఫ్ట్ LXI, VXI, VXI()), ZXI, ZXI+ వేరియంట్లలో దేశంలో కొనుగోలుకు అందుబాటులో ఉంది. దీని బేస్ వేరియంట్ ప్రారంభ ధర రూ.6.49 లక్షల నుండి మొదలుకుని టాప్ వేరియంట్ రూ. 9.65 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు ఉంటుంది. ఇది 1.2-లీటర్ 3-సిలిండర్ Z సిరీస్ పెట్రోల్ ఇంజిన్‌తో రన్ అవుతుంది. 80 PS పవర్, 112 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ట్రాన్స్‌మిషన్‌ను ఇంజిన్‌కు జోడించారు. స్విఫ్ట్ కారు లీటరుకు 24.8 నుండి 25.72 కి.మీ. మైలేజీని ఇస్తుంది. మైలేజ్ పరంగా కస్టమర్లు పూర్తిగా సంతృప్తి చెందేలా పనితీరును కనబరుస్తుంది. ఇది 9-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, USB టైప్-ఎ, టైప్-సి పోర్ట్‌లు, 6 ఎయిర్‌బ్యాగులు, ABS (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్), సీట్ బెల్ట్ రిమైండర్ వంటి వాటిని కలిగి ఉంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








