20 ఏళ్లుగా భారతీయ మధ్యతరగతి కుటుంబాలకు బాగా నచ్చిన రూ.6.49 లక్షల కారు.. లక్షల మంది హృదయాల్లో నిలిచిపోయింది

భారతీయ ఆటోమొబైల్ రంగంలో వినియోగదారుల హృదయాలను గెలుచుకున్న హ్యాచ్‌బ్యాక్ కారుల్లో మారుతీ సుజుకీ స్విఫ్ట్ ఒక గుర్తిండిపోయే పేరు. చిన్న కార్ల సెగ్మెంట్‌లో యువతను ఆకట్టుకునే స్పోర్టీ డిజైన్, నమ్మకమైన పెర్ఫార్మెన్స్, మెరుగైన మైలేజీ వంటి అంశాలతో స్విఫ్ట్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకుంది. 2005లో మే నెల చివరిలో భారత రోడ్లపైకి అడుగుపెట్టిన ఈ కారు, అప్పటి నుండి ఇప్పటి వరకు అనేక మార్పులు, చూస్తూ ముందుకు సాగింది. ప్రారంభించిన కొద్ది కాలంలోనే హ్యాచ్‌బ్యాక్ విభాగంలో స్విఫ్ట్ అగ్రస్థానాన్ని సాధించగలిగింది. 2011లో విడుదలైన రెండవ తరం మోడల్‌లో ఇంకా మెరుగైన ఫీచర్లు, మైలేజీతో పాటు, అప్‌డేటెడ్ స్టైలింగ్‌ను తీసుకువచ్చారు. ఆ తర్వాత 2018లో వచ్చిన మూడో తరం మోడల్ మరింత ఆధునికతను చాటుతూ వినియోగదారులకు మరింత ఆకర్షణీయంగా మారింది.

2024లో ప్రవేశపెట్టిన నాల్గవ తరం స్విఫ్ట్ మరింత స్పోర్టీయ్ డిజైన్‌తో, ఇంటీరియర్‌, సేఫ్టీ ఫీచర్లలో గణనీయమైన మెరుగుదలతో వచ్చిన మోడల్. ఇది ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇలా తరాలు మారినా, స్విఫ్ట్‌కి ఉన్న ప్రజాదరణ మాత్రం ఎప్పటికీ తగ్గలేదు. ఇప్పటివరకు దాదాపు 3 మిలియన్లకు పైగా యూనిట్లు అమ్ముడవడం, ఈ కారుకు భారత ప్రజల మధ్య ఉన్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది.

Maruti Suzuki Swift Hatchback 20 Years

2024 జూన్ నెలలో ఈ 3 మిలియన్ మైలురాయిని దాటిన స్విఫ్ట్, ఇప్పుడు 21వ సంవత్సరంలోకి ప్రవేశిస్తోంది. సాధారణంగా హ్యాచ్‌బ్యాక్ కార్లు తక్కువ కాలమే ట్రెండ్‌గా ఉండే పరిస్థితుల్లో, రెండు దశాబ్దాలు పాటు సక్సెస్ ఫుల్‌గా తన ప్రయాణాన్ని కొనసాగించింది. మారుతీ సుజుకీ స్విఫ్ట్ భారతీయ కార్ మార్కెట్లో తన పునాది స్థిరంగా నిలిపిన హ్యాచ్‌బ్యాక్. ఇటీవల కాలంలో కూడా దీనికి ఉన్న ఆదరణ ఏమాత్రం తగ్గలేదు.

వచ్చే కొద్ది నెలలలోనే మరో 1.50 లక్షల యూనిట్లు అమ్ముడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది స్విఫ్ట్ మీద భారతీయ వినియోగదారుల నమ్మకం ఎంత దృఢంగా ఉందో స్పష్టంగా తెలియజేస్తోంది. స్విఫ్ట్ ఆకర్షణీయమైన డిజైన్, శక్తివంతమైన పనితీరు, నమ్మదగిన మైలేజీతో పాటు అందుబాటు ధరలోనూ అందుబాటులో ఉండటంతోనే ఇది భారతీయ వినియోగదారులకు ఎంతో చేరువైంది. ఈ హ్యాచ్‌బ్యాక్‌కి సంబంధించి మరొక ప్రధాన ఆకర్షణ విషయమే దాని ధర.

Maruti Suzuki Swift Hatchback Sales

దీని ప్రారంభ వేరియంట్ కేవలం రూ.6.49 లక్షలకే (ఎక్స్-షోరూమ్) లభించగా, టాప్ వేరియంట్ ధర కూడా రూ.9.49 లక్షలకే ఉంది. ఇది స్మార్ట్ ఫీచర్లు, భద్రతా ప్రమాణాలు, మైలేజీ పరంగా అత్యంత విలువైన ఎంపికగా మారుతోంది. ఇక పెట్రోల్ వేరియంట్‌ విషయానికి వస్తే, మాన్యువల్ గేర్‌బాక్స్ ఉన్న మోడల్ 24.80 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుండగా, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉన్న మోడల్ మరింత 25.75 కిలోమీటర్ల మైలేజీని అందిస్తోంది.

దీంతో, నగరాలలో వాహనం నడిపే వారికి ఆటోమేటిక్ వేరియంట్ మంచి సౌలభ్యం కలిగిస్తోంది. అయితే, మైలేజీ విషయంలో ఆలోచించే వారికైతే, స్విఫ్ట్ CNG వేరియంట్ మరింత సరైన ఎంపికగా నిలుస్తుంది. మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభ్యమయ్యే ఈ వేరియంట్ ఒక్కో కిలో గ్రామ్ CNGతో సగటున 32.85 కిలోమీటర్ల మేర ప్రయాణించగలదు. ఇది ఈ సెగ్మెంట్‌లో అత్యుత్తమ మైలేజీ రేటింగ్‌లలో ఒకటిగా చెప్పవచ్చు.

Maruti Suzuki Swift Hatchback 3 Million Sales

ఈ కారులో అందించే సేఫ్టీ అంశాలు కూడా దీని డిమాండ్ ఇన్నాళ్లు కొనసాగడానికి ఒక కారణం. ప్రస్తుతం లభిస్తున్న అన్ని వేరియంట్లలోనూ 6 ఎయిర్‌బ్యాగ్‌లు ప్రామాణికంగా అందిస్తుండటం అనేది ఈ సెగ్మెంట్‌లో ఒక గొప్ప విషయంలో చెప్పాలి. ముందు వరుసలోనే కాకుండా వెనుక సీట్లకూ మూడు పాయింట్ల సీటుబెల్ట్‌లు ఉండడం, సీట్‌బెల్ట్ రిమైండర్ల వంటి చిన్నచిన్న ఫీచర్లు కూడా ప్రయాణికుల భద్రత పట్ల కంపెనీ చూపిస్తున్న శ్రద్ధను తెలియజేస్తాయి.

అంతేకాదు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, ABSతో కూడిన EBD, హిల్ హోల్డ్ అసిస్టెంట్ వంటి అత్యాధునిక భద్రతా వ్యవస్థలు కూడా అందులో భాగమవుతాయి. ఇవి డ్రైవింగ్ అనుభూతిని మరింత నమ్మకమైనదిగా మార్చుతాయి. అందులోనూ, స్విఫ్ట్‌ను పర్సనల్ స్టైల్‌కు అనుగుణంగా మార్చుకోవడానికి 10 కలర్ ఆప్షన్లు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Saturday, June 21, 2025, 7:20 [IST]
English summary
Maruti suzuki swift hatchback celebrates 20th anniversary more details inside
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+