కేవలం 31 రోజుల్లోనే 30 వేల మంది కొన్న కారు ఇదే.. 33 కి.మీల మైలేజ్ ఇస్తుంది.. ధర రూ.6.49 లక్షలు..
ఇండియాలో వాహన పరిశ్రమలో అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ప్రతి ఏడాది అత్యధికంగా కార్లను ఉత్పత్తి చేస్తూ, ఎక్కువ అమ్మకాలను సాధిస్తూ దేశంలోనే అందరి ఫేవరెట్ కంపెనీగా ఉంది. ఇతర కంపెనీలకు ఎప్పుడు గట్టి పోటీని ఇస్తూ అదిరిపోయే కొత్త మోడళ్లను విడుదల చేస్తుంది. మారుతీ సుజుకి ప్రధానంగా మధ్యతరగతి వినియోగదారులకు ఎక్కువగా టార్గెట్ చేస్తుంది. వారు కొనగలిగే విధంగా అందుబాటులో ధరలోనే వాహనాలను లాంచ్ చేస్తుంది. పైగా వీటిలో డజన్ల కొద్ది ఫీచర్లు ఉంటాయి.అందుకే ఈ కంపెనీ కార్లకు ఇండియాలో విపరీతమైన ఆదరణ ఉంటుంది. ప్రతి నెలా కూడా అమ్మకాల పరంగా ఇతర కంపెనీల కంటే ముందు స్థానంలో ఉంటుంది. తాజాగా ముగిసిన 2024 ఏడాదిలో కూడా మారుతీ ఇండియాలో అత్యధికంగా కార్లను విక్రయించిన జాబితాలో మొదటి స్థానంలో ఉంది. ఇదిలా ఉంటే డిసెంబర్ నెలలో మారుతీ కారు రికార్డు స్థాయిలో అమ్ముడుపోయింది.
ఈ మోడల్ పేరు మారుతీ సుజుకీ స్విఫ్ట్ (Maruti Suzuki Swift). దీన్ని డిసెంబర్ నెలలో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కొనుగోలు చేశారు. తాజాగా విడుదల అయిన డేటా ప్రకారం, 2024 డిసెంబర్‌లో స్విఫ్ట్‌ను దాదాపు 30,000 మంది కొన్నారు. ఒక్క నెలలో ఇన్ని సేల్స్ సాధించడం అంటే సాధారణ విషయం కాదు. ఇది మారుతీ కంపెనీ డిమాండ్‌ను ప్రతిబింబిస్తుంది. దీనిపై మార్కెట్ వర్గాలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.

దేశీయ మార్కెట్లో కొనుగోలుకు అందుబాటులో ఉన్న మారుతీ సుజుకీ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ ప్రస్తుతం రూ.6.49 లక్షల ప్రారంభ ధరకు అందుబాటులో ఉంది. టాప్ వేరియంట్ మాత్రం రూ.9.60 లక్షలకు లభిస్తుంది. ఇవి ఎక్స్ షోరూమ్ ధరలు. ఇది 1.2-లీటర్ 3-సిలిండర్ పెట్రోల్, CNG ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. CNG వేరియంట్ ధర రూ.8.20 లక్షల నుంచి మొదలవుతుంది. స్విఫ్ట్ కారు మొత్తం ఐదు వేరియంట్లలో లభిస్తుంది.
ఈ కారులో 5 మంది కలిసి ప్రయాణించవచ్చు. గేర్‌బాక్స్ విషయానికి వస్తే, 5-స్పీడ్ మాన్యువల్ అలాగే, 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఉన్నాయి. మధ్యతరగతి వినియోగదారులకు అందుబాటు ధరలో లభించడంతో పాటు మైలేజ్ కూడా బాగానే వస్తుంది. పెట్రోల్ మోడల్‌లో మాన్యువల్ గేర్‌బాక్స్‌లో 24.80 కి.మీల మైలేజ్ ఇస్తుంది, అదే ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో 25.75 కి.మీలు, చివరగా cng ఆప్షన్‌లో 32.85 కి.మీల వరకు మైలేజ్ అందిస్తుంది.

మారుతీ సుజుకీ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌లో డజన్ల కొద్ది ఫీచర్స్ ఉన్నాయి. లోపల ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, -అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జర్, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ప్రయాణంలో ఎంటర్‌టైన్ మెంట్ కోసం ఆర్కామిస్ ట్యూన్డ్ సౌండ్ సిస్టమ్, ఆటో క్లైమేట్ కంట్రోల్ వంటి ప్రధాన ఫీచర్లను అందించారు. అలాగే, లాంగ్ జర్నీ చేయడానికి ఎక్కువ సామాన్లు పెట్టడానికి 265 లీటర్ల బూట్ స్పేస్ కూడా ఉంది.
ఇదిలా ఉంటే మారుతీ సుజుకీ 2024 ఏడాది డిసెంబర్ నెలలో 2,52,693 యూనిట్ల కార్లను విక్రయించింది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే సేల్స్ బాగా పెరిగాయి. ముఖ్యమైన విషయం ఏమిటంటే కంపెనీ సేల్స్ డిసెంబర్‌లో ఎన్నడూ లేని విధంగా 2.50 లక్షల యూనిట్లు దాటి సరికొత్త రికార్డును సాధించింది. గత ఏడాది 2023లో మొత్తం అమ్మకాలు 2.30 లక్షల యూనిట్లుగా ఉన్నాయి.

2024 డిసెంబర్ నెలలోనే కాకుండా మొత్తంగా 2024 ఏడాదిలో మారుతీ సుజుకీ అమ్మకాల పరంగా ఇండియాలోనే మొదటి స్థానంలో నిలిచింది. లెక్కల ప్రకారం, మారుతీ 17,90,977 కార్లను విక్రయాలను నమోదు చేసి భారతీయ వాహన పరిశ్రమలో అన్ని కంపెనీల కంటే కూడా టాప్ ప్లేస్‌లో ఉంది.


Click it and Unblock the Notifications








