మీ బడ్జెట్‌లో బెస్ట్ మైలేజ్ కార్! పెట్రోల్ ధరలు పెరిగినా టెన్షన్ లేదు! ఈ 5-సీటర్ మోడల్ బెస్ట్ ఆప్షన్!
భారతీయ వాహన మార్కెట్‌లో హ్యాచ్‌బ్యాక్‌ల డిమాండ్ ఎప్పుడూ ఎక్కువగా ఉంటుంది. ప్రత్యేకించి, బడ్జెట్‌లో లభించి, అధిక మైలేజీ, స్టైలిష్ డిజైన్, లేటెస్ట్ ఫీచర్‌లు కలిగి ఉండే వాటిని దేశీయంగా ప్రజలు ఎగబడి మరి కొనుగోలు చేస్తుంటారు. ప్రస్తుతం మార్కెట్లో ఇలాంటివి చాలా మోడళ్లు ఉన్నాయి. వాటిలో ప్రసిద్ధి వాహన తయారీ కంపెనీకి చెందినటువంటి మారుతీ సుజుకీ (maruti suzuki)కి చెందిన స్విఫ్ట్ (swift) భారతదేశంలో అత్యంత విజయవంతమైన హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటిగా ఉంది. ఇది పేద-మధ్యతరగతి వినియోగదారుల కోసం తక్కువ ధరలో కొనుగోలు చేయడానికి లభిస్తూ, మెరుగైన మైలేజ్ అందిస్తుంది. ఇది గత 20 సంవత్సరాలుగా దేశీయ మార్కెట్లో పెద్ద సంఖ్యలో అమ్ముడవుతోంది.
మంచి మైలేజ్, స్టైలిష్ లుక్, మంచి పనితీరుతో కూడిన కొత్త కారు కొనాలని చూస్తున్న వారికి మారుతీ స్విఫ్ట్ బెస్ట్ ఎంపిక. ఈ కారు ఇప్పటి వరకు దాదాపు 30 లక్షలకు పైగా యూనిట్‌ల అమ్మకాలను సాధించడం విశేషం. రెండు దశాబ్దాల క్రితం మార్కెట్లో లాంచ్ అయినప్పటికి మారుతున్న కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు ప్రజలను ఆకట్టుకోవడానికి కొత్త కొత్త ఫీచర్స్‌తో అప్‌డేట్ అవుతూనే ఉంది.

అందుకే, మార్కెట్లోకి స్విఫ్ట్ కారుకు పోటీగా ఎన్నో అదిరిపోయే మోడళ్లు విడుదలైనప్పటికి కూడా ఈ కారు మాత్రం తన విజయపరంపరను కొనసాగిస్తూనే ఉంది. ఈ కారు ప్రధానంగా రూ.10 లక్షల లోపు ధరలో లభించడం వలన కూడా కస్టమర్లను ఎక్కువగా ఆకర్షించడానికి ముఖ్య కారణంగా చెప్పవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో కొనుగోలుకు అందుబాటులో ఉన్న కొత్త స్విఫ్ట్ కారు ప్రారంభ ధర రూ.6.49 లక్షలుగా ఉంది.
అదే దీని టాప్ ఎండ్ వేరియంట్ విషయానికి వస్తే, రూ. 9.64 లక్షలుగా ఉంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇవన్నీ కూడా ఎక్స్ షోరూమ్ ధరలు. అదే ఆన్‌రోడ్ అయితే పన్నులతో కలిపి నగరాలను బట్టి ధరలో మార్పు ఉంటుంది. ఈ కారు ముఖ్యంగా LXI, VXI, VXI (O), ZXI వంటి వివిధ వేరియంట్లలో కూడా లభిస్తుంది. దీని ఎక్స్‌టీరియర్ డిజైన్ అట్రాక్టివ్‌గా ఉంటుంది.

రాత్రి డ్రైవింగ్‌కు మంచి వెలుతురు అందించడానికి ముందు భాగంలో LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు ఉన్నాయి. స్పోర్టీ లుక్, బెటర్ విజిబిలిటీ కలిగిన LED DRLలు, వెనుక నుంచి కూడా అద్భుతమైన లుక్ కోసం LED టెయిల్‌లైట్లు, 15-అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ వంటి వాటితో ఇది ఆకర్షణీయంగా కనిపిస్తుంది. స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ రెండు పవర్‌ట్రెయిన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌లో లభిస్తుంది.
ఈ ఇంజిన్ ఇది 82 PS హార్స్‌పవర్, 112 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌ను జోడించారు. అలాగే ఇది CNG ఆప్షన్‌లో కూడా లభిస్తుంది. ఇది 1.2-లీటర్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఈ ఆప్షన్‌లో 70 PS హార్స్‌పవర్, 102 Nm గరిష్ట టార్కును ఉత్పత్తి చేస్తుంది. అయితే ఇది మాత్రం 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తుంది.

ముఖ్యంగా ఈ కారు మైలేజ్ విషయానికి వస్తే, ఇది పెట్రోల్ మాన్యువల్ (గేర్‌బాక్స్)లో లీటర్‌కు దాదాపు 24.8 కి.మీల వరకు మైలేజ్ అందిస్తుంది. అదే పెట్రోల్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో 25.75 kmpl మైలేజీని అందిస్తుంది. అలాగే, CNG మాన్యువల్ వేరియంట్ విషయానికి వస్తే, ఇది కిలో ఇంధనానికి 32.85 కిమీ వరకు మైలేజీని ఇస్తుంది. మైలేజ్ ఎక్కువ కావాలనుకునే వారికి మారుతీ స్విఫ్ట్ కారు బెస్ట్ ఎంపికగా ఉంది.


Click it and Unblock the Notifications








