దేశంలో జనాలు ఎక్కువగా కొంటున్న కారు.. రూ.6 లక్షలకే 32.85 కి.మీ మైలేజ్.. దీనికి ఫుల్ డిమాండ్!
మారుతి సుజుకి స్విఫ్ట్ (maruti suzuki swift) ఇది కేవలం ఒక కార్ కాదు, ఎన్నో కుటుంబాలకు బాగా నమ్మకమైన మోడల్. ఇండియాలో ఎన్నో ఏళ్లుగా ప్రజల అభిమానాన్ని సంపాదించుకుంది. పేద, మధ్యతరగతి వాళ్లు కొనగలిగే విధంగా అందుబాటు ధరలో, మంచి మైలేజ్ సామర్థ్యంతో అందరి గుండెల్లో స్థానం సంపాదించింది. ఇదిలా ఉంటే మారుతి తాజాగా తన కార్ల జాబితా విడుదల చేసింది. దీని ప్రకారం, ఇటీవల భారతదేశంలోని అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్ల జాబితాలో స్విఫ్ట్ (Swift) ఐదో స్థానాన్ని దక్కించుకుంది. జూన్ 2025లో ఈ కారు దాదాపు 13,275 యూనిట్లు అమ్ముడుపోయింది. దీన్ని బట్టి మార్కెట్లోకి ఎన్ని కొత్త మోడళ్లు వస్తున్నప్పటికి దీనికి డిమాండ్ ఏమాత్రం తగ్గలేదని తెలుస్తుంది.
ఇక, ఈ జాబితాలో మొదటి నాలుగు స్థానాల్లో ఉన్న మోడళ్ల గురించి చూసినట్లయితే,హ్యుందాయ్ క్రెటా 15,786 యూనిట్లతో మొదటి స్థానంలో నిలిచింది. మారుతి సుజుకి డిజైర్ 15,484 యూనిట్లతో రెండో స్థానంలో, బ్రెజ్జా 14,507 యూనిట్లతో మూడో స్థానంలో, ఎర్టిగా 14,151 యూనిట్లతో నాలుగో స్థానంలో నిలిచాయి. జూన్‌లో అమ్ముడైన కార్లలో ఎక్కువగా మారుతి కంపెనీవే ఉన్నాయి. స్విఫ్ట్ కారు వీటి సరసన చేరడం విశేషం.

ఇక స్విఫ్ట్ ఈ సంవత్సరం సేల్స్ పరంగా మరింత ప్రత్యేకంగా ఉంది. జనవరి నుండి మే వరకు ప్రతీ నెలలో వాణిజ్య రికార్డులు నమోదు చేసింది. జనవరిలో 17,081 యూనిట్లు అమ్ముడవ్వగా, ఫిబ్రవరిలో ఈ సంఖ్య 16,269కు చేరింది. మార్చిలో మరింత పెరిగి 17,746 యూనిట్ల వరకు వెళ్లింది. ఏప్రిల్‌లోనూ 14,592 యూనిట్లు విక్రయమయ్యాయి. మే నెలలోనూ 14,135 యూనిట్లు అమ్మకాలు కొనసాగించడం దీని నిలకడైన డిమాండ్‌ను రుజువు చేస్తుంది.
సులభంగా అందుబాటులో ఉండే ధర, ఆకర్షణీయమైన డిజైన్, భరోసా కలిగించే బ్రాండ్ ఇమేజ్ ఇవన్నీ కూడా స్విఫ్ట్ కారు ఆదరణను పెంచుతున్నాయి. ప్రతి తరం కస్టమర్లకు ఇది ఒకే విధమైన ఆనందాన్ని అందిస్తూ, హ్యాచ్‌బ్యాక్ విభాగంలో తన సత్తా చాటుతోంది. మార్కెట్లో ఎన్ని కార్లు ఉన్నప్పటికి కూడా రాబోయే రోజుల్లోనూ ఇది తన విజయవంతమైన అమ్మకాలను కొనసాగిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

మారుతి సుజుకి స్విఫ్ట్ గురించి మాట్లాడితే, ఇది నిజానికి బడ్జెట్ వినియోగదారుల కలను నిజం చేసిన హ్యాచ్‌బ్యాక్. ధర విషయానికి వస్తే, కొత్త స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ ఎక్స్-షోరూమ్ ధరలు సుమారుగా రూ.6.49 లక్షల నుండి ప్రారంభమై రూ.9.64 లక్షల వరకు ఉంటాయి. కస్టమర్లకు అవసరాల మేరకు ఎన్నుకోవడానికి ఐదు వేరియంట్లలో LXI, VXI, VXI (O), ZXI, ZXI ప్లస్‌లో లభిస్తుంది.
పవర్‌ట్రెయిన్ పరంగా కూడా ఈ కొత్త స్విఫ్ట్ అత్యుత్తమంగా ఉంది. 1.2-లీటర్ పెట్రోల్, CNG ఇంజిన్ ఆప్షన్లను అందిస్తోంది. డ్రైవింగ్ ప్రిఫరెన్స్ ఆధారంగా వేరియంట్లలో 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ లభిస్తుంది. ఇంకా ప్రత్యేకత ఏమిటంటే, దీని మైలేజీ. పెట్రోల్ వేరియంట్లకు 24.80 kmpl వరకు, CNG వేరియంట్లకు 32.85 km/kg వరకు మైలేజీ లభిస్తుంది. ఇది రోజువారి ప్రయాణాలకు బాగా సరిపోద్ది.

స్విఫ్ట్ గురించి చెప్పాలంటే, ఇది కేవలం ఒక హ్యాచ్‌బ్యాక్ మాత్రమే కాదు టెక్నాలజీ, భద్రత అన్నింటినీ కలిగిన మోడల్. ఈ కారులో ఐదు సీట్లు లభ్యమవుతాయి. అందువల్ల కుటుంబ సభ్యులు సౌకర్యవంతంగా కూర్చుని, ఎటు వెళ్లినా సులువుగా ప్రయాణించవచ్చు. అంతేకాక, అందుబాటులో ఉన్న ఫీచర్లు కూడా కార్ స్థాయి మరో స్థాయికి తీసుకెళ్తాయి. 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటు ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ అందుబాటులో ఉంటుంది.
సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ద్వారా అన్ని డ్రైవింగ్ సమాచారాన్ని క్లియర్‌గా తెలుసుకోవచ్చు. ఆటో క్లైమేట్ కంట్రోల్‌తో వాతావరణం ఎల్లప్పుడూ ఆహ్లాదంగా ఉంటుంది. USB టైప్-సి పోర్ట్, వైర్‌లెస్ ఛార్జర్,భద్రత పరంగా కూడా 6 ఎయిర్‌బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS), ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD), ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ (TCS) వంటి సాంకేతిక భద్రతా ఫీచర్లు డ్రైవింగ్‌లో రక్షణ కల్పిస్తాయి.


Click it and Unblock the Notifications








