బైక్ లాగా 33 కి.మీ మైలేజ్ ఇచ్చే కారు.. రూ.5.79 లక్షలు.. పేద-మధ్యతరగతి ప్రజలకు పెర్ఫెక్ట్ మోడల్

మారుతి సుజుకి స్విఫ్ట్ (Maruti Suzuki Swift) భారతీయ కార్ల మార్కెట్లో ఎన్నో సంవత్సరాలుగా తన ప్రత్యేకస్థానాన్ని నిలబెట్టుకున్న హ్యాచ్‌బ్యాక్. స్టైలిష్ లుక్, నమ్మకమైన పనితీరు, నగర డ్రైవింగ్ అనుభవం కారణంగా స్విఫ్ట్ ఎప్పుడూ ఫేవరేట్ కారు గానే ఉంటుంది. ప్రస్తుతం కొత్త కారు కొనాలనుకునే వాళ్లలో కూడా ఈ మోడల్‌పై ఆసక్తి తగ్గలేదు. కుటుంబ అవసరాలు, వ్యక్తిగత డ్రైవింగ్ అవసరాలు ఏవైనా సరే, స్విఫ్ట్ అద్భుతంగా సరిపోతుంది. ఈ కారు ధర పరంగా కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. కనీస ధర రూ. 5.79 లక్షలు ఉండగా, టాప్ వేరియంట్ రూ. 8.80 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో లభిస్తుంది.

ఈ ప్రైస్ రేంజ్, సామాన్య కుటుంబాలు, యువత అంతా కూడా సులభంగా కొనగలిగేలా ఉండటం ఒక ప్లస్ పాయింట్. అందుకే స్విఫ్ట్ మార్కెట్లో నిరంతరం డిమాండ్‌ను కొనసాగిస్తూ ఉంది. వేరియంట్ల ఎంపిక విషయంలో కూడా మారుతి మంచి అవకాశాలు అందిస్తోంది. LXI, VXI, ZXI, ZXI ప్లస్ వేరియంట్లలో లభించడం వల్ల కొనుగోలుదారులు తమ బడ్జెట్, ఫీచర్ అవసరాలను బట్టి సరైన మోడల్‌ను ఎంచుకోవచ్చు.

Maruti Suzuki Swift Hatchback Price Milegae

ప్రతి వేరియంట్ డిజైన్, పనితీరులో సింపుల్‌గా కనిపించినా, వినియోగదారుల అవసరాలను అందించేలా రూపొందించబడింది. కొత్త స్విఫ్ట్‌లో 5 సీట్లు ఉండటం వల్ల ప్రయాణికులందరికీ సౌకర్యవంతమైన రైడింగ్ అనుభవం లభిస్తుంది. లోపలి స్పేస్ కారులో కూర్చున్న ప్రతి ఒక్కరికీ ఆహ్లాదకరంగా ఉండేలా డిజైన్ చేయబడింది. దీనికి తోడు, ఈ కారులో అమర్చిన పవర్‌ట్రెయిన్ కూడా చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఇంజిన్ మంచి స్మూత్ డ్రైవింగ్‌ను అందిస్తుంది.

ఈ మోడల్‌లో ఉన్న 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ 82 bhp పవర్‌ను, 112 Nm పీక్ టార్క్‌ను అందిస్తుంది. ఈ ఇంజిన్ పనితీరు నగర డ్రైవింగ్‌, హైవే డ్రైవింగ్‌ అయినా మంచి స్పందనను ఇస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. అలాగే మైలేజీ పరంగా కూడా ఈ వేరియంట్ 24.80 kmpl నుండి 25.75 kmpl వరకు ఇంధన సామర్థ్యాన్ని చూపుతుంది.

Maruti Suzuki Swift Hatchback Price Milegae

ఇంకో ముఖ్యమైన ఆప్షన్‌గా 1.2-లీటర్ పెట్రోల్ + CNG ఇంజిన్ అందుబాటులో ఉంది. ఇది 70 bhp పవర్‌ను, 102 Nm టార్క్‌ను 32.85 కి.మీ మైలేజీని ఇస్తుంది. సిటీ డ్రైవింగ్‌ల్ ఇంజిన్ స్మూత్‌గా, కంఫర్టబుల్‌గా పనిచేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే జతచేయబడుతుంది. భద్రత విషయానికి వస్తే, డ్రైవర్ నుంచి వెనుక సీట్లలో కూర్చున్న వారివరకు అందరి భద్రతను దృష్టిలో పెట్టుకుని ఆధునిక ఫీచర్లు ఇందులో అమర్చబడ్డాయి.

ముందుగా, 6 ఎయిర్‌బ్యాగులు అన్ని వైపులా సురక్షిత కవచం లాగా పనిచేస్తూ ప్రమాదాల సమయంలో గాయాల తీవ్రతను తగ్గిస్తాయి. బ్రేకింగ్ విషయంలో ABS (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), EBD (ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్) కలిసి పనిచేస్తూ అత్యవసర పరిస్థితుల్లో కారు నియంత్రణను సులభం చేస్తాయి. అదేవిధంగా, రోడ్డు పరిస్థితులు మారినా, వేగం పెరిగినా TCS, ESP వాహనానికి స్థిరత్వాన్ని ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

Maruti Suzuki Swift Hatchback Price Milegae

ఎత్తైన రోడ్లపై ఆగిన తర్వాత మళ్లీ కదిలే సందర్భాల్లో హిల్-హోల్డ్ అసిస్ట్ బాగా ఉపయోగపడుతుంది. ప్రతి సీటు వద్ద ఉన్న 3-పాయింట్ సీట్‌బెల్ట్‌లు ప్రయాణికులు సురక్షితంగా కూర్చొని ఉండేలా చేస్తాయి. కారులోకి అడుగుపెట్టగానే కనిపించే క్యాబిన్ డిజైన్ పూర్తిగా ఆధునికతను ప్రతిబింబిస్తుంది. మెరుగైన మెటీరియల్స్‌తో రూపొందించిన డాష్‌బోర్డ్ దృష్టిని ఆకర్షించేలా ఉండి, ప్రయాణికులకు ప్రీమియం అనుభూతిని ఇస్తుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, November 12, 2025, 16:33 [IST]
English summary
Maruti suzuki swift hatchback price milegae and all top things details check here
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+