20 ఏళ్లుగా దేశంలోనే అందరి ఫేవరెట్ కారు.. 33 కి.మీ మైలేజ్ ఇస్తుంది.. ఇప్పటికి డిమాండ్ ఏ మాత్రం తగ్గలే!
దాదాపు రెండు దశాబ్దాల క్రితం భారతదేశంలో విడుదలై ఇప్పటికి కూడా దేశంలో డిమాండ్ తగ్గని కారు అంటే మొదటగా గుర్తుకువచ్చేది మారుతీ సుజుకీకి(Maruti Suzuki) చెందిన హ్యాచ్‌బ్యాక్ కారు స్విఫ్ట్ (Swift) మాత్రమే. దాదాపు 20 సంవత్సరాల నుంచి కూడా ఈ కారును జనాలు ఆదరిస్తున్నారు. మార్కెట్లోకి ఎన్నో కొత్త మోడళ్లు వచ్చినప్పటికి మారుతీ స్విఫ్ట్‌కు మాత్రం ఇంకా ఆదరణ తగ్గలేదు. తాజాగా కంపెనీ ఈ హ్యాచ్‌బ్యాక్ అమ్మకాల వివరాలను వెల్లడించింది.మారుతీ సుజుకీ నుంచి వచ్చిన డేటా ప్రకారం, 2025 జనవరిలో స్విఫ్ట్‌ను దాదాపు 17,081 మంది కొనుగోలు చేశారు. ఇతర కంపెనీల నుంచి చాలా అధునాతన కార్లు కొనుగోలుకు అందుబాటులో ఉన్నప్పటికీ కూడా జనాలు ఇన్నేళ్లుగా ఈ కారును కొనుగోలు చేస్తూనే ఉండటం విశేషం. మిగతా హ్యాచ్‌బ్యాక్ మోడళ్లకు స్విఫ్ట్ బలమైన ప్రత్యర్థిగా ఉంది.
గత ఏడాది 2024 జనవరి నెలలో ఈ కారు 15,370 యూనిట్ల విక్రయాలను మాత్రమే నమోదు చేసింది. ఏడాది ప్రాతిపదికన చూసినట్లయితే ఇది దాదాపు 11 శాతం వృద్ధిని సాధించింది. 2025 జనవరిలో ఇండియాలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్ల లిస్ట్‌లో మారుతీ సుజుకీ స్విఫ్ట్ నాల్గవ స్థానం పొందింది. 20 ఏళ్లుగా స్విఫ్ట్ ఎప్పటికప్పుడు కాలానికి అనుగుణంగా అప్‌డేట్ అవుతూ మార్కెట్లోకి విడుదల అవుతుంది.

మారుతీ సుజుకీ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ దేశంలో 2005 నుండి అమ్మకానికి అందుబాటులో ఉంది. సాధారణంగా భారత్‌లో చిన్న కుటుంబాలకు సరిపోయే కార్లను డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి తరుణంలో మారుతీ స్విఫ్ట్ కారును విడుదల చేసి సరికొత్త సంచలనానికి తెరలేపింది. ఇది మార్కెట్లోకి వచ్చిన తక్కువ వ్యవధిలోనే ఢిల్లీ నుంచి గల్లీ వరకు చేరుకుంది. దీని ఆకట్టుకునే రూపం, ఫీచర్స్ కారణంగా ఇప్పటికి కూడా డిమాండ్ తగ్గని మోడల్‌గా ఉంది.
అందుకే 2025 జనవరి నెలలో కూడా టాప్ 10 కార్ల జాబితాలో 4వ స్థానం పొందింది. దీనికి ముందు ఈ లిస్ట్‌లో మారుతీ సుజుకీ వ్యాగన్ ఆర్, మారుతీ సుజుకీ బాలెనో, హ్యుందాయ్ క్రెటా కార్లు ఉన్నాయి. ఇక స్విఫ్ట్ విషయానికి వస్తే, ట్రెండ్‌కు అనుగుణంగా కంపెనీ దీనిలో మార్పులు చేస్తూనే ఉంది. ఇటీవల కంపెనీ 2024 మధ్యలో అప్‌డేట్ చేసిన కొత్త తరం స్విఫ్ట్‌ను విడుదల చేసింది.

ఈ కొత్త తరం స్విఫ్ట్‌తో మార్కెట్లో దీని అమ్మకాలు పెంచడానికి దోహదం చేసినట్లయింది. 2 దశాబ్దాల తర్వాత కూడా స్విఫ్ట్ తన విజయపరంపరను కొనసాగించడంపై మారుతీ సుజుకీ ఉన్నతాధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం భారతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ ప్రారంభ ధర రూ. 6.49 లక్షలుగా ఉంది. అయితే ఇది ఎంట్రీ లెవల్ Lxi వేరియంట్ ధర.
దీనిలో టాప్ వేరియంట్ Zxi+ AGS ధర రూ. 9.49 లక్షలు. ఇవన్నీ కూడా ఎక్స్‌షోరూమ్ ధరలు. మారుతీ సుజుకీ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ అన్ని వేరియంట్లు కూడా అధునాతన ఫీచర్స్‌ను కలిగి ఉన్నాయి. అన్నింటిలో కూడా 6 ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్ట్‌గా ఉన్నాయి. దీని Cng వేరియంట్ మైలేజ్ దాదాపు కిలో ఇంధనానికి 2.85 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








