రూ.6 లక్షల్లో 32.85 కి.మీ మైలేజ్ ఇచ్చే కారుకు ఏమైంది? ఇంత మంచి మోడల్‌ను కొనడానికి ఎవరు ముందుకు రావట్లేదు!
మారుతీ సుజుకీ స్విఫ్ట్ (maruti suzuki swift) భారత కార్ల ప్రపంచంలో ఓ గుర్తుంచుకునే పేరు. ఏటా మారుతున్న ట్రెండ్‌లకు తగ్గట్టుగా మార్పులు చెందుతూ, దశాబ్దాలుగా మధ్యతరగతి వినియోగదారుల నమ్మకాన్ని చూరగొన్న ఈ హ్యాచ్‌బ్యాక్, స్టైలిష్ డిజైన్, నమ్మదగిన ఇంజిన్ పనితీరు, తక్కువ నిర్వహణ ఖర్చుతో భారతీయుల ఫేవరెట్ కారుగా అవతరించింది. అయితే గత కొన్ని నెలలుగా దీని అమ్మకాల్లో మందగమనం కనిపిస్తోంది. ఈ ట్రెండ్ మే 2025లోనూ కొనసాగింది. ఈ నెలలో మారుతీ సుజుకీ 14,135 యూనిట్ల స్విఫ్ట్‌లను విక్రయించింది. గత సంవత్సరం ఇదే నెలలో విక్రయించిన 19,393 యూనిట్లతో పోల్చితే, ఇది 27 శాతం క్షీణతను సూచిస్తోంది. అయితే, ఈ సంఖ్య తగ్గినప్పటికీ, స్విఫ్ట్ తన స్థిరతను కోల్పోలేదు.
మే నెల టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్ల జాబితాలో ఇది ఆరవ స్థానాన్ని దక్కించుకుంది. అంటే ఇప్పటికీ అది మార్కెట్‌లో పోటీకి సిద్ధంగా ఉంది అనే అర్థం. ఈ క్షీణతకు పలు కారణాలు ఉండొచ్చు, కొత్త మోడళ్ల ప్రవేశం, SUVల పెరుగుతున్న డిమాండ్, లేదా వినియోగదారుల అభిరుచుల మార్పు. అయినా, స్విఫ్ట్ వంటి వాహనం సాధారణమైన హ్యాచ్‌బ్యాక్ కాదు; ఇది "పర్సనల్ స్టైల్‌కి ముడిపడ్డ ఫ్యామిలీ ఎంపిక."

దీని పేరు వినగానే చాలా మందికి మొదటి కారు జ్ఞాపకాలు గుర్తొస్తాయి. క్షీణత వెనుక ఉన్న కారణాలు అనేకం. ప్రస్తుత మార్కెట్లో SUVల వర్షం కురుస్తోంది. స్విఫ్ట్ ధరకు దగ్గరగా ఉన్న అనేక SUV మోడళ్లను వినియోగదారులు ఎంచుకుంటున్నారు, మంచి గ్రౌండ్ క్లియరెన్స్, బలమైన రోడ్ ప్రెజెన్స్, ఎక్కువ ఫీచర్లతో కూడిన SUVలు కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. స్విఫ్ట్‌లో కొన్ని ఆధునిక ఫీచర్లు లేకపోవడం కూడా వినియోగదారుల నిర్ణయాన్ని ప్రభావితం చేస్తోంది.
డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ADAS ఫీచర్లు, లేదా కనెక్టెడ్ టెక్నాలజీ వంటి అంశాలు ప్రస్తుతం అనేక హ్యాచ్‌బ్యాక్‌లు, SUVల్లో అందుబాటులో ఉండగా, స్విఫ్ట్ ఇంకా కొంత వెనుకబడి ఉంది. అయినప్పటికీ, స్విఫ్ట్ ఆకర్షణను మాత్రం కోల్పోలేదు. ప్రస్తుతం భారతీయ మార్కెట్లో 6.49 లక్షల ప్రారంభ ధర(ఎక్స్-షోరూమ్)తో ఇది బడ్జెట్-ఫ్రెండ్లీ కారుగా నిలుస్తోంది. టాప్ వేరియంట్ ధర రూ. 9.64 లక్షల వరకు ఉండగా, ఇది ఇంకా సరసమైన ఎంపికగా గుర్తించబడుతోంది.

ఇది సిజ్లింగ్ రెడ్, నావెల్ ఆరెంజ్, మాగ్మా గ్రే, స్ప్లెండిడ్ సిల్వర్ కలర్ వేరియంట్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. కొత్తగా వచ్చిన మారుతీ సుజుకీ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ అయినా కూడా, ఇప్పుడు ఇది పవర్, ఫీచర్లు, పనితీరులో ఎంతో మెరుగైన స్థాయికి చేరింది. కొత్తగా వచ్చి మార్కెట్‌ను అలరిస్తున్న ఈ మోడల్, అప్‌గ్రేడెడ్ పవర్‌ట్రెయిన్‌తో వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ కారుకు 1.2-లీటర్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ఉంది.
ఇది మెరుగైన టెక్నాలజీ ఆధారంగా రూపొందించబడింది. పెట్రోల్ వెర్షన్‌తో పాటు, CNG వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. భారీగా ఉన్న పెట్రోల్ ధరల నేపథ్యంలో ఇది వినియోగదారులకు గొప్ప ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది. ఈ పవర్‌ట్రెయిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎంపికలతో కూడా లభిస్తుంది. పెట్రోల్ వేరియంట్‌లో 24.80 kmpl వరకు, CNG వేరియంట్‌లో 32.85 km/kg వరకు మైలేజీ అందిస్తుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు


Click it and Unblock the Notifications








