ఫ్యామిలీకి దేశంలోనే బెస్ట్ కారు.. 32.85 కి.మీ మైలేజ్! గత నెలలో ఎంతమంది కొన్నారో తెలుసా?

మారుతి సుజుకి స్విఫ్ట్ (Maruti Suzuki Swift) భారతీయ కస్టమర్లలో ఏళ్ల తరబడి అగ్రస్థానంలో నిలిచే హ్యాచ్‌బ్యాక్. ఈ కారు దేశంలో ఎంత ప్రజాదరణ పొందిందంటే, చిన్న గ్రామం నుంచి పెద్ద మెట్రో నగరం వరకు ఎక్కడ చూసినా స్విఫ్ట్ ఒక్కసారి కనిపించకుండా ఉండదు. రోడ్డు మీద దూసుకెళ్తున్నప్పుడు కూడా దాని డిజైన్, స్టైలింగ్, యూత్‌ఫుల్ లుక్ వలన వెంటనే గుర్తుపడుతుంది. స్విఫ్ట్‌ను ఎందుకు అంతగా ఇష్టపడతారు అంటే, మొదటగా దీని డ్రైవింగ్ అనుభవం, లైట్ వెయిట్ బాడీ, మైలేజ్, మెయింటెనెన్స్ ఖర్చులు, మన కుటుంబానికి పర్ఫెక్ట్ కారు అన్న పేరును తెచ్చాయి. ఇంకా, దీని ఇంజిన్ పనితీరు, రిఫైన్మెంట్, ఎక్కువ కాలం ఉపయోగించినా కూడా ఎక్కువ సమస్యలు రాకపోవడం వలన ప్రజలు దీనిని నిరభ్యంతరంగా కొనుగోలు చేస్తుంటారు.

అయితే అమ్మకాల పరంగా చూస్తే, ఈసారి స్విఫ్ట్‌కు కొంచెం వెనుకంజ పడినట్లు కనిపిస్తోంది. అక్టోబర్ 2025లో మారుతి కేవలం 15,542 స్విఫ్ట్ కార్లను మాత్రమే విక్రయించగలిగింది. కానీ గత సంవత్సరం ఇదే నెలలో అంటే అక్టోబర్ 2024లో మొత్తం 17,539 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంటే సరిగ్గా 1,997 కార్లు తక్కువగా అమ్ముడయ్యాయి. దీని వల్ల స్విఫ్ట్ అమ్మకాల్లో 11 శాతం క్షీణత నమోదైంది.

Maruti Suzuki Swift October 2025 Sales 15542 Units

ఈ తగ్గుదల ప్రభావం అక్టోబర్ 2025 టాప్-10 బెస్ట్ సెల్లింగ్ కార్ల జాబితాపైనా పడింది. గతంలో ఎప్పుడూ టాప్ పొజిషన్‌లను ఆక్రమించిన స్విఫ్ట్, ఈసారి 10వ, చివరి స్థానానికి పరిమితమైంది. అమ్మకాలు తాత్కాలికంగా తగ్గడం వల్ల ఈ కారుపై ఉన్న ప్రజల ప్రేమ తగ్గిందనుకోవడం తప్పు. స్విఫ్ట్‌కు ఉన్న నమ్మకం, పాపులారిటీ చాలా బలంగా ఉన్నాయి. మారుతి సుజుకి కూడా మోడల్ అప్‌డేట్లు, కొత్త ఫీచర్లతో దీని అమ్మకాలు పెరగొచ్చు.

రాబోయే నెలల్లో స్విఫ్ట్ మరోసారి పుంజుకొని టాప్ స్థానాలను తిరిగి స్వాధీనం చేసుకోవడం అనుమానమే లేదు. ధరల విషయానికి వస్తే, మారుతి సుజుకి స్విఫ్ట్ రూ. 5.79 లక్షల ప్రారంభ ధరతో మార్కెట్లో లభిస్తోంది. టాప్ వేరియంట్ ధర కూడా కేవలం రూ. 8.65 లక్షలు మాత్రమే (ఎక్స్-షోరూమ్). ఈ ధరల్లోనే అందించే ఫీచర్లు, కంఫర్ట్, పనితీరు ఈ కారును మరింత ఆకర్షణీయంగా మారుస్తాయి.

Maruti Suzuki Swift October 2025 Sales 15542 Units

స్విఫ్ట్‌లో సరిపడ శక్తి కలిగిన 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ అమర్చబడి ఉంది. ఇది 82 PS పవర్, 112 Nm టార్క్ అందిస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ AMT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో జత చేయబడింది. మైలేజీ విషయంలో కూడా స్విఫ్ట్ ఎప్పట్లాగే ముందే ఉంది, ఇది 24.80 నుండి 25.75 kmpl వరకు ఇస్తుంది. అంతేకాదు, CNG వేరియంట్ కూడా అందుబాటులో ఉంది.

1.2-లీటర్ CNG ఇంజన్ 70 PS పవర్, 102 Nm టార్క్ ఇవ్వగలదు. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది, 32.85 km/kg వరకు మైలేజీ అందిస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 170 కి.మీ., అలాగే 0 నుంచి 100 కి.మీ. వేగాన్ని కేవలం 12 సెకన్లలో అందుకుంటుంది. 5 సీట్లు, సౌకర్యవంతమైన క్యాబిన్, కుటుంబ ప్రయాణాలకు సరిపోయే 265 లీటర్ల బూట్ స్పేస్ ఉంది.

Maruti Suzuki Swift October 2025 Sales 15542 Units

భద్రత విషయానికొస్తే, కొత్త స్విఫ్ట్ అత్యంత అభివృద్ధి చెందిన ఫీచర్లను కలిగి ఉంది. 6 ఎయిర్‌బ్యాగులు, ABS, EBD, TCS, 3-పాయింట్ సీట్‌బెల్ట్‌లు, సీట్‌బెల్ట్ రిమైండర్ వంటి ముఖ్యమైన సేఫ్టీ ఫీచర్లు ప్రతి ప్రయాణాన్ని మరింత సురక్షితంగా మారుస్తాయి. ఈ కారు క్యాబిన్ డిజైన్ బాగుంది. ఇందులో 9-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటో క్లైమేట్ కంట్రోల్, USB టైప్-సి పోర్ట్, వైర్‌లెస్ ఛార్జర్ వంటి ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Tuesday, November 25, 2025, 9:40 [IST]
English summary
Maruti suzuki swift october 2025 sales 15542 units more details inside
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+