ఫ్యామిలీకి దేశంలోనే బెస్ట్ కారు.. ధర బాగా తగ్గించారు.. 32.85 కి.మీ మైలేజ్, కొత్త ధరలు ఇవే

భారత ఆటోమొబైల్ రంగంలో మారుతి సుజుకి ఒక అగ్రగామి సంస్థ. దేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే మోడళ్ల జాబితాలో ఎప్పటికీ అగ్రస్థానంలో నిలిచే కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ అంటే అదే మారుతి సుజుకి స్విఫ్ట్ (Maruti Suzuki Swift). ఈ కారు విడుదలైన మొదటి రోజునుంచే యువత నుంచి కుటుంబాల వరకు అందరి హృదయాలను గెలుచుకుంది. ఇంధన సామర్థ్యం, మన్నికైన ఇంజిన్, స్పోర్టీ డిజైన్, సౌకర్యవంతమైన రైడింగ్ అనుభవం స్విఫ్ట్‌ను ఒక పర్ఫార్మెన్స్ కార్గా నిలబెట్టాయి. ఇక ఉపయోగించిన కార్ల మార్కెట్లో కూడా స్విఫ్ట్‌కు డిమాండ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇతర మోడళ్లతో పోలిస్తే దీని రీసేల్ విలువ ఎక్కువగా ఉండటం వల్ల, రెండవ చేతి మార్కెట్లో కూడా ఈ కారు అత్యంత వేగంగా అమ్ముడవుతుంది. ఈ విషయమే దాని ప్రజాదరణకు నిదర్శనం.

ఇలాంటి సందర్భంలో, ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన GST సవరణల ప్రయోజనాలను వినియోగదారులకు అందించడానికి మారుతి సుజుకి ముందుకు వచ్చింది. కంపెనీ తన మొత్తం శ్రేణిలో ధరలను సవరించింది. అందులోనూ స్విఫ్ట్ మోడల్‌పై ధర తగ్గింపు మరింతగా ఆకర్షిస్తోంది. కొత్త పన్ను స్లాబ్ కింద, స్విఫ్ట్ ధరలు భారీగా రూ. 85,000 వరకు తగ్గించబడ్డాయి. ఈ కారు వేరియంట్ల వారీగా తగ్గింపు వివరాలను ఒకసారి ఈ కథణంలో చూద్దాం.

Maruti Suzuki Swift Variants Wise New Price After Gst Rate Cut

మొదటగా మాన్యువల్ వేరియంట్లను చూస్తే, స్విఫ్ట్ బేస్ మోడల్ LXI ఇప్పుడు కేవలం రూ.5.79 లక్షల ఎక్స్‌-షోరూమ్ ధరకు లభిస్తోంది. ఇంతకు ముందు ఇది రూ.6.49 లక్షలు ఉండగా, ఇప్పుడు రూ.70,000 తగ్గింపు వచ్చింది. అదే విధంగా VXI వేరియంట్ కొత్త ధర రూ.6.59 లక్షలు. మరొక వేరియంట్ VXI (O) ధర రూ.6.85 లక్షలు కాగా, ఇది పాత ధర రూ.7.57 లక్షల నుండి రూ.72,000 తగ్గింది.

ZXI వేరియంట్‌ను రూ.7.53 లక్షలకు కొనుగోలు చేయవచ్చు. పెట్రోల్ మోడల్‌లో టాప్-ఎండ్ ZXI+ ధర ఇప్పుడు రూ.8.20 లక్షలు మాత్రమే. CNG వేరియంట్లను పరిశీలిస్తే, VXI CNG ధర రూ.7.45 లక్షలు, VXI (O) CNG ధర రూ.7.71 లక్షలు, అలాగే ZXI CNG ధర రూ.8.39 లక్షలుగా నిర్ణయించారు. ఈ విధంగా CNG మోడల్ కూడా మంచి ఆప్షన్‌గా నిలుస్తోంది.

Maruti Suzuki Swift Variants Wise New Price After Gst Rate Cut

ఆటోమేటిక్ మోడల్‌(AMT) వైపు చూస్తే, GST రేట్ కట్ కారణంగా గేర్‌లెస్ వేరియంట్లపై పెద్ద మొత్తంలో తగ్గింపు వచ్చింది. VXI AMT ధర ఇప్పుడు రూ.7.04 లక్షలు మాత్రమే కాగా, ఇది పాత ధర రూ.7.80 లక్షల నుండి రూ.76,000 తగ్గింది. VXI (O) AMT ధర రూ.7.30 లక్షలు, ZXI AMT ధర రూ.7.98 లక్షలు, ఇక టాప్-ఎండ్ ZXI+ AMT కొత్త ధర రూ.8.65 లక్షలు.

మొత్తం మీద, మాన్యువల్, CNG, ఆటోమేటిక్ అన్ని వేరియంట్లలోనూ కొత్త ధరలు కస్టమర్లకు పెద్ద ఊరట కలిగిస్తున్నాయి. ఒక హ్యాచ్‌బ్యాక్ కోసం చూస్తున్న వారికి స్విఫ్ట్ ఇప్పుడు మరింత ఆకర్షణీయమైన ఆప్షన్‌గా మారింది. ధరల్లో భారీ తగ్గింపులు వచ్చినా, మారుతి సుజుకి స్విఫ్ట్‌లో మెకానికల్ లేదా డిజైన్ పరంగా ఎటువంటి మార్పులు చేయలేదు.

Maruti Suzuki Swift Variants Wise New Price After Gst Rate Cut

ఈ హ్యాచ్‌బ్యాక్‌ మైలేజ్ విషయానికి వస్తే, స్విఫ్ట్ పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ 24.80 kmpl ఇస్తుంది. అదే ఇంజిన్‌తో వచ్చే AMT ఆటోమేటిక్ వేరియంట్ మాత్రం కొంచెం ఎక్కువగా 25.75 kmpl మైలేజీని అందిస్తుంది. ఇక CNG వెర్షన్ విషయానికి వస్తే, అది మరింత ఎకానమికల్‌గా 32.85 km/kg మైలేజీని తిరిగి ఇస్తుంది.

More from DriveSpark

Article Published On: Thursday, October 2, 2025, 7:30 [IST]
English summary
Maruti suzuki swift variants wise new price after gst rate cut details
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+