క్రెటాకు షాక్ ఇవ్వనున్న మారుతి సుజుకి కొత్త ఎస్‌యూవీ.. ఏకంగా మూడు వేరియంట్స్‌.. ధర కూడా రూ.12లక్షల్లోపే

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి.. ఇప్పుడు హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta) కు గట్టి పోటీనిచ్చేందుకు సరికొత్త ఎస్‌యూవీని సిద్ధం చేసింది. సెప్టెంబర్ 3న ఈ కొత్త కారును మార్కెట్‌లోకి విడుదల చేయనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది.

ఇటీవల మారుతి సుజుకి ఈ ఎస్‌యూవీకి సంబంధించిన ఒక టీజర్‌ను విడుదల చేసింది. అందులో ఆకర్షణీయమైన ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్‌లను చూపించింది. ఈ టీజర్ ఇప్పుడు కారు లవర్లలో ఉత్కంఠను పెంచుతోంది. ఈ కొత్త ఎస్‌యూవీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

Maruti Suzuki to Launch New SUV to Rival Hyundai Creta Teaser Revealed

డిజైన్, అంచనాలు
టీజర్‌లో చూపించిన టెయిల్ ల్యాంప్ డిజైన్ చాలా స్టైలిష్‌గా, లేటెస్టుగా, అడ్వాన్సుడ్‎గా కనిపిస్తుంది. దీనికి 3D లుక్‌తో పాటు, ఎలక్ట్రానిక్ బ్రేక్ ల్యాంప్, రెండు వైపులా టర్న్ ఇండికేటర్లు ఉన్నాయి. మొదటి చూపులో ఈ డిజైన్ మారుతి సుజుకి స్విఫ్ట్ (Maruti Suzuki Swift) ను పోలి ఉన్నప్పటికీ, ఇది దానికంటే చాలా ఆకర్షణీయంగా ఉంది.

ఈ కొత్త కారును గ్రాండ్ విటారా (Grand Vitara), బ్రెజా (Brezza) మిడిల్ ప్లేసులో ఉంచారు. మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం.. ఈ కారు పేరు మారుతి ఎస్కూడో(Maruti Escudo) కావచ్చు. ఇది అరీనా డీలర్‌షిప్‌ల ద్వారా విక్రయించబడుతుంది. తద్వారా ఎక్కువ మంది కస్టమర్లను ఆకట్టుకోవాలని మారుతి లక్ష్యంగా పెట్టుకుంది.

Maruti Suzuki to Launch New SUV to Rival Hyundai Creta Teaser Revealed

ఫీచర్లు, అదనపు సమాచారం
ఈ కొత్త ఎస్‌యూవీ అనేక ప్రీమియం ఫీచర్లతో వస్తుంది. ఇది గ్రాండ్ విటారాలో ఉన్న ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది. 9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జర్ వంటివి ఇందులో ఉన్నాయి.

అంతేకాకుండా, ఇందులో అడ్వాన్సుడ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) లెవల్-2, డాల్బీ అట్మోస్ టెక్నాలజీ కూడా ఉండవచ్చని సమాచారం. సేఫ్టీ విషయంలో ఈ కారుకు 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్‌ విత్ ఈబీడీ (ABS with EBD), రివర్స్ పార్కింగ్ సెన్సార్‌లు, 360-డిగ్రీ కెమెరా వంటివి ఉన్నాయి.

ఇంజిన్, పనితీరు
మారుతి సుజుకి తన కొత్త ఎస్‌యూవీలో వివిధ ఇంజిన్ ఆప్షన్లను అందిస్తుందని భావిస్తున్నారు. ఇందులో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్, 1.5-లీటర్ పెట్రోల్-సీఎన్‌జీ (Petrol-CNG), 1.5-లీటర్ పెట్రోల్-హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. పెట్రోల్ ఇంజిన్ 101 బీహెచ్‌పీ పవర్‌ను, 139 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఇక హైబ్రిడ్ వెర్షన్‌లో, ఎలక్ట్రిక్ మోటార్ సహకారంతో మొత్తం 115 బీహెచ్‌పీ పవర్ ఉత్పత్తి అవుతుంది. ఇంధన సామర్థ్యంపై దృష్టి సారించి ఈ కారును రూపొందించారు. ఇటీవల, మారుతి భారతదేశంలో లిథియం-అయాన్ బ్యాటరీలను తయారు చేయడం ప్రారంభించినందున, ఈ కారు ధర కూడా అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, August 29, 2025, 11:33 [IST]
English summary
Maruti suzuki to launch new suv to rival hyundai creta teaser revealed
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+