కొత్త ఏడాదిలో పేదలకు ఇష్టమైన కంపెనీ నుంచి తక్కువ ధర, ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లు వచ్చేస్తున్నాయ్

ఎన్నో కొత్త ఆశలతో అడుగుపెట్టిన 2025 ఏడాదిలో దేశీయ ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ మారుతీ సుజుకీ (Maruti Suzuki) పలు కొత్త కార్లను విడుదల చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. 2024లో అమ్మకాల పరంగా ఈ కంపెనీ అగ్రస్థానంలో నిలిచింది. గత ఏడాదిలో కొత్త మోడళ్లను విడుదల చేసి, వాటిని విజయవంతంగా అన్ని వర్గాల కస్టమర్లకు చేర్చగా, ఇప్పుడు 2025లో అంతకంటే ఎక్కువ సేల్స్‌ను సాధించడానికి, మిగతా కంపెనీల కంటే టాప్ ప్లేస్‌‌లో నిలవడానికి అదిరిపోయే ఫీచర్లతో, ప్రజలకు అందుబాటు ధరలో, ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లను ఈ ఏడాది లాంచ్ చేయడానికి సిద్ధం అయింది. పెట్రోల్, డీజిల్ కార్లతో పాటు ఎలక్ట్రిక్ మోడళ్లను కూడా మార్కెట్లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తుంది. మారుతీ సుజుకీ నుంచి ఈ ఏడాదిలో గ్రాండ్ విటారా, బాలెనో వంటి కార్లు లాంచ్ కాబోతున్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలు క్రింది కథనంలో తెలుసుకుందాం.

Maruti Suzuki Grand Vitara: మారుతి సుజుకి గ్రాండ్ విటారా మూడు పవర్‌ట్రెయిన్‌లతో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఇది 1.5-లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్(పెట్రోల్ + ఎలక్ట్రిక్), 1.5-లీటర్ CNG, 1.5-లీటర్ మైల్డ్ హైబ్రిడ్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. కొత్తగా అప్‌డేట్ ఫీచర్లతో వస్తున్న ఈ కారు డిజైన్ ప్రస్తుతం అందుబాటులో ఉన్న గ్రాండ్ విటారా మోడల్ మాదిరిగానే ఉంటుంది. రాబోయే కొత్త కారును ఇటీవల టెస్టింగ్‌ కూడా చేశారు.

Maruti Suzuki Top Upcoming Cars In 2025

మారుతి సుజుకి గ్రాండ్ విటారా ఒక Suv మోడల్. ఇది 7 సీటర్ ఆప్షన్లలో కొనుగోలుకు లభిస్తుంది. గేర్‌బాక్స్ విషయానికి వస్తే, 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌, E-CVT గేర్‌బాక్స్ సెటప్‌ను ఇంజిన్‌కు జోడించారు. cng వెర్షన్‌లో మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఉండవచ్చని తెలుస్తుంది. ఇక, మైలేజ్ విషయానికి వస్తే, . ఇది 20.58 నుంచి 27.97 kmpl వరకు అందిస్తుందని కంపెనీ పేర్కొంటుంది.

Maruti e-Vitara:ఇ-విటారా ద్వారా మారుతీ సుజుకీ మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఇతర కార్ల తయారీ కంపెనీలు ఈవీ విభాగంలో ముందు స్థానంలో ఉండగా, దేశంలోని అతిపెద్ద కార్ల కంపెనీ మరుతీ సుజుకీ మాత్రం ఈ విభాగంలో ఇంకా వెనుకబడి ఉంది. దీంతో ఈ కొత్త మోడల్‌తో ఈ సెగ్మెంట్‌లో కూడా సత్తా చాటడానికి ప్రయత్నాలు చేస్తుంది.

Maruti Suzuki Upcoming Cars

ఇటీవల కాలంలో ఇటలీలోని మిలాన్‌లో జరిగిన ఒక ఈవెంట్‌లో సుజుకి మోటార్ కార్పొరేషన్ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు ఇ-విటారాను ఆవిష్కరించింది. ఈ కారు అధునాతన సదుపాయాలతో రాబోతుంది. ఇండియా మార్కెట్లోకి విడుదల అవుతూనే, జపాన్, యూరోపియన్ యూనియన్ వంటి ఇతర అంతర్జాతీయ మార్కెట్లో కూడా విడుదల చేయాలని చూస్తుంది. మార్కెట్ వర్గాల అంచనాల ప్రకారం, దీని ధర రూ.22 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకు ఉంది.

Maruti Suzuki Brezza: మారుతీ సుజుకీ బ్రెజ్జా కొత్తగా మరిన్ని అప్‌డేట్ ఫీచర్లతో విడుదల కాబోతుంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న మోడల్‌తో పోలిస్తే, 2025 బ్రెజ్జా అదనపు సదుపాయాలతో రాబోతుంది. అంచనాల ప్రకారం, దీని ప్రారంభ ధర రూ.8.50 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ఉంటుంది. దీనిలో టాప్ వేరియంట్ ధర మరింత ఎక్కువగా ఉంటుంది. సబ్‌కాంపాక్ట్ SUVల నుంచి పోటీ పెరుగుతున్న నేపథ్యంలో ఈ అప్‌డేట్ కారును తెస్తున్నారు.

Maruti Suzuki Baleno: మారుతీ సుజుకీ బాలెనో పాత మోడల్ ఇండియాలో అత్యంత డిమాండ్ ఉన్న కారుగా ఉంది, ఇది చిన్న కుటుంబానికి అనువుగా ఉంటుంది. చాలా మంది దగ్గర ఇది కనిపిస్తుంది. మార్కెట్లో ఈ మోడల్ సక్సెస్ కావడంతో 2025 అప్‌డేట్ ఫీచర్లతో బాలెనో కారు విడుదల కాబోతుంది. దీన్ని 2024లోనే అభివృద్ధి చేసినట్లు సమాచారం ఉంది. ఇప్పుడు కొత్త ఏడాదిలో ఘనంగా లాంచ్ చేయడానికి మారుతీ సిద్ధమైంది.

More from DriveSpark

Article Published On: Tuesday, January 7, 2025, 11:08 [IST]
English summary
Maruti suzuki top upcoming evitara brezza baleno cars in india 2025
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+