కొత్త రికార్డు క్రియేట్ చేసిన మారుతి సుజుకి ట్రూ వాల్యూ.. 60 లక్షల సెకండ్ కార్ల అమ్మకాలతో సంచలనం
సెకండ్ హ్యాండ్ కారు కొనాలని ఆలోచిస్తున్న చాలామంది మొదటగా ఎంచుకునేది మారుతి సుజుకి ట్రూ వాల్యూనే. తొలిసారిగా వాహనం కొనుగోలు చేసే వారికి కలిగే అన్ని సందేహాలను, ఇబ్బందులను ట్రూ వాల్యూ బృందం నివృత్తి చేస్తుంది. కస్టమర్ల విశ్వాసం, పారదర్శకత, వృత్తిపరమైన సేవలతో ట్రూ వాల్యూ 2001 నుండి ఇప్పటివరకు 60 లక్షల కార్లను విక్రయించి ఒక కొత్త మైలురాయిని చేరుకుంది.
ఎందుకంత నమ్మకం?
కొత్తగా కారు కొనాలనుకునే వారు ట్రూ వాల్యూకు వస్తే, వారికి ఉన్న అన్ని సందేహాలు, ఇబ్బందులను ఈ సంస్థ తీరుస్తుంది. అందుకే ట్రూ వాల్యూ గణాంకాల ప్రకారం, వారి నుంచి కార్లు కొనుగోలు చేసే 80 శాతం మంది మొదటిసారి కారు కొంటున్నవారేనట. ఈరోజుల్లో 305 నగరాల్లో 606 ట్రూ వాల్యూ షోరూమ్‌లతో ఈ సంస్థ దేశంలోనే అతిపెద్ద నెట్‌వర్క్‌గా నిలిచింది. ఒకవేళ కస్టమర్‌కి ఏదైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ట్రూ వాల్యూ బృందం ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తుంది.

సెకండ్ హ్యాండ్ కార్లు కొంటే లాభాలా?
కొత్త కారు కొనాలంటే పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు పెట్టాలి. కానీ ఒక సెకండ్ హ్యాండ్ కారును జాగ్రత్తగా కొనుగోలు చేస్తే భారీగా డబ్బు ఆదా చేసుకోవచ్చు. కొత్త కారును అర్జెంట్‌గా అమ్మాలంటే దాని విలువ చాలా తగ్గుతుంది, కానీ సెకండ్ హ్యాండ్ కారు విలువ అంతగా తగ్గదు.
తక్కువ ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ ఖర్చులు
కొత్త కార్లతో పోలిస్తే సెకండ్ హ్యాండ్ కార్లకు ఇన్సూరెన్స్ ప్రీమియం చాలా తక్కువ. కారు పాతది అయ్యే కొద్దీ ప్రీమియం తగ్గుతుంది కాబట్టి, ఇది ఒక పెద్ద లాభం. అలాగే, కొత్త కారు రిజిస్ట్రేషన్ ఖర్చు కంటే సెకండ్ హ్యాండ్ కారు రిజిస్ట్రేషన్ చాలా తక్కువగా ఉంటుంది. దాదాపుగా నాలుగో వంతు ఖర్చుతోనే ఈ పని అయిపోతుంది.

లోన్, బేరమాడే అవకాశాలు
సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్‌లో పోటీ చాలా ఎక్కువ. అందుకే, మీకు వాహనాలపై అవగాహన ఉన్న మెకానిక్‌ను వెంట తీసుకువెళ్లి బేరం ఆడటం ద్వారా మంచి ధరకే కారును పొందవచ్చు. అలాగే సెకండ్ హ్యాండ్ కార్లకు కూడా లోన్ సౌకర్యం ఇప్పుడు అందుబాటులో ఉంది. అయితే వడ్డీ రేటు కాస్త ఎక్కువగా ఉంటుంది, కానీ ఎక్కువ డౌన్‌పేమెంట్ ఇస్తే వడ్డీ రేటును తగ్గించుకోవచ్చు.
ఈ కారణాలన్నింటినీ పరిశీలిస్తే, కొత్త కారుకు బదులుగా సెకండ్ హ్యాండ్ కారును కొనడం అనేది చాలా లాభదాయకమైన నిర్ణయం అని చెప్పవచ్చు. మారుతి సుజుకి ట్రూ వాల్యూ 60 లక్షల సెకండ్ హ్యాండ్ కార్లను విక్రయించి ఒక కొత్త రికార్డు సృష్టించింది. తక్కువ ఖర్చుతో విశ్వసనీయమైన యూస్డ్ కార్లు కొనాలనుకునేవారికి ట్రూ వాల్యూ బెస్ట్ ఆప్షన్.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








