Maruti e-Vitara: మారుతి నుంచి తొలి ఎలక్ట్రిక్‌ కారు ఆవిష్కరణ.. ఇక మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీల కష్టాలు తీరినట్లే

దేశీయ అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ (Maruti Suzuki) నుంచి ఎప్పుడెప్పుడు ఎలక్ట్రిక్ కారు వస్తుందా అని ఎదురుచూస్తున్న వారికి ఇప్పుడు శుభవార్త చెప్పింది. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరుగుతున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 ఈవెంట్‌లో కంపెనీ తన మొదటి ఎలక్ట్రిక్ కారు ఇ విటారా(e-Vitara)ను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే ఇండియాలోనే ఈవీ వాహనాల వాడకం విపరీతంగా పెరుగుతుంది. ఇప్పటికే టాటా మోటార్స్, హ్యుందాయ్ వంటి పలు కార్ల తయారీ కంపెనీలు ఈ విభాగంలో ముందడుగు వేసి ఈవీ కార్లను సేల్ చేస్తున్నాయి. అయితే దేశంలోనే అతిపెద్ద కార్ల ఉత్పత్తి దారుగా ఉన్నటువంటి మారుతీ మాత్రం ఇంత కాలం ఈ సెగ్మెంట్‌లో వెనుకబడి ఉంది. అయితే ఇప్పుడు కంపెనీ భారత ఎలక్ట్రిక్ మార్కెట్లో ఇ విటారాను తీసుకొచ్చి పెను సంచలనాలకు తెరలేపింది.

మారుతీ సుజుకీ నుంచి విడుదలైన మొదటి ఎలక్ట్రిక్ కారు ఇ విటారాతో కంపెనీ ఇతర ఈవీ తయారీదారులకు గట్టి పోటీ ఇస్తోంది. ఇప్పటికే మారుతీ కార్లకు దేశంలో మంచి డిమాండ్ ఉంటుంది. పెట్రోల్, డీజిల్, cng కార్లు అత్యధికంగా అమ్ముడుపోతుంటాయి. అలాంటిది ఈ కొత్త ఈవీ కారుకు మంచి ఆదరణ లభిస్తుందని కంపెనీ భారీ అంచనాలు పెట్టుకుంది. ఈ ఎలక్ట్రిక్ SUV అందుబాటు ధరలో లభించినట్లయితే సేల్స్ విపరీతంగా పెరుగుతాయి.

Maruti Suzuki Unveiled e Vitara Electric Car

మారుతీ ఇ విటారా రెండు బ్యాటరీ ప్యాక్‌లతో 49 kWh, 61 kWhలలో లభిస్తుంది. 49 kWh ఆప్షన్ 144 bhp పవర్, 189 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అదే 61 kWh ఆప్షన్ 184 bhp పవర్, 300 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది సింగిల్ ఛార్జ్‌తో ఏకంగా 500 కి.మీల వరకు ప్రయాణిస్తుందని మారుతీ సుజుకీ పేర్కొంటుంది.

ఇ విటారా డిజైన్ వినియోగదారులను కట్టిపడేస్తుంది. ఇది Nexa త్రీ మ్యాట్రిక్స్ LED హెడ్‌ల్యాంప్‌లు,గ్లోస్ బ్లాక్ ఫ్రంట్ గ్రిల్, LED DRLలు, టెయిల్ ల్యాంప్‌లు వంటి వాటితో చాలా అట్రాక్టివ్‌గా ఉంది. ఎక్స్‌టీరియర్ డిజైన్‌తో పాటు లోపల క్యాబిన్ కూడా విశాలంగా అందంగా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కారును ఇండియాలోనే తయారు చేస్తారు. దేశీయంగా విక్రయిస్తూనే. అంతర్జాతీయంగా ఇతర దేశాలకు సైతం ఎగుమతి చేస్తారు.

AWD వెర్షన్‌లో 19-అంగుళాల బ్లాక్-అవుట్ ఏరోడైనమిక్ అల్లాయ్ వీల్స్‌తో ఎక్స్‌టీరియర్ అందాన్ని పెంచుతాయి. దీని బాడీ కూడా గట్టిగా ఉంటుంది. కారు లోపల కూడా అధునాతన ఫీచర్స్ డజన్ల కొద్ది ఉన్నాయి. పెద్ద 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌, 2-స్పోక్ స్టీరింగ్ వీల్‌, 10-వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, మూడు లేయర్లుగా డివైడ్ చేసిన డ్యాష్‌బోర్డ్, డ్యూయల్ డిస్‌ప్లేలు వంటివి ఉన్నాయి.

అలాగే, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, మెరుగైన AC వెంటిలేషన్ ఉన్నాయి. ముఖ్యంగా ప్రయాణికుల భద్రతకు సంబంధించి 7 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, చుట్టు ప్రక్కల చూడటానికి 360-డిగ్రీ కెమెరా,అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ , మొదటి స్థాయి-2 ADAS ఫీచర్లు వంటి పలు సేఫ్టీ అంశాలు ఈ కారులో ఉన్నాయి.

ఆటో ఎక్స్‌పోకి సంబంధించిన లైవ్‌ అప్‌డేట్స్‌ కోసం మా డ్రైవ్‌స్పార్క్‌ సోషల్‌ మీడియా పేజీలను ఫాలో అవ్వండి. మా తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు.

More from DriveSpark

Article Published On: Friday, January 17, 2025, 15:30 [IST]
English summary
Maruti suzuki unveiled new e vitara electric car in the auto expo 2025 check all details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+