మారుతీ ఊహించని సర్‌ప్రైజ్ ప్లాన్.. కార్ మార్కెట్ షేక్ కావాల్సిందే! కొత్త ఆట మొదలుపెట్టబోతుంది
మారుతీ సుజుకీ (Maruti Suzuki) ఇండియా ఆటోమొబైల్ రంగంలో తమ ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు ప్రత్యేకంగా హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి పెట్టింది. మారుతున్న మార్కెట్ అవసరాలకు తగ్గట్టు పలు మోడళ్లను విడుదల చేయాలని చూస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో టయోటా, టాటా మోటార్స్, మహీంద్రా లాంటి కంపెనీలు తమ తమ ఎలక్ట్రిక్ కార్లతో దూసుకుపోతుండగా, మారుతీ కూడా అదే పోటీలో నిలవాలని గట్టి ప్రయత్నాల్లో ఉంది. ముఖ్యంగా కంపెనీ రాబోయే కాలంలో ఐదు కొత్త కార్లు మార్కెట్‌లోకి విడుదల చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఈ కార్లలో కొన్ని హైబ్రిడ్ మోడళ్లైతే, మరికొన్ని పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలుగా ఉండనున్నాయి. ఈ కొత్త కార్లపై వినియోగదారులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. రాబోయే ఆ మోడళ్ల గురించి కింద మరింత తెలుసుకుందాం.
మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ ఫేస్‌లిఫ్ట్ (ఫ్రాంక్స్ హైబ్రిడ్): SUV లైనప్‌ను మరింత ఆకర్షణీయంగా చేసేందుకు ఇప్పుడు ఫ్రాంక్స్‌ను హైబ్రిడ్ రూపంలో తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే మార్కెట్‌లో మంచి గుర్తింపు పొందిన ఈ SUVకి, ఇప్పుడు హైబ్రిడ్ టెక్నాలజీ వేరియంట్ రూపంలో రావడం విశేషం. ఈ కొత్త హైబ్రిడ్ వేరియంట్‌ను ఈ ఏడాది ద్వితీయార్ధంలో మార్కెట్‌లో విడుదల చేయవచ్చని అంచనాలు ఉన్నాయి. ఇది పెట్రోల్‌తో పాటు ఎలక్ట్రిక్ మోటార్‌ను కలిగి ఉంటుంది.

ఈ హైబ్రిడ్ కారు దాదాపు 35 kmpl కంటే ఎక్కువ మైలేజీని అందిస్తుందని అంచనా. ఇది సరికొత్త టెక్నాలజీతో, స్టైలిష్ డిజైన్‌తో రాబోతుంది. అయితే హైబ్రిడ్ వేరియంట్‌లో ఎలాంటి డిజైన్ మార్పులు చేయకుండా, ఇప్పటికే ఉన్న డిజైన్‌ను కొనసాగనుందని సమాచారం. 9-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్, స్మార్ట్ కంట్రోల్ ఫీచర్లు, అందమైన ఇంటీరియర్‌తో ఇది త్వరలోనే వినియోగదారులకు అందుబాటులోకి రాబోతుంది. ప్రస్తుతం ఫ్రాంక్స్ రూ.7.52 లక్షల ఎక్స్ షోరూమ్ ధరతో లభిస్తుంది.
టాప్ వేరియంట్ అయితే రూ. 13.03 లక్షల వరకు ఎక్స్-షోరూమ్‌లో లభిస్తోంది. కొత్త హైబ్రిడ్ వేరియంట్ కూడా ఈ ధరలో ఉండే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే, ఈ హైబ్రిడ్ ఫ్రాంక్స్‌కి మార్కెట్లో భారీ క్రేజ్ రావడం ఖాయం. హైబ్రిడ్ వాహనాలు ప్రస్తుతం బాగా సేల్ అవుతున్న తరుణంలో రాబోయే మారుతీ కారు కూడా భారతీయ ప్రజలను బాగా ఆకట్టుకోవడంతో పాటు, కంపెనీకి కూడా సేల్స్ పెరగడానికి దోహదం చేయనుంది.

మారుతీ ఇ విటారా: మారుతీ సుజుకీ తన తొలి పూర్తిగా ఎలక్ట్రిక్ SUVగా 'ఈ-విటారా' (eVitara) ను మార్కెట్‌లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. మార్కెట్లో మారుతున్న ట్రెండ్, ఎలక్ట్రిక్ వాహనాల పట్ల పెరుగుతున్న ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని, క్లాసిక్ SUV మోడల్ అయిన విటారాను తాజాగా ఎలక్ట్రిక్ వేరియంట్‌గా తీసుకొస్తుంది. ఇప్పటికే 2024 జనవరిలో జరిగిన గ్రాండ్ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ఈ కొత్త eVitaraను అధికారికంగా పరిచయం చేశారు
ఈ ఎలక్ట్రిక్ SUVలో రెండు బ్యాటరీ ప్యాక్‌లు ఉంటాయి. ఒకటి 49 kWh, మరొకటి 61 kWh. పూర్తి ఛార్జ్‌తో ఈ కారు సుమారుగా 500 కిలోమీటర్లకు పైగా ప్రయాణించవచ్చని అంచనా. ఇది మార్కెట్లోని ఇతర ఎలక్ట్రిక్ SUVలతో పోల్చితే మంచి రేంజ్. ఫీచర్ల పరంగా కూడా ఇది అందరి అంచనాలకు తగ్గట్టుగానే వస్తోంది. టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఫుల్ డిజిటల్ క్లస్టర్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.

మారుతీ సుజుకీ eWX: కంపెనీ తన చిన్న ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కారైన eWXను మార్కెట్‌కు పరిచయం చేయడానికి సిద్ధమవుతోంది. ఈ కారు 2027 నాటికి భారతదేశ రోడ్లపై కనిపించే అవకాశముంది. చిన్న కారు విభాగంలో టాటా టియాగో EV, MG కామెట్ EV వంటి మోడళ్లకు సూటిగా పోటీ ఇచ్చేందుకు మారుతీ ఈ కొత్త ఎలక్ట్రిక్ కారును రూపొందిస్తోంది. నగర ప్రయాణాలకు ఇది చాలా కంఫర్ట్‌గా ఉంటుంది.
ఈ eWX హ్యాచ్‌బ్యాక్, రూపంలో చిన్నదైనప్పటికీ, కెపాసిటీలో మాత్రం హై-పెర్ఫార్మెన్స్ ఇవ్వగలదని మార్కెట్ వర్గాలకు భారీ అంచనాలు ఉన్నాయి. అంచనాల ప్రకారం, ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 200 కిలోమీటర్లకు పైగా రేంజ్ అందించగలదని భావిస్తున్నారు. ధర రూ. 10 లక్షలలోపే ఉండవచ్చు. సిటీలో రోజువారీ ప్రయాణాల కోసం, యువత, ఉద్యోగులు, చిన్న కుటుంబాలకు ఇది ఒక బెస్ట్ ఆప్షన్‌గా నిలవనుంది. ఎక్స్‌టీరియర్‌తో పాటు ఇంటీరియర్ కూడా ఆకట్టుకోనుంది.

5-సీటర్ కొత్త మారుతీ SUV: మారుతీ సుజుకీ తన కస్టమర్ల కోసం కొత్త 5-సీటర్ SUVను మార్కెట్‌లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోందన్న ఊహాగానాలు ఇప్పుడు మార్కెట్లో ఉన్నాయి. ఈ కొత్త SUVకి ఇంకా అధికారికంగా పేరు పెట్టలేదు, కానీ ఇప్పటికే ఇది గ్రాండ్ విటారా డిజైన్‌ను పోలి ఉంటుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ప్రీమియమ్ లుక్‌ను కలిగి ఉన్నప్పటికీ, మారుతి దీన్ని అరీనా డీలర్‌షిప్‌ల ద్వారా విక్రయించే అవకాశముంది.
ఈ SUVలో 5 మంది సౌకర్యంగా కూర్చునే విధంగా సీటింగ్ ఉండబోతోంది. దీని ఇంటీరియర్ కూడా మెరుగైన ఫినిష్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, క్లైమేట్ కంట్రోల్, అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లతో నిండి ఉండే అవకాశం ఉంది. ఇంకా కంపెనీ అధికారికంగా ప్రకటించకపోయినా, మూడు నెలలలోపు ఈ SUVను లాంచ్ చేసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇది మిడ్-సైజ్ SUV సెగ్మెంట్‌లో మరో హాట్ కాంపిటీటర్‌గా నిలవనుందని చర్చ.
కొత్త మారుతీ సుజుకీ కాంపాక్ట్ MPV: ఫ్యామిలీ కారు లైనప్‌ను మరింత విస్తరించేందుకు మరో కొత్త ప్లాన్‌తో ముందుకు వస్తోంది. తక్కువ ధరలో అందుబాటులో ఉండే కొత్త కాంపాక్ట్ MPV ని విడుదల చేయాలని చూస్తుంది. ఇది ప్రత్యేకంగా ఫ్యామిలీ అవసరాలు దృష్టిలో ఉంచుకుని రూపుదిద్దుకుంటున్న మోడల్ అని తెలుస్తోంది. ఈ కొత్త MPV ఇప్పటికే 'YDB' అనే కోడ్‌నేమ్‌తో రోడ్లపై టెస్టింగ్‌కు గురవుతున్నట్లు సమాచారం.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








